పేరు చెప్పటానికి ఇష్ట పడని, ఒక ధార్మిక వ్యక్తి అడిగిన ఒక చిన్న ప్రశ్న?
పేరు చెప్పటానికి ఇష్ట పడని, ఒక ధార్మిక వ్యక్తి అడిగిన ఒక చిన్న ప్రశ్న?
మా ఇంటికి విచ్చేసిన ఒక ధార్మికుని ప్రశ్న ఏమిటిఅంటే, రావణాసురుడు … మహేశ్వరుడు , పార్వతి, గణపతి, స్కందుడు, మరియు ఇతర ప్రమథగణాలు ఉన్న కైలాస పర్వతాన్ని తన భుజ బలం తో కదల్చిన వాడుగా చెప్పబడుతాడుగ పురాణాలలో మరి, అటువంటి రావణాసురుడు, శివ ధనుస్సు ను ఎలా పైకి ఎత్తి, నారిని సందించలేకపోయాడో కదా! ఎందు చేతన అని సందేహాన్ని వెలిబుచ్చినారు?
రావణాసురుడు, పేరుకు తగ్గ బలవంతుడె అందులో సందేహం వలదు, రావణుడు పురాణాలలో చెప్పిన విధంగా పరమేశ్వర నిలయమైన కైలాసపర్వతాని తన భుజ శక్తీ తో ఆ పర్వతాన్ని కదపగలిగాడు, అయితే అంత బలవంతుడు, శివ ధనస్సు ఎందుచేత పైకి ఎత్తి, నారిని సందించలేకపోయాడు అంటే, వాల్మీకి మహర్షి, గొప్ప తత్వాన్ని, ఆవిష్కరించడం కోసం, ఈ సందర్భాని మనకి కనులవిందుగా చూపించారు.
శివ ధనుస్సు ను, మేరు పర్వతమని కూడ పెద్దలు చెపుతారు, అయితే , ఇక్కడ శివ ధనస్సు ను, మహాశివుని యొక్క ప్రత్యక్ష స్వరూపం గ చూడవచ్చు, అవునా ! కాదా ! శివ అనే శబ్దానికి, “ఓం” అనే శబ్దాన్ని కూడ, అన్వయించుకోవచ్చు, అందుకే, విశ్వం లో ఉన్న అనాధిగా ఉన్న శబ్దమే, “ఓం” , ఈ విషయాన్ని చాల స్పష్టంగ మనకి పూజాకార్యక్రమములో, మంత్రపుష్పం లో చెప్పబడింది, ఎలాగా , ఎక్కడ అంటే, “విశ్వసై ఆత్మే స్వరగుం శాశ్వతగం శివ అచ్యుతం” , అంటే, విశ్వం యొక్క ఆత్మే “శబ్దం”-“ఓం” గ చెప్పబడుతుంది, దీనినే ఇంగ్లీష్ వాళ్ళు “బిగ్ బాంగ్ థియరీ” అని అన్నారు, దీనిని మన చాల శ్రద్దగా విని నమ్ముతున్నాము కదా, మన ఋషులు అందచేసిన విషయాన్ని మనం ఎందుకో, కనీసం ఆలోచన చేసే ప్రయత్నంకూడ చేయకుండ, విమర్శిస్తున్నాము, ఎంత, ఆశ్చర్యం, వారి వారసులం అయి ఉండి కూడ, అవునా ! కాదా !
సరే, ‘ఓం’ శబ్దమైతే, శబ్దం అక్షరం (క్షరం కానిది, అంటే, మరణం లేనిది, ఇంకా చెప్పాలంటే , శాశ్వతమైనది అనే కదా అర్ధం,ఒక్కసారి మంత్రపుష్పం లోని ఆ పైన చెప్పిన వాక్యాన్ని ధారణ చేయండి, ఇప్పుడు మీకు అర్ధం అవుతుంది) రూపాంతరం చెంది, ఆ అక్షరం , వేదమునకు, తోలి అక్షరమైతే, అటువంటి అక్షరముల కలయికే వేదం గ పిలువబడుతుంది, అవునా ! కాదా !
మరి అటువంటి వేదమునకు, అధిపతిగా, ఆ శ్రీమన్నారాయణుడిని లేదా వేద నారాయణుడిగా కొలవబడుతున్న, ఆ స్వామి యొక్క మారు లేదా అవతార రూపమే గ, మనకి కనిపించే ఆ రామచంద్రుడు, అందుచే, వేదం ఆ శ్రీమన్నారాయునికే చెందుతుంది, అవునా ! కాదా ! “అయ్యా మరియు అమ్మ, చిన్న మనవి, ఇక్కడ ఈ సందర్భం లో అవరం అన్నారుగా, అని, శ్రీమద్రామాయనని ఆ కథానాయకుడిని మరియు కధానాయకురాలిని, దేవత స్వరూపాలుగా చూడకుండా లేదా ఉహించకుండా, మానవమాత్రునిగా భావన చేసే, ఈ అద్భుత కావ్యాన్ని, ధారణ చేయగలరని, ఆశిస్తున్నాను”!
కనుక, “శివ ధనస్సు”, ఆ రామచంద్రునికే, అధీనములోనికి తీసుకోని రాబడుతుంది, అంతేగానీ , రావణాసురుని యొక్క భుజ శక్తి కి సంబందించినది కాదు లేదా ఆ శక్తీ ని తక్కువ చేయలేము.
ఈ యొక్క తత్వాన్ని లేదా రహస్యాన్ని అక్కడ ఉంచి, శివ ధనుర్బంగం గ, మనకు చూపుట జరిగింది. ఇలాంటి, తత్వరహస్యాలను, వాల్మీకి మహర్షి, పుంఖాను పుంఖాలు గ, అందు దాచి, పైకి తన కావ్యశైలిని (ఆదికావ్యం) శ్రవణానందంగ, వీనులవిందుగా విరచితమైనది ఏమంటారు! కావ్య భాష, స్త్రీ యొక్క, భావజాలానికి లేదా భావసారూప్యతకి చాల దగ్గరగ ఉంటుంది, వివాహీతులకు, బాగా పరిచయం, ఆ కావ్య భాష, వారి కుటుంబ జీవితమూ లో ప్రతిరోజూ, ఎదో ఒక సందర్బములో ఆ దంపతుల మధ్య,జరిగిన సంభాషణలలో , ఇంత తత్త్వం దాగివుంటుంది, అందుకే, ఆ దంపతి (దంపతులు అనే అనరాదు) మాటలు, ఇతరులకు, వేదాంతముగ కనిపిస్తూవుంటుంది, అవునా ! కాదా ! ఇది అర్ధం అయితే, శ్రీమద్రామాయణం లోని, ప్రతి పద ఘట్టం అర్ధం అవుతుంది, అనుటలో, కించిత్ సందేహం వలదు, అవునా ! కాదా !
శుభం భూయాత్! సర్వే జన సుఖినో భవంతు!
జై శ్రీమన్నారాయణ