Blog

శ్రీమద్రామాయణములో, ధర్మాన్ని విస్మరించిన, అధర్మాన్ని ఆశ్రయించిన వారు ఏమి పొందారు? అడగకుండానే ముందుగా మాటలాడి భంగపాటుపడింది ఎవరు, మనం ఎంత పెద్దవారమైన, మన చెంత ఎవరు ఉంటె, మనం మాట్లాడరాదు?

thought-of-the-day

శ్రీమద్రామాయణములో, ధర్మాన్ని విస్మరించిన, అధర్మాన్ని ఆశ్రయించిన వారు ఏమి పొందారు? అడగకుండానే ముందుగా మాటలాడి భంగపాటుపడింది ఎవరు, మనం ఎంత పెద్దవారమైన, మన చెంత ఎవరు ఉంటె, మనం మాట్లాడరాదు?

ధర్మాన్ని విస్మరించింది- కైకేయి-పెద్దవాడైన రామునికి, పట్టాభిషేకం అర్హత కలిగి ఉన్నారు, అదికాదని, తన బిడ్డయినా భరతునికి అడుగుట అధర్మం- దాని ఫలితం.. తన భర్తని కోల్పోయింది, మరియు తన బిడ్డయినా భరతుడు కూడా కైకేయిని వదలి నందిగ్రామములో, తన అన్నగారైన శ్రీరాముడు వచ్చి, రాజ్యాన్ని, స్వీకరించేంతవరకు అక్కడే భరతుడు ఉండిపోయారు…

అధర్మాన్ని ఆశ్రయించింది-దశరధ-దేవాసుర సంగ్రామములో దశరధ మహారాజు తన భార్య (ఇక్కడ ధర్మ పత్ని, అనరాదు, ఎందుకు ఆంటే, ఏ స్త్రీ అయితే భర్త తో కలిసి, పూజాది కార్యక్రమాలు చేస్తారు, ఆ స్త్రీ నే మాత్రమే ధర్మపత్నిగా గుర్తించబడుతుంది), అయిన కైకేయికి మాట ఇచ్చి, ఆ మాట తప్పి, తన నిర్ణయాన్ని, భహిరంగపరచినాడు , రాజ్యసభలో, అంతమంది, సభ్యులు మరియు గురు సమక్షంలో… అధర్మ ఫలితం.. తన ప్రాణసమానుడైన రాముడు దూరమైనాడు, చివరకి, తన శరీరాన్ని వదిలివేశారు..

అడగకుండానే ముందు మాటలాడి బెంగపడింది లేదా భంగపడింది-దశరధ-విశ్వామిత్ర మహర్షి విచ్చేసినప్పుడు… విశ్వామిత్ర మహర్షి,ఏమి అడగకుండానే, మీకోసం ఏదైనా చేయటానికి సంసిద్ధతను వ్యక్తపరచడం.. రాముణ్ణి యాగ రక్షణనకు తనతో, పంపమన్నందుకు, కొంతసేపు, సందిగ్దములో ఉండుట, ఆ మహర్షి తో రాముని బాధలు తన చతురంగ బలముతో వచ్చుటకు తన అభిప్రాయాన్ని వ్యక్తపరచుట.. రాముణ్ణి పంపుటకు విముఖత చూపుట… ఫలితం ఇక్ష్వాకు వంశములో, ఇచ్చిన మాటను విస్మరించిన చెరగని మచ్చని పొందేరు…

మనం ఎంత పెద్దవారమైన, మన చెంత ఎవరు ఉంటె, మనం మాట్లాడరాదు- గురువైన వసిష్ఠ మహర్షి, అక్కడ ఉండగానే, దశరధ మహారాజు, తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని మరియు నిర్ణయాన్ని (రామ యువరాజ పట్టాభిషేకం)-అభిప్రాయం లేదా ఆలోచన వ్యక్తపరచుట తప్పు కాదు, పెద్దలు ఉన్నప్పుడు, నిర్ణయాన్ని చెప్పి, గురువు యొక్క, అభిప్రాయాన్ని అడుగుట తగదు…ఫలితం..అనుకున్నది జరగలేదు సరికదా, అయోధ్య మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది..

“ధర్మో రక్షిత రక్షితః”- ధర్మాన్ని ఆచరణ మరియు ధర్మపరిరక్షణ చేసిన, శ్రీరాముడు, లక్ష్మణ స్వామి మరియు హనుమంతులవారు…అందుకే వారంతా ఆ ధర్మమే చేతే రక్షించబడి, ఇంత మరియు అంత గౌరవాన్ని, ఇన్ని యుగాలు మారిన, మనఅందరిమధ్యన, నడయాడుతున్నారు…

“శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు”

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *