Blog

ధ్యానం విశిష్టత:

thought-of-the-day

ధ్యానం విశిష్టత:

ధ్యానంతో మనసును జయించవచ్చు. ఉదయం వీలైనంతసేపు భగవంతుడి యందే దృష్టి నిలిపి ధ్యానం చేయడం అలవరచుకుంటే, మనసు రోజంతా నిర్మలంగా ఉంటుంది. మనసును అదుపు చేయగల శక్తి భగవన్నామ స్మరణకే ఉంది. అందుకే పూజా నియమం. పూజ చేసే సమయంలో మనసులో వేరే ఆలోచనలు రానీయక భగవంతుడియందే మనసు లగ్నం చేస్తే ఏకాగ్రత అలవడుతుంది. మనసును అదుపు చేస్తే అరిషడ్వార్గాలు మరియు అసూయ, అసంతృప్తి, అసహనం, అహంభావాలు దరికిరావు. కోరికలను అదుపు చేసుకున్న సంతృప్తికర జీవితం సుఖమయ మవుతుంది.

ఉన్నతమైన మానవజన్మ లభించినందుకు మానవత్వాన్ని మరచిపోకూడదు. మనసు వెళ్లిన చోటికి కళ్ళు వెళ్ళకూడదు , కళ్ళు వెళ్లిన చోటికి కాళ్ళు వెళ్ళకూడదు అంటే మనిషి వెళ్ళకూడదు. నీతి నియమాల కళ్ళెం వేసి మనసును నియత్రించకలిగితే, జీవితం ఆనందభరితమే. ఆరోహణ (ఉద్గతి) , అవరోహణ (అధోగతి) అంతా మనిషి యొక్క స్వయంకృతాపరాధమే

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్”

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *