దేవత వాహనాల్లో కానీ, వారి చేతుల్లో ఉన్న ఆయుధాలు కి చాల తాత్వికత…
దేవత వాహనాల్లో కానీ, వారి చేతుల్లో ఉన్న ఆయుధాలు కి చాల తాత్వికత…
దేవత వాహనాల్లో కానీ, వారి చేతుల్లో ఉన్న ఆయుధాలు కి చాల తాత్వికత (మనం వాటిని చూసి, ఏమి నేర్చుకోవచ్చు అనే కోణములో ఆలోచన చేయకలగాలని ) అనుసంధానం చేసి పూర్వాశ్రములో పెద్దలు మనకి చూపించారు, అయితే అన్నింటి గురించి చెప్పటం ఇక్కడ కుదరదు కాబట్టి, ఒకటి లేదా రెండు గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం …
మధుర మీనాక్షి తల్లి చేతిలో, చిలుక ఉంటుంది, అంటే అర్ధం, మధురమైన పలుకలు, చిలుక పలుకుల గ ఉండాలని చెపుతారు, అంటే, చిలుక, తనకు తానూ గ మాట్లాడలేదు, మనం ఏది నేర్పితే అదే పలుకుతుంది, అవసరమైనప్పుడే, మాట్లాడాలి అని, ఆ మాటలు కూడ, మధురం గ ఉండాలని, చివరగా, అవే మనకి భూషణులుగా గుర్తించబడుతాయి, అంతేగాని, మనం ధారణ చేసిన, ఆభరణాలకు వాటికీ అవే విలువ గాని ధారణ చేసిన వాళ్ళకు ఏమి లేదు, మన మధుర భాషణములే మన భూషణుములు గ పెద్దలు చెపుతారు, అవునా ! కాదా !
మహాలక్ష్మి (జిహ్వాగ్రే (జిహ్వ అంటే నాలుక , అగ్రే (పైన లేదా చివరన అని అర్ధం, అంటే, నాలుక పైన లేదా చివరన ఉండే తల్లి, లక్ష్మి, అంటే సత్య వాచ (అని లక్ష్మి సహస్రనామాలలో చెప్పబడింది కదా..) వసతే లక్ష్మి అని శాస్త్ర వాక్యం) యొక్క వాహనం ఏనుగు , అంటే అర్ధం, మనకి ఉన్న జ్ఞానేంద్రియాలని వాటి యొక్క విశిష్ట తెలుసుకోవటం అనే అర్ధం లో చూపించారు, ఎలాగా అంటే, ఆహరం మీద నియంత్రణ కోసం ఆ తొండం క్రింద ఉన్న నోరు, మరియు అలోచించి మాట్లాడాలని ,పెద్ద పెద్ద చెవులు, ఎక్కువుగా వినటం అలవాటు చేసుకోవాలని, చిన్న చిన్న కళ్ళు, ప్రతి విషయాన్ని చాల సునిశితం గ పరిశీలంచాలని.. ఈ విధమైన తత్వాన్ని దాచి మనకి పక్షిని, జంతువని, ఆ దేవత లో చెంత ఉంచిమనకు అందచేసినారు…
అలాగే దుర్గ మాత యొక్క వాహనం, సింహం, మహావిష్ణువు యొక్క వాహనం పక్షీన్ద్రుడు, స్కందుని యొక్క వాహనం నెమలి, చేతిలో కోడి …. ఇలా ప్రతి వాహనానికి ఒక తత్త్వం దాగి ఉన్నది…
అలాగే, ఆ దేవత స్వరూపాల ఆయుధములు కి కూడ తత్వాలని ఆపాదించారు పెద్దలు…
అలాగే దేవత (దేవత అనే పదమునకు వెలుగు అనే అర్ధం లో చూడాలి ) శారీరక (వెంటనే మనకు ఒక సందేహం మరి దేవతలకు శరీరం లేదు అని కదా చెపుతారని.. నేను ముందుగానే చెప్పినట్టుగా మనకి తత్వాన్ని అందచేయటం కోసం ఆ విధం గ చూపించటం జరుగుతుంది ) రంగు ను , చూపించడములో కూడ తాత్వికత దాగి ఉన్నది… ఉదాహరణకి ,మహావిష్ణువు- నల్లని వాడు గ , మహాశివుడు- తెల్లని వాడు గ … అవునా ! కాదా !
జై శ్రీమన్నారాయణ