పుణ్యమన్న , వరమన్న ఒక్కటే, కానీ…
పుణ్యమన్న , వరమన్న ఒక్కటే, కానీ…
“పుణ్యమన్న , వరమన్న ఒక్కటే, కానీ, పుణ్యాన్ని ఎప్పుడు అనుభవించుతామో, ఏ రూపంలో అనుభవించుతామో తెలియదు. వరం ఫలానప్పుడు, ఫలానిలా అని ముందే తెలుస్తుంది”
తండ్రి మనస్సు: ఏమండి! దేవుని శ్లోకాలు రెండంటే రెండైన కంఠస్తం చెయ్యమంటే, మన పిల్లాడు, వినటంలేదండి,
“పోన్లేవే! పెద్దాయినాక చదువుతాడులే” !!!
అమ్మ మనస్సు: వీడికి ఎన్నో సార్లు చెప్పాను, బండి మీద జాగర్త గ వెళ్ళారా అని, చూడు, ఇప్పుడు ఏమైయ్యిందో, హాస్పిటల్లో, రక్తం వొడుతూ బెడ్ మీద ఉన్న కొడుకును చూస్తూ, తండ్రి ఆవేదన, కొంత ఆవేశం కలగలిపిన గద్గగ స్వరంతో,
మీరు ఊరుకోండి, వాడికి ఏమి అవదులెండి, “నా ఆయుష్షు” కూడా తీసుకోని నిండా నూరేళ్లు బ్రతుకుతాడు మన బిడ్డ, అని అన్నది, బెడ్ ప్రక్కనే దీనవదనముతో కూర్చుని బిడ్డను చూస్తూ ఉన్న అమ్మ, కన్నీళ్ల పర్యంతం అవుతూ !!!
ఎన్ని జన్మలు ఎత్తినా తల్లి తండ్రుల ఋణం ఏ బిడ్డ(లు) కూడా తీర్చుకోలే(డు)రు, మన కంటికి, కనిపించే , నిత్య దేవత స్వరూపాలు, ఏ క్షణాయైన అమ్మానాన్నలను కష్ట పెట్టద్దు లేదా బాధపెట్టట్టుగా నడుచుకోవద్దు
జై శ్రీమన్నారాయణ