Blog

నిర్వాణ షట్కమ్

Stotram

నిర్వాణ షట్కమ్

శివాయ నమః ||

తల్లి అంగీకారం తీసుకోని శంకరుడు కాలడి విడచి, గురువు కొరకు అన్వేషణ లో నర్మదా నది వద్దకు చేరుట జరిగింది. నర్మదా ఒడ్డున్న గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవతపాదుల ఉండే గుహ దర్శనం అయ్యింది. వ్యాస మహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవతపాదులకి నమస్కారం అని స్తోత్రం చేయగా, గోవింద భగవతపాదులు ,” ఎవరు నువ్వు” అని అడుగుతారు, అప్పుడు శంకరులు పైన చెప్పినా ” నిర్వాణ షట్కమ్” స్తోత్రం చేస్తూ ఇలా వచించిస్తున్నారు…

ఆ పరంధాముని కృపతో, కరుణ తో, కటాక్షములతో, ఈ స్తోత్రానికి ఒక్కొకట్టిగ్గా అర్ధం తెలుసుకొనే చిన్న ప్రయత్నం చేస్తున్న…

“మనోబుద్ధ్యహఙ్కారచిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రణనేత్రే |
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుశ్చిదానన్దరూపః శివోఽహం శివోఽహమ్”

అర్ధం:

మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, నేను కాను,
చెవి, నాలుక, ముక్కు, కన్ను నేను కాను,
ఆకాశం, భూమి, నిప్పు, గాలి నేను కాను,
చిత్ ఆనందం ఐనా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడను నేను

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్” ||

న చ ప్రాణసంజ్ఞో న వై పఞ్చవాయుర్న వా సప్తధాతుర్న వా పఞ్చకోశాః |
న వాక్పాణిపాదం న చోపస్థపాయూ చిదానన్దరూపః శివోఽహం శివోఽహమ్

అర్ధం:

ప్రాణం అనుబడునది నేను కాను, పంచప్రాణములు (ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమానములు) నేను కాను, ఏడు సప్తధాతువులు (రక్త, మాంస, మేధో, అష్టి, మజ్జ, రస, శుక్రములు) నేను కాను, ఐదు కోసములు (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయులు) నేను కాను, వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్తులు నేను కాను, చిత్ ఆనందం ఐనా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడను నేను

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్” ||

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్థో న కామో న మోక్షశ్చిదానన్దరూపః శివోఽహం శివోఽహమ్

అర్ధం:

నాకు ద్వేషం-అనురాగం లేవు
నాకు లోభం – మొహం లేవు
మదం లేదు- మాత్సర్యం లేదు
ధర్మం లేదు, అర్ధం లేదు, కామం లేదు మోక్షం లేదు

చిత్ ఆనందం ఐనా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడను నేను

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్” ||

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మన్త్రో న తీర్థం న వేదా న యజ్ఞాః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానన్దరూపః శివోఽహం శివోఽహమ్

అర్ధం:

నాకు పుణ్యం లేదు, పాపం లేదు,
నాకు సుఖం లేదు, దుఃఖం లేదు,
నాకు మంత్రం లేదు, తీర్ధం లేదు,
నాకు వేదం లేదు, యజ్ఞం లేదు,
నేను భోజనం కాదు, తినదగిన పదార్ధం కాదు, తినువాడను కాను,
చిత్ ఆనందం ఐనా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడను నేను

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్” ||

న మృత్యుర్న శఙ్కా న మే జాతిభేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ |
న బన్ధుర్న మిత్రం గురుర్నైవ శిష్యశ్చిదానన్దరూపః శివోఽహం శివోఽహమ్

అర్ధం:

నేను మృత్యువును కాదు, సందేహమును కాదు
నాకు జాతి బేధం లేదు, నాకు తండ్రి లేడూ
తల్లి లేదు, జన్మ లేదు, బంధువు లేడూ
మిత్రుడు లేడూ, గురువు లేడూ, శిష్యుడు లేడూ,
చిత్ ఆనందం ఐనా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడను నేను

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్” ||

అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుత్వాఞ్చ సర్వత్ర సర్వేద్రియాణామ్ |
న చాసఙ్గతం నైవ ముక్తిర్న మేయశ్చిదానన్దరూపః శివోఽహం శివోఽహమ్ ||౬||

ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం నిర్వాణషట్కం సంపూర్ణమ్ ||

అర్ధం:

నేను నిర్వికల్పుడను, ఆకారం లేని వాడను,
అంతటా వ్యాపించి ఉన్నాను, నాకు ఇంద్రియములతో సంబంధం లేదు,
మోక్షం లేదు, బంధం లేదు ,
చిత్ ఆనందం ఐనా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడను నేను

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్”

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *