Blog

శ్రీకృష్ణుని యొక్క వాహనం ఏమిటి అని?

thought-of-the-day

శ్రీకృష్ణుని యొక్క వాహనం ఏమిటి అని?

అమ్మా ఉమా, మీరు అడిగిన ప్రశ్న ” శ్రీకృష్ణుని యొక్క వాహనం ఏమిటి అని?”, చాల మంచి ప్రశ్న తల్లి. మరి, ఈ సందేహం పైన, విశ్లేషణ చేద్దామా ! అయితే రండి, మరి చుద్దాం !

శ్రీకృష్ణ పరమాత్ముడు , తనకు తానుగా భగవంతునిగా పరిచయం చేసుకున్నారు, ఈ ప్రపంచానికి, అందుకే, ఆ అవతారమును, పరిపూర్ణావతారం అంటారు. శ్రీరాముడు సంపూర్ణావతారం అంటారు. అంటే, శ్రీమన్నారాయునికి , శ్రీకృష్ణ పరమాత్మునికి బేధం లేదు, అవునా ! కాదా ! ఇది అంగీకరిచినట్లైతే, శ్రీమన్నారాయుని వాహనం పన్నగవాహనుడు అంటారు, అంటే, పన్నా (అంటే వేదం అని అర్ధం) , దీనినే కొందరు, గరుత్మంతుడు లేదా పక్షీన్ద్రుడు అని అంటారు, ఏదయినా ఒకటే కదా, అలాగని శ్రీకృష్ణునికి ఎక్కడ పైన చెప్పిన వాహనాన్ని చూపలేదుగా, మరి అర్ధం ఏమిటి, వేరోకటి ఉందనేగా అర్ధం, ఇక్కడ మనకి కొంచెం సంస్కృతముతో పరిచయం ఉండాలి, ఎలాగా అంటే, శ్రీకృష్ణపరమాత్మునికి ఎప్పుడు ఒక గోవు ను చూపిస్తూవుంటారు కదా, అదే వారి వాహనం, ఎలాగా అంటే, సంస్కృతం లో “గో” అనే అక్షరానికి, గోవు లేదా వేదం అనే అర్ధం, అందుకే, శ్రీకృష్ణపరమాత్ముడు, ఎప్పుడు, గోక్షీరాన్ని స్వీకరించేవారు, అంటే, గోవు యొక్క నాలుగు పొదుగులు, నాలుగు వేదములకు ప్రతీక, అలాగే ఆ పొదుగుల నుంచి వచ్చే క్షీరము, ఉపనిషద్ కి ప్రతీక గ చెప్పుదురు, అంటే, శ్రీకృష్ణ అన్న శ్రీమన్నారాయణ అన్న ఒక్కటే అక్కడ, ఎందుకంటే తానే ఆ శ్రీమన్నారాయునినిగ పరిచయం చేసుకున్నారు కదా! అందుకే పరమాత్ముని యొక్క దేహం, ఉపనిషద్ మయం అని చెప్పబడింది, మనుషుల యొక్క శరీరం పంచభూతముల చే నిర్మితమైంది అవునా ! కాదా !
ఆ శ్రీమన్నారాయునిని, వేద నారాయణుడు అంటాం కదా, ఆ విధంగ చూసిన, పైన చెప్పుకున్న “పన్నగవాహనుడు లేదా గరుత్మంతుడు లేదా పక్షీన్ద్రుడు లేదా సరిసమానమయిన గోవు” , మీరు శ్రీకృష్ణుని ఆ శ్రీమన్నారాయునిగ చూస్తే, పైన చెప్పుకున్న వాహనం గ చూపబడింది. అంటే శ్రీకృష్ణుని యొక్క తత్వాన్ని, “గో” ద్వారా, వేదస్వరూపుడు అని చెప్పటం జరిగింది, ఇక్కడ, అవునా ! కాదా !

ఇంకొక విషయం, మనం ఎప్పుడు కూడ, వాహనం అంటే, ప్రయాణం కు ఉపయోగపడేది అనే అర్ధం లో తీసుకోరాదు, అది మన పరిభాష వరకే పరిమితం

శుభం భూయాత్! సర్వే జన సుఖినో భవంతు!

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *