ధృత్యా సాగరలంఘనం హనుమతో, లంకామదోత్పరణం
ధృత్యా సాగరలంఘనం హనుమతో, లంకామదోత్పరణం
జై శ్రీరామ్ జై హనుమాన్
“ధృత్యా సాగరలంఘనం హనుమతో,
లంకామదోత్పరణం,
తత్రా శోకవనే చ మార్గణ, మధ శ్రీ జానకీ దర్శనం,
రామక్షేమ నివేదనం , వనతరు ప్రద్వాంసనం, సంయుగే రక్ష సంహాననం, పురీ ప్రదహనం
రామాయన్నే సుందరం”
హనుమంతులవారు సముద్రం లంఘించుట, లంకాదేవి గర్వమును అణచుట , లంక లోను, అశోక వనములోను సీతకై వెదుకుట, జానకీదేవిని దర్శించుట, రాముని క్షేమముని ఆమెకు వినిపించుట, అశోక వనములోని వృక్షములని పాడుచేయుట, యుద్ధం లో రాక్షసులను సంహరించుట, లంకను తగలబెట్టుట్ట ,
“రాఘవో విజయం దద్వాన్ మమ సీత పతిహీ ప్రభుహు “-ఈ ఒక్క వాక్యం లో సుందరకాండ లోని ఎన్ని సర్గలు రోజు చదవాలి అనే రహస్యాన్ని పెద్దలు ఇందు పొందుపరిచారు (ఆ విషయాన్ని మనం తరువాత చుద్దాం)
అమ్మ ఉమా, మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి లేదా మొదటిది;
సుందరకాండ అంటే సుందరమైన కాండను లేక కోల్పోయినది తిరిగి పొందిన కాండ, అని కదా మీ సందేహం?
మీ సందేహం లోని, తెలివిగా సమాధానం ఉంచి, తిరిగి, మమల్ని, సందేహ నీవృతికి
ఇక్కడ ఉంచినందు చాల సంతోషం తల్లి. మన చేతుల్లో నుంచి, జారిపోయిన వస్తువు
లేదా వ్యక్తి ,తిరిగి మన చెంతకు వచినప్పుడు కలిగే ఆనందమే సుందరం, అవునా?
కాదా?
ఒక ఉదాహరణ ఇక్కడ ఉంచుతాను, కొంచెం త్వరగా అవగతం కోసం, ఒక మంచి ఊహ చేస్తున్న, ఒక భర్త , (భార్య అనకూడదు) ధర్మపత్ని కి వారి వివాహ మహోత్సవ సందర్భం గ ఒక మంచి విలువైన వజ్రపు ఉంగరం కానుకగా బహుకరించారు అనుకుందాం (ఊహే గ తప్పు లేదు) , ఒక రోజు, ఆ ఇల్లాలు ఇల్లు శుభ్రం చేసే క్రమం లో, ఆ ఉంగరం వేలి నుంచి, జారీ పడిపోయింది, పాపం, ఆ ఇల్లాలు ఆ విషయాన్ని అప్పుడు గుర్తించలేదు, తరువాత గ్రహించి, ఇంటి ని పూర్తిగా వెతికిన, పాపం పడిపోయిన ఆ ఉంగరం జాడ తెలియరాలేదు.
సాయంత్రం, భర్త ఆఫీస్ నుంచి, తిరిగి ఇంటికి చేరిన వేళ, ధర్మపత్ని, బేలా గ ఉండుట చూసి, విషయం తెలుసుకొని, ఓదార్చి, మరేం ఇబ్బంది లేదు, నేను, మరియొక ఉంగరం అంతకంటే ఎక్కువ విలువైనది కొంటాను, మరి సిద్దమే న, అయితే బయలుదేరు అని, బజార్ కి బయలుదేరి, చెప్పినట్టుగానే, మంచి ముందు కొన్న ఉంగరం కంటే, విలువైనదే బహుకరించారు. కథ సుఖాన్తమ్.
మరునాడు, ఆ ఇల్లాలు ఇంటి శుభ్రం చేస్తూ, ఆ పోయిన ఉంగరం గురించి ఆలోచన చేస్తూ, కొత్త ఉంగరం కన్నా పాత ఉంగరం చాల బావుంది, అని ఒకటికి పది సార్లు, అనుకుంటూ పని చేస్తున్నారు. అకస్మాత్తు గ నిన్న పడిపోయిన ఉంగరం తిరిగి ఆ తల్లి కి కనిపించింది, వెంటనే, ఆ తల్లి, ఆనందంతో మనసు నిండి పోయింది. భర్త ఇంటికి తిరిగి రాగానే, జరిగిన విషయం అంతా చెప్పి, ఆనందడోలికలో విహరించారు.
ఇప్పుడు, ఆ తల్లి మనసు, పోయిన వస్తువు , తిరిగి పొందగానే, సుందరమైంది (ఆనందమైంది), ఈ తత్వాన్ని, వాల్మీకి మహర్షి, రామయ్యను మరియు సీతమ్మ ను , అడ్డుగా పెట్టి, హనుమయ్య చేత, ఇంట అద్భుతమైన, సుందరమైన, ఆనందకరమైన విషయాన్ని, మనకు, సుందరకాండలో అంతర్లీనం గ చూపిస్తున్నారు.
రామయ్య చేతి నుంచి అమ్మ జారిపోయింది , పంచవటిలో, అలాగే సీతమ్మ నుంచి రామయ్య జారిపోయినారు (మాయ మృగం రూపం లో ఉన్న -మారీచ) , ఆ సమయం లో, హనుమయ్య, లంక కు, వెళ్లి, సీతమ్మ జాడ తెలిసికొని, రామయ్య జాడ సీతమ్మ కి, సీతమ్మ జాడ రామయ్య కి, తెలిచేప్పి, ఇరువురి మనసులయందు, ఆనందాన్ని కలుగ చేసినారు కదా! ఇక్కడ రామ రావణ యుద్ధం గురుంచి చెప్పా అవసరం లేదని, నా అభిప్రాయం.
అయితే సుందరం అంటే, “ఆనందం-అనిర్వచనం “, చేజారిన వస్తువు, తిరిగి పొందినపుడు కలిగిన స్పందన పేరే ఆనందం కదా, అదే సుందరం అంటే!
ఇక్కడ, వాల్మీకి మహర్షి, అద్భుతమైన శ్లోకాన్ని, మనకి అందచేసినారు, అది, మరునాడు, ఇక్కడే పోస్ట్ చేస్తాను, మన అందరికోసం, మరి అంతా వరకు, ఈ సందేహ నివృతి నుంచి సెలవా మరి!
జై శ్రీమన్నారాయణ.