బుద్ధిమాతమ్ వరిష్ఠుడుగా ఉన్న స్వరూపం.
బుద్ధిమాతమ్ వరిష్ఠుడుగా ఉన్న స్వరూపం.
జై శ్రీరామ్ జై హనుమాన్
శ్రీమద్రామాయణములో ఎక్కడ, ఎప్పుడు , ఎవరు, మనం చిన్నప్పుడు విన్న “సామ”, “దాన”, “బేధ”, మరియు “దండోపాయం” లను ఆలోచనాపరంగా బుద్ధిమాతమ్ వరిష్ఠుడుగా ఉన్న స్వరూపం……..
శ్రీమద్రామాయణములో, సుందరకాండలో అంతర్బాగముగా, సీతమ్మవారి దర్శన అనంతరం, బుద్ధిమతాం వరిష్ఠుడైన, హనుమంతులవారు, ఈ పైన చెప్పుకున్న “సామ”, “దాన”, “బేధ”, మరియు “దండోపాయం”, ఎందుకు, ఎలా, ఎంత ఆలోచనాపరంగా ఆచరణ యోగ్యమైనదిగా మనకి చూపించారు…
“సామ” అంటే, బుద్ధి చెప్పుట అని అర్ధం, అయితే రావణాసురుడికి బుద్ధి చెప్పిన వారే లేరందమా ? లేదా చెప్పిన వినే లక్షణం లేదంటారా ? అవును, చెప్పిన వినలేదు, అయితే ఎవరెవరు చెప్పారంటే, మొదట మారీచుడు, మండోదరి, కైకసి, మరియు విభిషణుడు, ఇంతమంది చెప్పినా విననివాడు, మరి రావణాసురుడు మంచి శివ భక్తుడు, ఎప్పుడయినా తానూ, తానూ అంతగా పూజించే, ఆ మహాశివుడు కనీసం ఒక్క మాట అయినా చెప్పివుంటే, నేను వినేవాడినేమో, అని ఆ రావణాసురుడు తలచవచ్చునేమో అందుకే మహా శివుని అంశ అయినా హనుమంతులవారు నాలుగు మంచి మాటలు చెపుతామని అనుకున్నారు, కానీ, ఎలా, తానూ ఏ విధముగా, ఆ రావణాసురుడును చూచుట, చూచి, ఆ పైన, బుద్ధి వికసింపచేయుట అనే ఆలోచన చేసి…
పోనీ, ఆ రావణాసురుడికి దానం చేసే, క్రమములో ఐనా, తనకి, అవకాశం దొరకవచ్చును కదా , కానీ, ఆ రావణాసురుడు ఉన్నదే కాంచన లంక, ప్రపంచములోని, అత్యద్భుత భవనాలలో, రత్న, వజ్ర, వైడూర్య, మణి మండపలోతో విరాజిలుతున్న, తానూ అనుకున్న దానం సరికాదు, మరి ఏమి ఇప్పుడు కిమ్ కర్తవ్యం, అని ఆలచనలో సాగెను…
పోనీ, భేదం, అంటే ఈ రాక్షసులలతో యుద్ధం చేస్తే, ఆ రావణాసురుడు, తనతో యుద్ధం చేయటానికి, ఎంత సమయం పట్టునో కాదా, ఎందుకు అంటే రావణ సేన, ఇంత మరియు అంత అనే చెప్పా నలవి కాదు, తానూ ఎంతమందినైనా మట్టు పెట్టగలడు, కానీ, ఎంతసేపని (తన చెంత, అంత సమయం లేదాయె, తానూ త్వరగా తిరిగి వెళ్లి, తన ప్రభువైన, ఆ శ్రీరామచంద్రునికి, మా అమ్మ, సీతమ్మ జాడ తెలుపవలెను, తన యజమానియైన సుగ్రీవునికి ఇచ్చిన కాలం సీతా అన్వేషణ సమయం, తిరిగి సమాచారం అమ్మ జాడ తెలిపే సమయం, చాల తక్కువుగా ఉన్నందున్న) , ఆ రాక్షసవీరులతో యుద్ధం చేయవలె, ఈ విధముగా పరిపరి విధములుగా ఆలోచన పరుడై ఉండెను… చివరకు.. ఈ రావణ లంకలో, ఆ రావణాసురుడిని త్వరగా చూడటానికి, ఉన్న చివరి ఉపాయాలోచన చేశాను, అదియే, దండోపాయం…
ఆ రావణాసురుడికి, అత్యంత ఇష్టమైన, ప్రమాదవనాన్ని భంజించుటయే, మంచి మార్గం, ఆ రావణాసురుడిని, త్వరగా చూచుటకు, ఆలోచన వచ్చినదే తరుణం, వెంటనే, ఆ ప్రమాదవనాన్ని, భంజించుట మొదలుపెట్టాను, తానూ అనుకున్నట్టుగానే, ఆ ఇంద్రజిత్తు (మేఘనాధుడు) సంధించిన బ్రహ్మ అస్త్రము పైన ఉన్న , గౌరవం తో, కొద్దీ, క్షణాలు, మౌనం దాల్చి, నిల్చున్న, హనుమంతుని ఆ రాక్షసాధములు చేసిన తెలివి తక్కువ పనిని, గ్రహించి కూడా, తానూ, బంధిగానే ఆ రావణ సభకి తోడ్కొని రాబడెను.. ఆ పైన తానూ చెప్పదలుచుకున్న, ఆ నాలుగు మంచి మాటలు కూడా, ఆ రావణాసురుడి శ్రావణములకు అందచేసెనో, కానీ, “వినాశకాలే విపరీత బుద్ధిహి” అని పెద్దలు చెప్పకనే చెప్పారు, ఈ సత్యాన్ని కూడా…
చివరగా తానూ, నిర్వర్తించవల్సిన, కార్యం, సఫలీకృతం చేయుటకే, బుద్ధి కలిగిన ఆ మానవుడు, పైన చెప్పుకున్న, ఎదో ఒక సందర్భానుచితమైన ఉపాయమును (వి) నియోగించి, తానా కిచ్చిన కార్యమును సఫలీకృతం ఏ విధముగా చేయవచ్చునో, చూపే లేదా చేసే ప్రక్రియలో, ఈ పద (సామ, దాన, భేద, మరియు దండోపాయం) ప్రయోగం పూర్వాశ్రమములోని పెద్దలు విరివిగా వాడుట, మనకు, సుపరిచయమే…
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు”
జై శ్రీమన్నారాయణ