Blog

అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?

thought-of-the-day

అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?

28-5-2020 నుండి శుక్రమూఢమి ప్రారంభమై 10-6-2020 వరకు శుక్రమూఢమి త్యాగం జరుగును.

అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?

గురుగ్రహమే కానీ , శుక్ర గ్రహమేకానీ సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు.

మౌఢ్యకాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.

శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము. మౌఢ్యమిని “మూఢమి” గా వాడుకభాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు. మూఢమి అంటే చీకటి అని అర్ధం. మూఢమి అనేది అన్ని గ్రహాలకు ఉన్న గురు , శుక్ర మౌఢ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది.

శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటు , పోటులలో మార్పులు వస్తాయి.

శుక్ర గ్రహ పాలిత ద్వీపాలకు , ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బల హీనముగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు. ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి.

మౌఢ్యమిలో చేయకూడని కార్యక్రమములు:-

పెళ్ళిచూపులు , వివాహం , ఉపనయనం , గృహారంభం , గృహప్రవేశం , యజ్ఞాలు చేయుట , మంత్రానుష్టానం , విగ్రహా ప్రతిష్టలు , వ్రతాలు, నూతన వధువు ప్రవేశం , నూతన వాహనము కొనుట , బావులు , బోరింగులు , చెరువులు తవ్వటం , పుట్టువెంట్రుకలకు , వేదా”విధ్యా”ఆరంభం , చెవులు కుట్టించుట , నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయరాదు.

మౌఢ్యమిలో చేయదగిన పనులు :-

జాతకర్మ , జాతకం రాయించుకోవడం , నవగ్రహ శాంతులు , జప , హోమాది శాంతులు , గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు , సీమంతం , నామకరణం , అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమౌఢ్యమి వచ్చినా , శుక్రమౌఢ్యమి వచ్చినా చేయవచ్చును. గర్భిణి స్త్రీలు , బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో మూఢాలలో ప్రయాణం చేయాల్సివస్తే శుభ తిధులలో అశ్వని , రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్”

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *