సీతమ్మ బంగారు లేడీని అడుగుటవలనే …
సీతమ్మ బంగారు లేడీని అడుగుటవలనే …
సీతమ్మ బంగారు లేడీని అడుగుట తప్పుకాదు, ఒక భార్యగా, తన భర్తని ఒక కోరిక కోరింది, అప్పుడు, శ్రీరాముడు, సీతా సృష్టిలో యిటువంటి బంగారు లేడీ ఉండుట అసహజం అని చెప్పే ప్రయత్నం చేస్తారు, కానీ సీత మాత, శ్రీరాముని మాట, అయోధ్య నుంచి అరణ్యానికి వచ్చిన ఈ ఒక్క సందర్భం లో వినదు తల్లి, (సందర్భం వచ్చినది కాబట్టి, దక్ష యజ్ఞ సమయములో కూడ, మహాశివుని మాట ను వినక, ఆ తల్లి పార్వతి, అగ్నిలో ఆత్మాహుతి చేసుకున్నది) ఆ తరువాత వినుటకు అవకాశమే లేదు, మరియు వేరొక సందర్భములో ……… (ఇక్కడ మనం ఏమి గ్రహించాలి అంటే, పిల్లలు కత్తి తో ఆడుకుంటాను అంటే, తల్లి తండ్రులుగా మనం ఆ కోరికను తీరుస్తామా? నయానో, భయానో, లేదా మందలించో, ఆ ఆట నుంచి ద్రుష్టి మరల్చే ప్రయత్నం చేస్తాం, అంతేకాని కత్తి ఇచ్చి ఆడుకోమని చెప్పం కదా, ఎందుకు అంటే, పిల్లవాడు చిన్నవాడు కాబట్టి… భార్య మరియు భర్త విషయములో, సాధారణముగా భార్య భర్త కంటే కొంచెం వయస్సులో చిన్నదై ఉంటుంది, అనే పూర్వభావనలో , ఇప్పుడు కాదు సుమా) అంటే అమ్మ ముందుకూడా శ్రీరామునితో విభేదించినదా అంటే, అవును అనే సమాధానం వస్తుంది ( శ్రీరాముని వెంట సీతమ్మ అరణ్యానికి వస్తాను అని అన్నప్పుడు, శ్రీరాముడు, వలదు అని వారిస్తారు, కానీ అమ్మ వినదు సరి కదా, ఈ సందర్భములో, అమ్మ సీతమ్మ, అద్భుతమైన సందుర్బోచితముగా , ఈ కాలములో, మనలాంటి మానవులకి, ఏ సమయములో భార్య (ధర్మపత్ని) భర్తని ఒంటరిగా వదలరాదు , అనే అర్ధంలో, ధర్మబద్ధంగా చెప్పడంతో, శ్రీరాముడు, మారు మాటాడక, సీత, లక్ష్మణ సమేతుడై, అయోధ్యని విడిచి, అరణ్యానికి బయలుదేరినారు) ఆలా వచ్చిన సీతమ్మ, మొదటిసారిగా పైన చెప్పిన కోరికను వ్యక్తపరచింది…అందులో, అధర్మం లేదా అసంబంధం లేదా అసహజం కానీ ఏది లేదు కదా ! అయితే మరి, శ్రీసీతారాముల వియోగానికి, ఆ బంగారు లేడీ కారణమా లేదా శ్రీరాముడు అమ్మ సీతమ్మ మాట విని, ఆ బంగారు లేడీని వెంబడించి వెళ్ళుట లేదా శ్రీరాముడు ఈ సృష్టిలో అటువంటి బంగారు లేడీ ఉండుట అసహజం అని చెప్పిన అమ్మ సీతమ్మ వినకపోవుటయా, ఇందులో ఏదో ఒకటి కచ్చితంగా అయివుంటుందని నా అభిప్రాయం…. మీరు ఏమంటారు….
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు”
జై శ్రీమన్నారాయణ