Blog

ఆదిత్య హృదయము నకు, విష్ణుసహస్రనామము నకు సారూప్య సామ్యముల, ఒక పరిశీలన.

thought-of-the-day

ఆదిత్య హృదయము నకు, విష్ణుసహస్రనామము నకు సారూప్య సామ్యముల, ఒక పరిశీలన.

జై శ్రీరామ్ జై హనుమాన్

ఆదిత్య హృదయము నకు, విష్ణుసహస్రనామము నకు సారూప్య సామ్యముల, ఒక పరిశీలన.

ఆదిత్య హృదయము రామాయణం లోనిది,
విష్ణుసహస్రనామము మహాభారతంలోనిది….. రెండును ఇతిహాసములే.

ఆదిత్యహృదయము వాల్మీకి మహర్షిచే బయల్పరచబడినది.
విష్ణు సహస్రనామము వ్యాసమహర్షిచే బయల్పరచబడినది.

ఆదిత్యహృదయము రామరావణ యుద్ధ సందర్భమున యుద్ధ భూమినందు బయల్పరచబడినది.
విష్ణుసహస్రనామము కౌరవపాండవ యుద్ధ సందర్భమున రణభూమినందు బయల్పరచబడినది.

ఆదిత్య హృదయము అగస్త్య మహర్షి చే చెప్పబడినది.

విష్ణు సహస్రనామము భీష్మాచార్యునిచే చెప్పబడినది.

ఆదిత్య హృదయము శ్రీరాముని సన్నిధిలో(కి) చెప్పబడినది.
విష్ణు సహస్రనామము శ్రీకృష్ణుని సన్నిధిలో చెప్పబడినది.

రెండునూ నారాయణుని సన్నిధిలోనే. రెండిటికీ నారాయణుడు శ్రోత. అందులచే రెండిటికీ ఆయన మంగళాశాసనము వున్నది.

ఆదిత్య హృదయము వేదసమ సనాతనము .
విష్ణు సహస్రనామము ‘ఋషిభి: పరిగీతాని’ అయినందున పురాతనము .

రెండునూ మంత్రములే. ” శృణు గుహ్యం సనాతనం ” ; ” విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ” అన్న పదములు ఇందులకు నిరూపణము.

రెండునూ రహస్యములే. రెండునూ ఉపదేశింపబడినవే.

శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు

జై శ్రీమన్నారాయణ
[6:02 AM, 2/7/2020] +1 (647) 505-4072: జై శ్రీరామ్ జై హనుమాన్

మనిషి కి, శరీరం తో పాటు మనసు కూడా కలిగి ఉంటాడు, ఏ క్షణానైనా శరీరం లేదా మనసు కొంచెం ఇబ్బంది పడవచ్చును కదా, అప్పుడు మన మహర్షి మరియు జగత్ గురువుచే వచించబడిన ఆదిత్య హృదయమును, మరియు భగవద్గీతను అనుసంధానము చేసికొన్న, తిరిగి శరీరమునకు మరియు మనసుకు తగినంత శక్తీ అందచేయకలవు..

అగస్త్య మహర్షి, శ్రీరాముడు యుద్ధ భూమి యందు, శరీరం బాగా అలసటచెందినవాడయి ఉన్న క్షణాన, అగస్త్య మహర్షి వేంచేసి ఆదిత్యహృదయాన్ని (తతో యుద్ధ పరిశ్రాంతం, సమరే విజయస్యసి..,) అందచేసి వెడలెను అచటనుంచి.. మనిషికి ఎప్పుడైనా శరీరం అలసినప్పుడు.. ఈ ఆదిత్య హృదయ ధారణ ఏంతో ఉపయుక్తముగా ఉంటుంది.. ఎలా నమ్మటం ఈ విషయాన్నీ అంటే, శ్రీరాముడే మనకు కనిపిస్తున్న సాక్ష్యం…

అదేవిధముగా, యుద్ధమునకు సన్నుధుడై శ్రీకృష్ణ పరమాత్మునితో, ఏతెంచిన, అర్జునుడు మానసికదౌర్బల్యముచే, తన ధనుర్భాణములను పారవేచి, రధము దిగి దూరముగా వెళ్లుచున్న పార్థుడను గాంచి, శ్రీకృష్ణ పరమాత్ముడు , భగవద్గీతను (పార్దయా ప్రతిభోదితామ్, భగవాతామ్ నారాయణే స్వయం) పార్థునకు అందచేస్తారు… అంటే, మనిషి యొక్క, మానసిక పరిస్థితి ఏమాత్రం ఉన్నత స్థాయి నుంచి క్రిందకు మరలినప్పుడు… భగవద్గీత అనుసంధానం ఏంతో ఉపయుక్తముగా ఉంటుంది.. అనుభవైక నైవేద్యం…ఇక్కడ ఉన్న శ్రీరామ భక్తులకు ఈ విషయం అవగతమే… ఎలా నమ్మటం ఈ విషయాన్నీ అంటే, పార్ధుడే మనకు కనిపిస్తున్న సాక్ష్యం…

శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *