Panchanga Sravanamu

Panchanga Sravanamu

https://youtu.be/lQYeOsXEvK4

పంచాంగ శ్రవణం……

దేశ , విదేశాలలో ఉన్న తెలుగు వారందరికీ శ్రీవికారి నమ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, శ్రీ శార్వరి నమ సంవత్సరానికి, స్వాగతిస్తూ , వచ్చే శార్వరి , రాబోయే ప్లవ నమ సంవత్సరముల మధ్యనున్న కాల ఘడియలు కల ఘడియలు ఎలా ఉన్నవో తెలుకునే ప్రయత్నమే ఈ పంచాంగశ్రవణం

శ్రీ శార్వరి నామ సంవత్సరములో విశేషమైన శుభఫలాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే ఆ నామమే శుభాన్ని సూచిస్తుంది, లక్ష్మి నామాన్ని సూచిస్తుంది, శార్వరి నామాన్ని, అర్ధని చుస్తే, రాత్రి అని అర్ధం కూడా గోచరిస్తుంది. ఒక రోజులో రెండు పార్శ్వాలు ఉంటాయి, అందు మొదటి పార్శ్వము పగలు, రెండవ పార్శ్వము రాత్రి సూచిస్తుంది. ఈ శార్వరి నామానికి రాత్రి అనే అర్ధంకూడా చూడవచ్చు .

జంభాసురుడిని సంహారం సందర్భం గ ఈ శార్వరి అనే నామం వస్తుంది ధర్మ రక్షణార్థం లేదా సంస్థాపనార్ధం, ఈ శార్వరి కాపాడుతాం జరుగుతుంది . అధర్మాన్ని నిర్ములనచేసి ధర్మాన్ని వృద్ధి చేస్తుంది.

ఈ జగత్హు అంత , ధర్మం మీద ఆధారపడింది, అందుచే ఈ శార్వరి నామ సంవత్సరం ధర్మాన్ని కాపాడుతుంది. ప్రభావాది నమ సంవత్సరములో ముప్పది నాలుగవ సంవత్సరం, సస్య వృద్ధి ఎక్కువగ , పంటలు బాగా పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుందిరాజుల మధ్య పోటీ తత్త్వం ఉంటుంది, రాజుల మధ్య, జయేశ్చ్చ ఉంటుంది,

చాంద్రమాన రీత్యా, శార్వరి నామ సంవత్సరం, అన్ని శుభాలు చేకూరుస్తుంది. పంచాంగ శ్రవణం (వినుట) చేయుట వలన, సమస్త కల్యాణ గుణాలు కలుగుతాయి, శత్రువులు దూరమవుతారు, గంగ స్నానం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది అని పెద్దలు వచించుట జరిగింది

పంచ అంగములంటే… తిధి, వార, నక్షత్ర, యోగ, మరియు కరణ లను కలిపి పంచాంగములని అనుట జరుగుతుంది..

తిధి-శ్రేయస్సు-శ్రీయం-ఆర్ధిక వృద్ధి
వార-అయ్యుష్ వృద్ధి
నక్షత్ర-పాపం నశిస్తుందని
యోగ-రోగ నివారణ (సరస్వతి యెాగము:, త్రిలోచన యెాగము:-;కేమద్రుమ యెాగము:;అనభ యెాగము;సునభ యెాగము :.. మొత్తం ఎనిమిది) ఇవి కాకుండా మహా పంచ యోగములు కూడా ఉన్నాయ్ (రుచిక, సస, భద్ర, హంస, మాళవ)
కరణ-కార్య సాధిస్తుంది (పదకొండు-బావ, బాలావ, కౌలువా…)

ప్రతి రోజు, ఈ ఐదు అంగాలు గురించి తెలుసుకోవాలి, ఒక ఉగాది నాదే కాకుండా , ఒక అలవాటుగా చేసుకుంటే మంచిందని పూర్వాశ్రమములోనే పెద్దలు చెప్పుట జరిగింది

ఉగాది నాడు నిభా కుసుమ భక్షణం చేయాలి, ఉగాది పచ్చడి సేవించాలి, బెల్లం, వేపపువ్వు, (షడ్రుచులు (తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు) మరియు పంచాంగ శ్రవణం చేయుట ఉత్తమం

ఉగాది పచ్చడి స్వీకరించుట ద్వారా ఆ పరంధాముడు ఇచ్చిన అయ్యుష్ మేరకు వజ్రదేహులై ఉంటారని, సర్వ అరిష్టాలు తొలిగుతాయి అని పెద్దలు చెపుతున్నారు

వసంతం (ఆనందం, ఉత్సాహం, చురుకుదనం) మొదటి మాసమైన చైత్రం, మొదటి తిధి ఐనా శుద్ధ పాడ్యమి, నక్షత్రం ఐనా రేవతి అంతం, అశ్విని ప్రారంభం, మొదటి యోగం, మొదటి కరణ తో ప్రారంభం అందుకే, ఉగాది అని వాడుకలోకి వచ్చింది..

ఈ శార్వరి నమ సంవత్సరములో ఉన్న నవ నాయకులూ….

బుధుడు-రాజు-గాలి భయం అధికం, స్త్రీ పురుషుల మధ్య అన్యోనత తగ్గుతుంది,
చంద్రుడు-మంత్రి- వర్షాలు పడతాయి, ఆరోగ్యం, సుభిక్షం
రవి-సేనాధిపత్యం-యుద్ధాలు జరుగుతాయి, తూఫాన్, ఎర్ర ధాన్యం
బృహస్పతి-సస్యాధిపతి-శుభాలు-పసుపు నేల , సెనగలు, గోధుములు వృద్ధి
కుజుడు-ధాన్యాధిపతి-ఎర్ర నేల యందు తృణ ధాన్యాలు వృద్హి
రవి-అర్ఘాధిపతి- ధరలు తగ్గుతాయి, ప్రజలకు ఆకలి బాధలు, రాజుల మధ్య యుద్దాలు-రవి ధ్యానం చేయాలి
రవి-మేఘాధిపతి-పంటలు స్వల్పం-భయం అధికం గ, ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి
శని-రసాధిపతి-రస పదార్దాలు-నేతి,, నూనె, గిట్టుబాటు ధర రాదు-శని ఆరాధన చేసిన ప్రతికూలం నుంచి అనుకూలం
బృహస్పతి-నీరసాధిపతి-శుభఫలితాలు-రత్నం, బంగారం,దూది, తోళ్ళు, మంచి గంధం వృద్ధి చెందుతాయి

మేఘాధి నిర్ణయం

మేరువు నుంచి ఉత్తర దిక్కుగా సంవర్త అనే మేఘం వర్షిస్తుంది-(వాయు పూరితంగా ఉంటుంది)
ఎక్కువ భాగం సముద్రములో, కొంత bagam పర్వతాలు, మిగిలిన భాగం భూమి ఫై ఫై వర్షిస్తుంది

పుష్కారాలు…….

తుంగభద్ర (కార్తికిక సుధాహా షష్టి నుంచి బహుళ పాడ్యమి వరకు )

మౌడ్యమి…

శుక్ర మౌడ్యమి, – శుభకార్యాలు చేయరాదు
గురు మౌడ్యమి (పుష్య మాసం)
శుక్ర మౌడ్యమి (మాఘ మాసం-ప్లవ నమ సంవత్సర చైత్ర మాసం)

గ్రహణాలు..ఐదు

మూడు చంద్ర గ్రహణాలు -కంటికి పూర్తి గ కనపడవు (అవగాహన కోసమే)-కొంత మసక బారినట్టుగా
రెండు సూర్య గ్రహణాలు (చూడామణి నామ సూర్య గ్రహణం) ఆదివారం-జప, హోమ, దానాలు-శుభప్రదం-ఆదివారం రావడం అదృష్టం- అంగుళీయకారములో కనపడుతుంది
రాహు గ్రస్త, జేష్ఠ మాస మృగశిర నాలుగవ పదం, ఆర్ద్ర ఒకటవ పదం- మృగశిర, ఆర్ద్ర, మిధున రాశీ వారికి ప్రతికూలం

వర్ష లగ్నం ఫలితాలు (అధిక శుభాలు) -కర్కాటక-శుభ లగ్నం-వర్షం ప్రారంభం-చంద్రుడు- భాగ్య కారకుడు. సుఖాలు, ఆర్ధిక వృద్ధి, నీటి నిజాయీతగ, ధర్మం గ , మంచి ఆలోచన పరంగా, ప్రజలు కు నచ్చిన్నట్టుగా పాలకులు పాలిస్తారు, విశేషం గ సంపదలు, వర్షాలు, పాడి పంటలు, దేశా విదేశాలలో అభివృద్ధి, విద్య పరంగా, విదేశీ ప్రయాణాలు, స్త్రీలకూ అనుకూల పరిస్థితులు , అధికారులు సమర్ధవంతముగా భాద్యతలు నిర్వర్తించుట , రాజకీయాలలో మిత్రత్వం ఎక్కువ శత్రుత్వం కన్నా , ఆధ్యాత్మిక భావన ఎక్కువుగా ఉంటుంది, వ్యాపారులు శ్రద్ద ఎక్కువగా గ ఉండాలి, గురువు, కేతు, రవి గ్రహములకు సంబందించిన ధ్యానములు చేసుకోవాలి, గణపతి ఆరాధన మంచిది

జగత్ లగ్నం, తులా లగ్నం-శుక్రుడు-కేంద్ర, రాష్ట్ర అవగాహనతో పనిచేసుకోవాలి, ఆర్ధిక వృద్హి , సకాలములో వర్షం, పాడిపంటలు, ఆహార పదార్దాలు, శ్రమ అవసరం -ఆశయాలు నెరవేరతాయి, ప్రజలు చక్కటి విజయాన్ని పొందుతారు , విద్యార్థులకి కలసి వచ్చే కాలం

మొత్తం మీద, ఈ శ్రీ శార్వరి నమ సంవత్సరములో, శుభ మరియు అశుభ మిశ్రమ ఫలాలు, ప్రజలు సుఖంగా ఆనందంగా ఉండే అవకాశాలు సరిసమానంగా గోచరిస్తున్నాయి..

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్”