Blog

భగవంతుడు సీతాపహరణాన్నే మాత్రమే ఉపాయముగా నిర్ణయం చేసాడు ఎందుకు”?

thought-of-the-day

భగవంతుడు సీతాపహరణాన్నే మాత్రమే ఉపాయముగా నిర్ణయం చేసాడు ఎందుకు”?

రామచంద్రుని గురువైన, విశ్వామిత్ర మహర్షి, తన వెంట రామ లక్ష్మణులను యాగరక్షణకి తీసుకువెళుతు, ఒకచోట ఆగి, విశ్రాంతి తీసుకున్నతరువాత, సూర్యోదయానికి ముందు,నిద్రపోతున్న, రామలక్ష్మణాలను నిద్రనుంచి మేల్కొల్పే “మిష”తో, విశ్వామిత్ర మహర్షి….

“కౌసల్యా సుప్రజ రామా…… కర్తవ్యం “దైవ” మాంహికం”, ఇక్కడ జరగబోయే విషయ విశేషాన్ని గురువు ద్వారా వ్యక్తపరచబడింది…”రామా”యణం అంటే , “సీతకు సంబంధిచినవాడు” అని అర్ధం, అయనం అంటే, కదలుట అనే అర్ధం, ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే, సీతకు సంబందించినవాడు కదులుట అంటే, సీత కూడా, కదలిందనేగా, కదలటం అంటే, ఉన్నచోట నుంచి, వేరొక చోటకి చేరుట అవునా ! కాదా ! మిథిలా నుంచి… అయోధ్యకు, అయోధ్య నుంచి చిత్రకూటమికి (పర్ణశాల), పర్ణశాల నుంచి…. (ఇక్కడే తెలుసుకొనే ప్రయత్నం (సుందరకాండ)… ఇలా జరిగితే గానే, ఈ శ్లోకాన్ని కి “కౌసల్యా సుప్రజ రామా…… కర్తవ్యం “దైవ” మాంహికం”, అర్ధం లేదు కదా. మరి వచించినవారు, సాక్షాతూ “బ్రహ్మర్షి”-నిజం కాక ఏమవుతుంది….

ఇప్పడు, సందేహంలోనికి, అడుగిడదాం, “శ్రీలక్ష్మీ”నారాయణులు, లేదా పార్వతీపరమేశ్వరులు లేదా వాణిహిరణ్యగర్భులు,ఎప్పుడు,విడివిడిగా ఉండరు, అమ్మవారు, ఎప్పుడు నిత్యాన్నపాయాన్ని అనే పూర్వాశ్రములో పెద్దలు వచించారు…అంటే తానకు తాను గ, విడిపోవుట జరగదు, అనే కాదు అర్ధం, అంటే, వేరొకరు ద్వారా జరగవచ్చు కదా (ఈ విధంగా భృగుమహర్షి ద్వారా ఒకసారి(చెంచు లక్ష్మీ, శ్రీవెంకటేశ్వర ప్రీత్యర్థం), రెండవసారి, రావణాసురుడు ద్వారా (ఏది ఏమైనా, లోకకల్యాణార్థం కోసమేగా )

మనభాష లో చెప్పాలంటే, సీత రామునకు చెందినది, అలాగే రాముడు సీతమ్మకు చెందినవాడు, ఒప్పుకుంటారా లేదా…ఒకరికొకరు చెందినప్పుడు, ఎప్పుడు కలసిఉన్నప్పుడు, వారికివారుగా విడివిడిగా లేన్నప్పుడు, ఎవరోఒకరిచేత వేరుచేయబడ్డాలి, అవునా ! కాదా ! అంటే, వారిమధ్య, వేరుగా ఉండటానికి ముందు, ఒక కారణం అవసరం ఉంది, ఆ కారణ అవసరము కూడా, వేరొకరిద్వారా కాక వారిమధ్య నుంచి ఆ కారణం ఉద్బవించాలి , ఆ అవసరమే, బంగారు జింక , అవునా ! కాదా ! (సందర్భం కాదు గాని, ఇక్కడ ఉపాయం (జింక), ఉపేయం (అభ్యాగతి రూపములో-రావణాసురుడు )

ఒకరికొకరు చెందినప్పుడు, అందులో ఒకరికి, స్ప్రుహలేనప్పుడే (తెలుసుకోలేని స్థితిలో), వేరుబడుట జరుగుతుంది, ఆ వేరుబడుట “అపహరణ” ద్వారా జరగాలి (నాకు చెందిన ఒక వస్తువును, ఒకరు దొంగిలించాలి లేదా అపహరణ చేయాలంటే, నాకు స్పృహలేన్నపుడే లేదా నాకు తెలియకుండా జరగాలి అవునా ! కాదా ! అంతేగాని, ఇది భగవద్ నిర్ణయం కాదు కానీ, జరగవలసిన కార్యం ఈ విధముగానే…

ఎందుకంటె, వారు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, ఎవరు ఆకారణముగా వేరుచేయుట జరగదు…(మారీచుడకు తెలుసు, శ్రీరాముని యొక్క శక్తిసామర్ద్యాలు…)

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు”

జై శ్రీమన్నారాయణ

“మనో క్షయో మోక్షయేవ” మోక్షమునకు వ్యుత్పత్తి, మనసును నిర్మలం చేసుకో కలిగితే, మోక్షం సాధ్యం అనే అర్ధములో చెప్పబడింది. అందుకనే మనకు, చతుర్విధ పురుషార్దలు అంటుంది శాస్త్రం, అందులో, మనం మొదటి మూడు, గ్రహించకలగాలి, మళ్ళి అందులో, మొదటిది, ఆలంబన చేసుకొని, రెండు మరియు మూడు గ్రహించాలి, అంటే, ధర్మ, అర్ధ, కామ, మరియు మోక్ష… ధర్మాన్ని ఆలంబన చేసుకొని, అర్ధాన్ని (సంపద అనే అర్ధం తీసుకొందాం) , అలాగే కామాన్ని (భౌతికమైన కోరిక అనే అర్ధం లో తీసుకుందాం), ఎప్పుడు అయితే మానవుడు, ఈ విధంగా, ధర్మబద్ధమైన అర్దాన్ని, కామాన్ని, పొందుతాడో, మోక్షం తనంత తానె దరిచేరును… ఎలాగా అంటే, తనకు ధర్మబద్ధమైన అర్ధముతో, తనకు, కావాల్సిన కోరికలను ధర్మబద్ధముగా తీర్చుకుంటాడో, అప్పుడు, మనసు యందు కోరికలు నిర్మలమై, ఆ మానవుడను అధర్మపరాయణుడుగా చేయబడడు… అంటే “మనో క్షయో మోక్షయేవ” అంటే మోక్ష ప్రాప్తికి అర్హుడుగా పరిగణించబడుతాడు…ఔనంటారా ! కాదంటారా !

అందుకే, మన హైన్దవ వివాహ మంత్రాలలో , ధర్మేచా, ఆర్డేచ, కామేచ, నాతి చరామి అని పెద్దలు లేదా పురోహితులు చెపుతారు, చూసారా, మోక్షేచ అనే చెప్పరు, ఎందుకు అంటే, ధర్మంతో కూడిన అర్ధం, కామం కలిసుంటే, మోక్షం అదే కలుగుతుంది అనే భావనలో చెప్పటం జరిగింది, అంటే భర్త ని ధర్మ మార్గములో ఉంచే లేదా నడిపించే భాద్యత ఆ ధర్మపత్నీది అని, అదేవిధంగా, ఆ ధర్మపత్ని ని కూడ, ధర్మ మార్గములో ఉంచే లేదా నడిపించే భాద్యత ఆ భర్తది అనే చెప్పుటయే అందులోని అంతరార్ధం… అంటే భార్య భర్త (లు) సమానులు అనే భావన, ఎక్కువ లేదా తక్కువ అనే తారతమ్యాలు లేనేలేవు, మన హైన్దవ వివాహ సంప్రదాయములో….అని గ్రహించాలి, ఈ విషయాన్ని “అర్థనారీశ్వర” తత్త్వం తెలుపుతుంది…

శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు!

జై శ్రీమన్నారాయణ

మొదటి సందేహం: ధర్మం, ఆత్మకు సంతుష్టిని లేదా తుష్టిని ఇస్తుందని ముందుగానే చెప్పుకున్నాం. మీరు ఉదహరించినవారు, ధర్మం తెలుసు కానీ, ఆచరణకు విముఖుత చూపినారు. ధర్మం పాటించితే మంచి లేదా చెడు జరుగుతుందా అన్న ప్రశ్నకి అవకాశమే లేదు, మరొక్కసారి ధర్మం ఆత్మసంతృప్తికి మాత్రమే, ధర్మాచరణ చేసినవారు, తిరిగి మర్త్యలోకాన్నికి రారు, అనిమాత్రమే చెప్పగలము (అందుకే, శ్రీరామచంద్రులు, సరయు నదిలో అంతర్ధానం అయినారు, కానీ వారి అవశేషములు కానరాలేదు,…..

రెండవ సందేహం: ధర్మాచరణ వలన మనం హాయిగా ఉంటాం అని అన్నారు, హాయి అని చెప్పలేం కానీ, ఆత్మకితృప్తిగా అయితే ఖశ్చితంగా ఉంటాం … ధర్మపరాయణుడు ఎప్పుడు, ధనవంతుడు లేదా అత్యంతధనవంతుడు కావాలని కనీస ఊహ కూడా చేయరు, తన ధర్మ సంపాదనతోనే, తన విధులను, బాధ్యతలు, కుటుంభం అవసరాలను, తీర్చుకొంటూఉంటారు, ధర్మం ప్రాపంచిక సుఖాలకు అందనిది, ఆత్మకే సంబంధం కలిగినది, శరీరానికి సంబందించినది కాదు అలాగని ఆ జీవికి, శారీరిక ఉపాధి ఉన్నప్పుడే ధర్మాచరణ సాధ్యం……

ఇక్కడ, మీరు, ధనవంతుడు, అని చెప్పటానికి, మీరు అనుకున్న ఆదాయం లేదా సంపద కి ఒక లెక్క మరియు ఎంత కాలములో, అని ఉంటుంది , అది ఎంత, ఆ లెక్క ని అందుకోడానికి తగినంత కృషి చేసినట్లయితే, తాను అనుకోనున్న లెక్కను అందుకుంటారు, కానీ, ఎంత సమయం లేదా కాలములో, అని మాత్రము చెప్పలేము…ధర్మబద్ధముగా అయితే ఈ పైన విధముగానే జరుగుతుంది, మరొక విషయం, అంత ధనవంతుడు కావాలని, ఆలోచన వచ్చినప్పుడే, ఆ వ్యక్తి, ధర్మ, అధర్మాలను, భేరీజు వేసుకొని జీవించే సావకాశాలు చాల చాల తక్కువుగానే అ(క)నిపిస్తాయి…

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *