Blog

ఏ యుగ ధర్మం ఎలా ఉండేదో?

thought-of-the-day

ఏ యుగ ధర్మం ఎలా ఉండేదో?

జై శ్రీరామ్ జై హనుమాన్

క్రింద చెప్పుకొంటున్న, నాలుగు యుగాలు కూడా, నాలుగు చక్రాలున్న బండిలాగ చూద్దాం, అప్పుడు, ఏ యుగ ధర్మం ఎలా ఉండేదో, మనకు పూర్తిగా అవగతం అవుతుంది…

కృతయుగమును-సత్యయుగముగా చెపుతారు-పూర్వాశ్రమములోని పెద్దలు- ఇక్కడ నీది లేదా నాది అని ఆలోచనికి సంబంధం లేకుండా. ఆ సంపందలను, అందరు ఉపయోగించుకొనేవారు-ఇక్కడ సత్యమే (ధర్మమే)- భగవత్ స్వరూపంగా చూసేవారు…ఇక్కడ “ఆశ” కి తావులేదు…(పూర్తి ధర్మమే-నాలుగు పాదాలు, అందుకే బండి స్థిరముగా నిలబడింది)

త్రేతాయుగమును-ధర్మ స్వరూపముగా చెపుతారు-పూర్వాశ్రమములోని పెద్దలు- ఇక్కడ నీది లేదా నాది అని ఆలోచనికి దగ్గర సంబంధం ఉంది . ఎవరి సంపందలను, వారే ఉపయోగించుకొనేవారు-ఇక్కడ సత్యం మరియు ధర్మమే – భగవత్ స్వరూపంగా చూసేవారు…ఇక్కడ కూడా “ఆశ” కి తావులేదు..(ఇక్కడ మూడింట ధర్మమే, అందుకే బండి కొంచెం వాలింది, కానీ బండి నడుస్తుంది…)

ద్వాపరయుగమును-ధర్మ అధర్మ మిళిత స్వరూపముగా చెపుతారు-పూర్వాశ్రమములోని పెద్దలు- ఇక్కడ నీది లేదా నాది అని ఆలోచనికి దగ్గర సంబంధం ఉంటుందికాని, అంతకంటే, ప్రక్కవాడి సంపద మీదకూడా అంతే ఆశ కలిగి ఉంటారు, బలాబలాలు, సాధ్యాసాధ్యాలు బట్టి, ప్రక్కవారిది దోచుకొనే స్థాయిలో ఉంటారు, ఎవరి సంపందలను, వారే ఉపయోగించుకొనే అవకాశం కొంత సంశయములో ఉంటుంది,-ఇక్కడ సత్యదూరం మరియు ధర్మమనేది ఉండి లేన్నట్టుగ, ఉండేది – అందుకే భగవంతుని రాక తప్పనిసరి అయ్యింది …(ఇక్కడ రెండిట ధర్మమే.. ఇక్కడ బండి క్రుంగింది, బండిని ముందు చక్రాలతో బలంగా లాగే ప్రయత్నం జరిగింది..)

కలియుగమును-ధర్మ అధర్మ మరియు సత్య అసత్యాలు మిళిత స్వరూపముగా చెపుతారు-పూర్వాశ్రమములోని పెద్దలు- ఇక్కడ నీది లేదా నాది అని ఆలోచనికి దగ్గర సంబంధం ఉంటుందికాని, అంతకంటే, ప్రక్కవాడి సంపద మీదకూడా అంతే కాక అందరి సంబందించిన సంపదల మీద ఆశ కలిగి ఉంటారు, బలాబలాలు, సాధ్యాసాధ్యాలు బట్టి, ప్రక్కవారిది లేదా అందరిదీ లేదా ఉమ్మడి సంపాదన దోచుకొనే స్థాయిలో ఉంటారు, ఎవరి సంపందలను, వారే ఉపయోగించుకొనే అవకాశం ఉండి ఉండనట్టుగా ఉంటుంది,-ఇక్కడ సత్య మరియు ధర్మ కనుచూపు మేరలో ఉండదు, ఉన్న అవకాశాలు, బాగా సన్నగిల్లుతాయి, అవుంటారా ! కాదంటారా ! – అందుకే భగవంతుని రాక అనివార్యం అనే అర్ధం లో మనమంతా చకోర పక్షులాగా, ఆ పరమాత్మ రాకకోసం చూడవలసి వస్తుంది….. (ఒక పాదముతో నిలబడలేక, బండి వాలి, క్రుంగి, చతికిలబడింది, నిలబడే ప్రయత్నం చేస్తుంది .. మరి, ఇది సాధ్యమేనా.. నిలబడుట..)

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు”

శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *