Blog

ఫాల్గుణ మాసం

thought-of-the-day

ఫాల్గుణ మాసం

ఫాల్గుణ మాసం

తెలుగు క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసం అంటే త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహా విష్ణువుకు అత్యంత ఇష్టమట. ఫాల్గుణ మాసంలో చాలా మంది ప్రజలు ముఖ్యంగా తొలి పన్నెండు రోజులు అంటే శుక్ల పక్ష పాడ్యమి నుండి ద్వాదశి వరకూ శ్రీ మహా విష్ణును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి.

ఈరోజులలో ప్రతిరోజూ తెల్లవారు జామునే నిద్ర లేవాలి. అనంతరం తలస్నానం చేయాలి. ఆ తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. తర్వాత శ్రీ మహా విష్ణువును అష్టోత్తరాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించాలి.

తొలి 12 రోజుల్లో.. ఫాల్గుణ మాసంలోని తొలి 12 రోజుల్లో ఏదైనా ఒక రోజు లేదా ద్వాదశి రోజు వస్త్రాలు వివిధ రకాలైన ధాన్యాలను గురువులకు లేదా గోమాతకు దానమిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

లింగ పురాణం దానం.. మీ శక్తి, సామర్థ్యానికి తగ్గట్టు మీరు ఏదైనా విష్ణువు ఆలయానికి ఏదైనా గోమాతను దానమిస్తే మీకు విశేష ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. పౌర్ణమి నాడు ఈశ్వరుడిని, శ్రీక్రిష్ణుడిని, లక్ష్మీదేవిని పూజించి ‘లింగ పురాణా‘న్ని దానంగా ఇవ్వాలి.

డోలోత్సవం.. అదే రోజు సాయంత్రం శ్రీ క్రిష్ణుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనినే డోలోత్సవం అంటారు. మరి కొన్ని ప్రాంతాలలో డోలా పూర్ణిమ అంటారు. ఇలా ఉయాలలో ఊపితే భక్తులందరికీ వైకుంఠప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

రంగు నీళ్లను చల్లుకోవాలి.. ఫాల్గుణ మాసంలో ఓ రోజున రంగునీళ్లను చల్లుకోవాలని శాస్త్రాలలో చెప్పబడింది. మామిడి పువ్వులను కచ్చితంగా ఆరగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే రంగు పొడులను కూడా చల్లుకుంటారు.

పౌర్ణమి రోజున హోలీ.. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగను నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ రోజు కూడా ఎంతో శక్తివంతమైనది. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తర ఫాల్గుణి, కలిసి వస్తే ఆరోజున మహాలక్ష్మీని ఆరాధించి స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది.

లక్ష్మీ దేవిని ఆరాధిస్తే.. హోలీ పండుగ రోజు శ్రీ మహా లక్ష్మీ దేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

ఒక కథ కూడా.. ఈ పండుగ వెనుక కూడా ఒక కథ ఉంది. ఓ రోజు పార్వతి తన శక్తితో శివుని కళ్లు మూతపడేటట్లు చేస్తుందట. శివుడి కళ్లు మూసుకుపోవడం వల్ల జగమంతా అంధకారమవుతుందట. శివుడు కోపగించుకోవడంతో పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి శివుని అభిమానం పొందేందుకు ఓ మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తుందట.

శివుడి అనుగ్రహం.. ఆ రోజే ఫాల్గుణ పౌర్ణమి. మామిడి చెట్టు కింద పార్వతీ దేవి శివుడి యొక్క అనుగ్రహం పొందుతుందట. అప్పటి నుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు. ఫాల్గుణ మాసంలో ఈ విధమైన పూజలు చేసిన వారందరికీ అనంతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్”

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *