గజేంద్ర మోక్షం: గజేంద్ర వర్ణన!
గజేంద్ర మోక్షం: గజేంద్ర వర్ణన!
జై శ్రీరామ్ జై హనుమాన్
గజేంద్ర మోక్షం: గజేంద్ర వర్ణన!
ఎక్కడఁ జూచిన లెక్కకు
నెక్కువ యై యడవి నడచు నిభయూధములో
నొక్క కరినాథుఁ డెడతెగి
చిక్కె నొక కరేణుకోటి సేవింపంగన్.
ఎక్కడన్ = ఎక్కడ; చూచినన్ = చూసినను; లెక్కకునెక్కువ = చాలా ఎక్కువ ఉన్నవి; ఐ = అయ్యి; అడవిన్ = అడవిలో; నడచున్ = వర్తించెడి; ఇభ = ఏనుగుల; యూధము = సమూహము; లోన్ = లోని; ఒక్క = ఒక; కరి = గజ; నాథుడు = రాజు; ఎడతెగి = విడిపోయి; చిక్కెన్ = చిక్కిపోయెను; ఒక = ఒక; కరేణు = ఆడ యేనుగుల; కోటి = సమూహము; సేవింపంగన్ = సేవిస్తుండగా.
భావము:- ఆ అడవిలో ఎక్కడ చూసినా లెక్కలేనన్ని ఏనుగులు తిరుగుతున్నాయి. వాటిలో ఒక గజేంద్రుడు విడిపోయి వెనక బడ్డాడు. ఆడఏనుగులు అనేకం సేవిస్తు అతని వెంట ఉన్నాయి.
తత్వ రహస్యార్థం: సమిష్టి ఆత్మతత్వం నుండి వ్యష్టిరూపమును పొందడమే, ఆత్మ వలన ఎడబాటు పొందుట, సంసారణ్యంలో చిక్కుట, తప్పిపోవుట.
శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు
జై శ్రీమన్నారాయణ