Blog

తులసి పవిత్రతను, తెలుసుకునే చిన్న ప్రయత్నం

thought-of-the-day

తులసి పవిత్రతను, తెలుసుకునే చిన్న ప్రయత్నం

“సౌభాగ్యం సంతతిందేవి ధనధాన్యంచమే సదా, ఆరోగ్యం శోక శమనం కురుమే మాధవప్రియే”

తులసిచెట్టు పాతడం, పెంచడం, తాకడం వల్ల పాపం నశిస్తుందని ధర్మసింధు చెబుతోంది. శ్రీమహాలక్ష్మికి ప్రియ స్నేహితురాలు తులసీదేవి. శ్రీమన్నారాయణుని మనసుకు ఎంతో ఇష్టమైనది ఈ తులసిమాత. పుణ్యరాశి. పాపలను పటాపంచలు చేస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం, స్కాందపురాణం, పద్మపురాణాలలో తులసి మహిమ వర్ణితమైంది. యన్మూలే సర్వతీర్థాని అనే ప్రసిద్ధ శ్లోకం, “తులసి పాదులో సర్వతీర్థాలు ఉన్నాయి” అని చెబుతోంది. పరిమళ భరితమైన తులసి శ్రీకృష్ణునికి చాలా ప్రీతి. తులసి జాతులలో కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ప్రసిద్ధమైనవి. దేనితో అయినా దేవుని పూజించవచ్చు. ఇంటిలోని లక్ష్మీ తులసిని కోటలో ఉండి గృహిణులు నిత్యం పూజచేసి ఈ శ్లోకాన్ని చదవాలి. పూజకు మూడునాలుగు ఆకులు కలిసి ఉన్న తులసిదళాన్నే వాడాలి. కోటలోని తులసిని వాడకూడదు. తులసితీర్థం డయాబెటీస్, బిపిలకు మంచి మందు. రక్తశుద్ధి చేస్తుంది. సూర్యాస్తమయం తర్వాత తులసిని కోయకూడదు. తులసిచెట్టు నీడలో శ్రాద్ధం చేస్తే పితృతృప్తి అవుతుందట. తులసి మహాత్మ్యం ఇంత అని వర్ణించలేనిది.

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్”

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *