పంచభూతములనుంచి ఎమన్నా తెలుసుకోవలసిన విషయం పరిజ్ఞానం ?
పంచభూతములనుంచి ఎమన్నా తెలుసుకోవలసిన విషయం పరిజ్ఞానం ?
జై శ్రీరామ్ జై హనుమాన్
ప్రతి ప్రాణమున్న జీవి యొక్క శరీరం, పాంచబౌతికంగా చెప్పబడుతుంది. అంటే, పంచభూతముల సమ్మెళనంతో తయారుచేయబడింది. అవునా ! కాదా !
ఆ పంచ భూతములు (“భూతం” అంటే, సామర్థ్యం కలిగినిదిగా భావించాలి, మనలో ఉన్న పంచభూతములు, కొంత సామర్థ్యం కలిగి ఉంటాయి, అదే, ప్రకృతి లో ఉన్న “భూతములు”, వాటి సామర్థ్యం గురించి, చెప్పాలంటే, మాటలు చాలవు, అనుభవైక నైవేద్యం కాదంటారా) !, వరుసగా;
గాలి, నీరు, నిప్పు, భూమి మరియు ఆకాశం గ పిలువబడుతాయి. మరి, వీటి కలయిక ద్వారా ఏర్పడ్డ ఈ సశరీరం తో ఉన్న జీవరాసులలో విశిష్టమైన మానవాళి ఏమి నేర్చుకోవాలి అనే ప్రశ్న ఉద్బవిస్తుంది, మరి చుద్దామా ఆ విషయాలు ఏమిటో..
ముందుగా గాలి నే తీసుకుందాం, గాలి సహజమైన స్వభావం ఎటువంటి వాసన లేకుండుట, అంటే, ఏమి లేని చోట, తన యొక్క సహజమైన (సు) గుణాన్ని కలిగి ఉంటుంది, అవునా ! కాదా ! కానీ, ఆ గాలి, ఒక గులాబీ తోట మీదనుంచి వెళ్ళితే ఆ గాలి సుగంధ పరిమలమవుతుంది, లేదా ఒక మురికి కాలువ మీదుగా వెళ్ళితే, చాల దుర్గంధపు కంపు వస్తుంది, అలాగే ఒక ఎడారి మీదుగా వెళ్ళితే, ఆ గాలికి, ఎటువంటి వాసన లేదా కంపు గాని లేకుండా ఉంటుంది, అవునా ! కాదా ! అంటే మనం మన రోజు వారి జీవితమూ లో, ఎన్ని రకాల మనుషులతో కలసిన, వారితో ఉన్నప్పుడు, ఎదుటవారకి, ఇతరులుగానే గుర్తించబడతాము, దీనినే మనం (బి లైక్ ఆ రోమన్ while ఇన్ రోమ్ అంటారుగా), కానీ, అది అంతవరకే, నిజానికి మనం వారిని
వదిలి ఇంటికి వచ్చినా తరువాత, మనకు మనంగానే జీవించడం అనే విషయాన్ని (ఆ జీవి యొక్క సస్వభావాన్ని తిరిగి తన అధీనములోనికి తీసుకోని రాగలగాలి ( స్వభావం అంటే, ఎవరు మన చుట్టూ లేనప్పుడు, మనం ఏ విధమైన ఆలోచనలు లేదా మన బిహేవియర్ ఉంటుందో, దానినే మన స్వభావం గ చెప్పబడుతుంది, మన స్వభావం ఎప్పుడు మార్పు చెందుతుంది అంటే, మన ఎదురుగ ఉన్న వస్తువు లేదా మనిషి లేదా విషయాన్ని బట్టి, మారుతుంది, అవునా ! కాదా ! అంటే మన స్వభావం ఎప్పుడు సహజ సిద్ధముగా ఉండాలి అంటే, సత్సాంగత్యం ఎంతయినా అవసరం, కాదంటారా !) ఆ గాలి యొక్క తత్వాన్ని చూసి నేర్చుకొనే ప్రయత్నం చేయాలి. అవునంటారా ! కాదంటారా !
నీరు ఎప్పుడు, ఫై నుంచి క్రిందకు లేదా ఎగువ నుంచి దిగువకు ప్రవహిస్తుంది, అవునా ! కాదా ! మరి ఇక్కడ మనం ఆ నీటినుంచి ఏమి తెలుసుకోవాలంటే, మనిషి అనేవాడు, ఎంత ఎత్తుకు ఎదిగిన, తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి అనే విషయాన్ని అర్ధం చేసుకొని, మానవులు జీవించగలరని ఆశిస్తూ.
పంచభూతములలో, ఉన్న మూడవ భూతము (నిప్పు (అగ్ని)) గురించి, తెలుసుకుందాం, మరి చుద్దాం రండి,
అగ్ని యొక్క ప్రధాన ధర్మం ఏమిటిఅంటే, తనని చేరిన ఏ వస్తువు అయినా ఒకే విధంగ, దగ్ధం (కాల్చి వేస్తుంది) చేస్తుంది అవునా ! కాదా !
అంటే మానవుడు, తన దగ్గరకి వచ్చిన వారియందు ఒకే విధంగ అంటే ధర్మబద్ధముగా ప్రవర్తించాలి అనే అర్ధాన్ని సూచిస్తుంది కాదంటారా ! ఔనంటారా !
పైన విషయం ఆచరణ చాల కష్టమనే భావనలో ఉన్నామనుకోండి, అప్పుడు, అగ్ని నుంచి, వేరొక తత్వాన్ని తెలుసుకుందాం, ఒక మంచి ఉదారణతో మీతో పంచుకుంటాను, ఇక్కడ
ఒక భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే, అయన ధర్మ పత్ని, ఒక గ్లాస్ నిండా మంచి నీరు తీసుకోని వచ్చి , ఆయనకు చేతికి అందచేసి, వంట ఇంటిలోనికి వెళ్లి, ఒక మంచి టీ (తయారుచేసే పనిలో, ఆ తల్లి, ఒక గిన్నె తీసుకోని, కొంత మంచి నీరు ఉంచి, కొంత టీ పొడి వేసి, ఆ గ్యాస్ స్టవ్ ను వెలిగించారు, అయితే ఆశ్చర్యంగా ఆ గ్యాస్ స్టవ్ లో మంట, పైకి కాకుండా క్రిందకి వెళ్ళింది అనుకుందాం కాసేపు, ఆ తల్లి, ఎప్పుడు, ఆమె, భర్త కి టీ చేసే ఆయన చేతికి ఇవ్వకలుగుతుంది, ఎప్పటికి అయన చేతికి ఇవ్వలేదు, ఎందుకు అంటే, ఆ మంట పైకి ఎగసితే కదా, పైన ఉన్న గిన్నె, అందులో ఉన్న మిశ్రమాన్ని, ఆ ద్రవాన్ని, రుచి గ చేసే, అందచేస్తుంది, అయితే ఇక్కడ ఆ అవకాశమే లేదు, అవునా ! కాదా !
అంటే, అగ్ని, పైకి ఎగసి తన పైన లేదా అధారపడ్డ విషయాలకు లేదా వస్తువులకు, ఉపయోగపడుతుంది, అలాగే మానవుడు కూడ, తానూ ఎదుగుతూ,తన పైన లేదా చుట్టూ ఉన్న వాళ్ళకి, ఉపయోగపడాలని, ఒక గొప్ప తత్వాన్ని ప్రస్ఫుటంగా సూచిస్తుంది, కాదంటారా ! ఔనంటారా !
మరి, అగ్ని నుంచి, ఈ తత్వాన్ని మనం అర్ధం చేసుకొని, మన జీవితానికి, అన్వయించుకొని, ఆ విధంగా జీవించే ప్రయత్నంచేసి, మంచి సమాజాన్ని నిర్మించుకొందాం ఏమంటారు!
పంచభూతములలో, ఉన్న నాలగవ భూతము (భూమి) గురించి, తెలుసుకుందాం, మరి చుద్దాం రండి,
మనఅందరకి తెలిసిన ఒక గొప్ప నానుడి, స్త్రీ కి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలని చెపుతూ ఉంటారు పెద్దలు. ఇక్కడ స్త్రీ కి అని ఎందుకు చెప్పారు అంటే, స్త్రీ, శక్తి యొక్క మరో రూపం, ఆ శక్తి కి గనక ఓర్పు లేకపోతే, విశ్వమును కూడ, దహించివేయకలిగిన సామర్థ్యం కలిగినది, అందుకే ఎటువంటి ప్రతికూల లేదా అనుకూల పరిస్థితులలో కూడ, ఓర్పు చాల అవసరమని పెద్దల యొక్క ఉవాచ,
ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలని అనిపిస్తుంది, కానీ ఎందుకో, కొంచెం సంకోచిస్తున్న, సరే, చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పడమే మంచిది, చదివేవారు లేదా చూసేవారి యొక్క స్థాయి బట్టి, అర్ధం స్ఫూరణకు అందుతుంది…. ఈ క్రింద ఉంచిన విషయాన్ని, పూర్వ ఆశ్రమములోని పెద్దలు, గజేంద్ర మోక్షం లో, చాలా అద్భుతంగా, ఈ విషయాన్ని లేదా సత్యాన్ని, కనులకు విందుగు, విన సొంపుగా, ఆవిష్కరించారు… వీలు కుదిరినప్పుడు, గజేంద్రమోక్షమా లో ఉన్న తత్వాన్ని తెలుసుకొనే ప్రయత్నం……
ఒక భార్య భర్త ఉన్నారని, అనుకుందాం, చిలుక గోరింకలుగా జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నారు, ఒకరంటే ఒకరికి వీపరీతమైన లేదా వల్లమాలిన అభిమానం లేదా ప్రేమ అనుకుందాం. ఒక క్షణం కూడ ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్థితి, అయితే కాలం, తన ధర్మాన్ని ఎట్టిపరిస్థిలోను, వదలుకోదు, అవునా ! కాదా !, ఆ క్రమములో, ఒకనాడు, ఆ భర్త మృత్యుముఖంలోకి జారుకున్నారు, అంతవరకు, ఎంతో ప్రేమతో, భర్తను దగ్గరకు తీసుకొనే భార్య, ఆ పార్థివ శరీరాన్ని, కనీసం, తన చెంతకు కాదు కదా, కనుచూపు దూరం లో కూడ, ఉంచటానికి ఇష్టపడక, ఆ పార్థివ శరీరాన్ని, స్మశానం లో, భూమి లో ఉంచబడుతుంది లేదా, ఆ అగ్ని మీద కాలి బూడిద గ రూపాంతరం చెందుతుంది…
తనకి ఇస్టమైన లేదా కాకపోయినా, తన దగ్గరకు చేరిన వస్తవును తనలో కలుపుకొని గుణాన్ని ఓర్పుగా చెప్పబడుతుంది. అంటే, మన ఇష్టాయిష్టాలతో, ప్రమేయం లేక, ఎవ్వరినైనా దగ్గరకి తీసుకొనే గుణాన్ని మనం ఆ భూమి ని చూసి, నేర్చుకొనే ప్రయత్నం చేద్దాం, ఇది చాల కఠినతరం కానీ, సాధనములు పలుకు సమకూరు ధరలోన అని పెద్దలు అన్నారుగా, మరియు, శ్రీకృష్ణపరమాత్ముడు, భగ్వద్గీత లో, అబ్యసాం వాళ్ళ కానిది లేదా రానిది అంటూ ఏది ఉండదు, అని ఆ జగత్గురువు మనకు, అందచేసిన గొప్ప సందేశం ఔనంటారా ! కాదంటారా !
పంచభూతములలో, ఉన్న ఐదవ భూతము (ఆకాశం) గురించి, తెలుసుకుందాం, మరి చుద్దాం రండి,
ఆకాశం చూడటానికి, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, లేదా ఒక్కసారిగా ఉరుములు మరియు మెరుపులు కురిపించి, భయబ్రాంతులకు గురిచేస్తుంది అవునంటారా ! కాదంటారా ! సరే ఆ విషయాన్ని అలావుంచి, ఏ తత్వాన్ని నేర్చుకోవలో చెప్పితే ఆనందిస్తాం, అంతేనంటారా! ఐతే రండి, కలిసి, ఆ తత్వాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం !
మనకి, ఆకాశం వైపు చూసినప్పుడు, మేఘములు, పక్షులు, విమానాలు, తదితరమైనవన్నీ అందు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి, ఏ ఒక్కట్టీ ఆకాశానికి తాకదు లేదా అందు ఉండజాలవు, అలాగే మనం కూడా, మన స్నేహితులతో, బంధువులతో, కుటుంబసభ్యులతో, కలిసి మెలిసి జీవించాలి, కానీ, ఎవరితోనో అనుబంధ భాందవ్యాలు కలిగి లేకుండా, అందరిని ప్రేమిస్తూ అదే సమయాన ఎవ్వరిమీద ఆసక్తి లేకుండా జీవించే ప్రక్రియను, ఆ ఆకాశాన్ని చూసి నేర్చుకోవాలి, ఏమంటారు ? దీనినే శ్రీకృష్ణ పరమాత్ముడు, స్థితప్రజ్ఞునికి ఉండవలసిన గుణంగా లేదా లక్షణంగా చెప్పబడింది,
ముందు చెప్పుకున్న, ఆ పంచభూతముల నుంచి, ఆ తత్వాలని, ప్రయత్నపూర్వకంగా, అందరం, మనమందరం, అబ్యాసనం ద్వారా, స్వాధ్యానం తో, ఈ సమాజములో ఉన్న అందరకి మార్గదర్శకులుగా ఉండవచ్చును అనే దృఢ సంకల్పంతో, ఒక్క అడుగు ముందుకు, కలిసి వెద్దాం, రండి, కదలిరండి!
శుభం భూయాత్ , సర్వే జన సుఖినో భవంతు !
జై శ్రీమన్నారాయణ