ఆమ్నాయ అంటే ఏమిటి?
ఆమ్నాయ అంటే ఏమిటి?
ఆమ్నాయమనగా వేదము. సకల మంత్రములూ ఆరు ఆమ్నాయములలో అంతర్భూతములైయున్నవి. ఆగమశాస్త్రరీత్యా స్థూలముగా విభజించినచో, వైదికోపాసన దక్షిణాచారమని, తాంత్రికోపాసన వామాచారము అని రెండు విధములుగా ప్రచారములో వున్నది.
యజ్జోపవీతము (జంధ్యము) గల బ్రహ్మ, క్షత్రియ, వైశ్య తదితర వర్ణముల వారికి అనగా “ఉపనయనము” (ఒడుగు) జరిగిన వారందరికీ గురు ఉపాదేశ విధానములో వేదోక్త అనగా ఆమ్నాయోక్త పద్ధతిలో చేయు ఉపాసన – దక్షిణాచారమని చెప్పవచ్చును.
ఆమ్నాయ విభాగములో సకల మంత్రములూచేరును. ఆమ్నాయమలు 6. వీటిని “షడామ్నాయములు” అంటారు. అవి-
• పూర్ణామ్నాయమ – ఋగ్వేదం – అధిదేవత ఊర్మిణి
• దక్షిణామ్నాయము – యజుర్వేదం – అధిదేవత భోగిని
• పశ్చిమ్నాయము – సామవేదం – అధిదేవత కుబ్జిక
• ఉత్తరామ్నాయము – అధర్వణవేదం – అధిదేవత కాళి
• ఊర్థ్వమ్నాయము – చతుర్వేదములు – అధిదేవత చండభైరవి
• అనుత్తరామ్నాయము – మహాత్రిపురసుందరి
సాధకులు వారి అభీష్టానుసారము ముందుగా శివపంచాక్షరి 5 లక్షలు జపించి, భక్తితో శివుని అర్చించి గురువును అన్వేషించి ఆయనకు శుశ్రూష(సేవ) చేసి గురు అనుగ్రహముపొంది మంత్రోపదేశము దీక్ష పొందవలయును.
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్”