అమ్మ మనసు, అమ్మ తత్త్వం, అమ్మ ప్రేమ, అమ్మ దూరదృష్టి…అమ్మే గురువు
అమ్మ మనసు, అమ్మ తత్త్వం, అమ్మ ప్రేమ, అమ్మ దూరదృష్టి…అమ్మే గురువు
అమ్మ మనసు, అమ్మ తత్త్వం, అమ్మ ప్రేమ, అమ్మ దూరదృష్టి…అమ్మే గురువు…. ఎందుకు అంటే…. మరి అమ్మ నోటినుంచి జాలువారిన, ఈ లాలీ పాటను, చదివి, తెలుసుకొని, అన్వయించుకొంటే , ప్రతి బిడ్డ, ఆ కన్నా తల్లిని, కంటికి రెప్పలా (ఆ రెప్పే కదా మన కంటినీ ఎళ్లవేళ కాపాడేది) కాపాడుకోవలసిన భాద్యతను కలిగి ఉందాం…
“జో అచ్యుతానంద, జోజో ముకుంద
రావే పరమానంద, రామ గోవిందా”
ప్రతి హిందూ స్త్రీ, తన చిన్ని బిడ్డని ఊయలలో పరుండబెట్టి, లాలీ పాట రూపములో ఒక్క గొప్ప జీవిత తత్వాన్ని, తన మృదు మధుర స్వరముతో, గానంతో, ఆ చిన్ని బిడ్డకు, నిద్రపుచ్చుతూ అందచేస్తుంది… ఆహా ఎంత అదృష్టవంతులమో కాదా మన హైన్దవు సోదర మరియు సోదరీమణులు…
“అచ్యుత” అంటే, “జారిపోకుండా” కాపాడేవాడు అనే అర్ధం, అందుకే, ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి అచ్యుత అనే నామధేయం కలదు…
“ముకుంద” మృదు, మధుర, పలుకులు లేదా మాటలు, ఇంకాచెప్పాలంటే, ఎదుటివారికి, ఎటువంటి ఉద్విగ్నతకు గురికాకుండా మాటలాడుట, “ఆనందం”లో ఉంచువాడు, అనే గుణాన్ని లేదా అర్ధములోనే తీసుకోవాలి ఈ “ముకుంద” నామాన్ని…
“పరమానంద” ఎప్పుడు అయితే, మంచి మాటలు మాట్లాడుతూ, ఎవ్వరికి ఉద్విగ్నత కలగకుండా, ఆనందాన్ని పంచుతూ ఉంది, క్రిందకు జారకుండా ఉంటాడో, వాడు, ఎప్పుడు పరమానందాన్ని పొందుతూనే ఉంటాడు అనే అర్ధములో చూడాలి…
“రామ గోవిందా”, రామ అంటే “ధర్మమని” మనం చాల సార్లు మననం చేసుకొంటూ ఉంటాము, అందుకే శ్రీరాముడిని “రామో విగ్రహవాన్ ధర్మః” అనే వేదం లేదా బ్రాహ్మణం చెపుతూ ఉంటుంది, అనాదిగా… గోవిందా అంటే, “రక్షించేవాడు” అనే అర్ధం కదా, అందుకే, మనం తిరుమల గిరి పైకి చేరేవేళ, మనమంతా, గోవిందా గోవిందా అనే నామ సంకీర్తనతో, తిరుమల గిరిని, మనమంతా ఈ నామధేయాముతో, మారుమ్రోగిస్తాము..
ఆ కన్న తల్లి, చెపుతుంది, నాయనా, నిన్ను రక్షించేది ఆ “ధర్మమే”, ఆ ధర్మాన్ని ఆచరణలో చేసి చూపిస్తే, నీకు మిగిలేది “ఆనందమే”, అందుకే, అందరితోనూ, ఆనందం కలిగించే మాటలు ధర్మబద్ధమైనవి, ఎవ్వరికి, ఉద్విగ్నత లేకుండా భాషించిన, నువ్వు తిరిగి ఈ మర్త్యలోకములోకి వచ్చే అవసరం లేకుండా, ఆ పరంధాముడు చూస్తాడు అనే అద్భుతమైన తత్వాన్ని, మన శ్రవణాల ద్వారా మన మనసులోకి, హత్తుకొనే విధముగా… ఆ కన్నా తల్లి తపన చూసాం కదా, మరి మన ముందునా కర్తవ్యం ఆచరణే…
ఇప్పుడు, చూడండి, మన అమ్మ, మన చిన్నపుడు, ఊయలలో ఉండగానే, ఈ అద్భుతమైన, భావజాలాన్ని, తన చిన్నారి బిడ్డకు, లాలీ రూపములో, అందిస్తుంది…ఇంత గొప్ప తత్వాన్ని, మన హైన్దవు స్త్రీ కాక, మరెవరైనా ఈ భూమండలం పైన ఉన్నారా….
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు”
జై శ్రీమన్నారాయణ
సంత్ బాబా గారు, చెప్పిన, visistaadwytam ను, ఆదికవి, వాల్మీకి మహర్షి, గురువు ద్వారానే ఈ జీవునికి పరంధాముడనే చేరగలిగే విధానం, అని చూపిన ఘట్టం, సుందరకాండ లో, ఎలాగా, ఎక్కడా అంటే, సాక్షాతూ “హనుమంతులవారిని” గురువుగా చూపిస్తూ, “సీతమ్మని” జీవాత్మగా చూపిస్తూ, “రామచంద్రుడుని” పరమాత్మునిగా చూపిస్తూ, ఆ సీతమ్మతల్లి కూర్చున్న అశోకవనంలో శింశుపా వృక్షంక్రింద…
అంతేగాని, గురువుద్వారా జీవునికి, మోక్ష ప్రాప్తికి సంధానకర్త, అని చెప్పటానికి మాత్రం ఈ సీతాపహరణాన్ని ఉపాయముగా నిర్ణయించలేదు…
గురువు: నిస్వార్ధ స్వరూపం (“లాభా”పేక్ష కానీ “కీర్తి”, “కనక” మరియు “కాంత” కాంక్ష కానీ మరిఎటువంటి “భావావేశానికి” లోని కానీ వారుగా చెప్పబడతారు..)
జీవాత్మ: శారీరక ఉపాధిలో ఉన్న జీవాత్మ, తనకున్న, ఇంద్రియాగ్రహణం ద్వారా, ఈ మాయ (బంగారు జింక) ప్రపంచములో చిక్కుకొనుట…. లేదా అరిషడ్వార్గముల చేతిలో, నాట్యమాడు బొమ్మలగుట…
పరమాత్మ: నిజానికి జీవాత్మకు మరియు పరమాత్మకు ఎటువంటి విభేదం లేదు, కాకపోతే, పరమాత్మ, పఞ్చాఉపనిషద్ స్వరూపం, జీవాత్మ పాంచభౌతిక స్వరూపం… అంతే…పరమాత్మునిలో, ఆ మూడు గుణాలు (సత్వ, రజో మరియు తమో) సమానముగా ఉంటాయి, జీవాత్మ(శారీరక ఉపాధి) లో ఈ మూడు గుణాలు (సత్వ, రజో మరియు తమో) హెచ్చు తగ్గులు అగుపిస్తూఉంటాయి…సమయం, సందర్భాని బట్టి….
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు”
“జనకుని మాట వినే తల్లి, మా జానకి మాత
వేరోకరు తన జనకుని మాట వినే తండ్రి, మా రామయ్య.” ఆహా, ఇదికదా భార్య భర్త ఆలోచన విధానం, ఆచరణ అమోగయోగ్యముగా గ్రహించబడేది…
చూసారా, ఒకరికొకరు ఆంటే ఇదే కదా, అందుకే కదా , ప్రతి ఒక్క కాబోయే దంపతిని (దంపతులను), ఆ సీతారాములాగా ఉండమని దీవించేది, ఆ వివాహ పత్రిక మీద ” ఆ సీతారాముల శ్లోకం” వేస్తారు, అలాగే “ఇయం సీత మమ సుత సహా ధర్మ చరితవా….. పాణినా” అని సీతారాముల కళ్యాణములో వేదమంత్రం ఆ వేదం పండితులు చదువుతారు
జై శ్రీమన్నారాయణ