దైవ శక్తి మరియు క్షుద్ర శక్తి మధ్య జరుగుతూవున్న యుద్ధమే,వెలుగు – చీకటి.
దైవ శక్తి మరియు క్షుద్ర శక్తి మధ్య జరుగుతూవున్న యుద్ధమే,వెలుగు – చీకటి.
దైవ శక్తి మరియు క్షుద్ర శక్తి,, మధ్య జరుగుతూవున్న యుద్ధమే…. మీ సందేహం, దైవ శక్తి అంటే (వెలుగు లేదా జ్ఞానం అర్ధం లో చూడాలి, క్షుద్ర శక్తి అంటే, చీకటి లేదా అజ్ఞానం అనే అర్థంలో చూడాలి)
లోక కళ్యాణం కోసం భగవంతుడు, అవతరించినాడా, అంటే నా సమాధానం అవును, అంటే దాని అర్ధం, ధర్మ సంరక్షణార్థం లేదా ధర్మ సంస్థాపనార్థం, ఇంకా చెప్పాలంటే, అధర్మపరాయణులు ఎక్కువ ఐయి పోయి ధర్మానికి హాని జరిగినప్పుడు లేదా కనిపించకుండా పోయినప్పుడు, ఆ పరంధాముడు, ఎదో ఒక రూపంలో (కల్కి (విడగొట్టేది అని అర్ధం) ఆ రూపం ఇలాగే ఉండాలని ఎవ్వరు చెప్పలేదు, నా వరకు, ప్రకృతి (పంచభూతముల) వైపరిత్యాలు అన్ని కూడా ఈ కోవలోకే వస్తాయి) భూమి పైకి రావడం జరుగుతుంది… ఇది, మొదటి వాక్యానికి నా విశ్లేషణ.. ఇంక రెండవ ప్రశ్నకి లేదా సందేహానికి….
విశ్వంలో మంచి ఉన్నది అని మనం నమ్మితే, చెడుకూడా ఉన్నది అన్ని నమక్క తప్పదు ..ఎలాగా అంటే, పగలు ఉన్నది అంటే రాత్రి కూడా ఉన్నది అనే కదా అర్ధం, ఆ విధంగానే, మీరు వ్యక్తపరచిన ఆ విషయాలు..ఐతే అవి, మన మీద పనిచేస్తాయ లేదా, అంటే అదే ఆ వ్యక్తి స్వభావం లేదా ఆలోచనపైనా ఆధారపడివుంటుంది..
ఉదాహరణకి, నేనుగా పిలువబడవుతున్న, నాకు, మంచి మరియు మంచిగ లేనివాళ్లు కూడా స్నేహితులుగా ఉండవచ్చు, అయితే నేను ఏ విధముగా నన్ను నేను చూసుకోవాలని అనుకొంటున్నానో, అది నా చేతల్లో ఉంటుంది కానీ, ఎదుటివాడి చేతుల్లో అయితే కశ్చితముగా ఉండదని నా వ్యక్తిగత అభిప్రాయం…
మానసిక పరిపక్వత , ధర్మాచరణ, భగవత్ భక్తి మరియు శక్తి, ఇవన్నీ, పుష్కలముగా పెంపొందించుకొంటే, మీరు చెపుతున్న ఆ చెడు విషయాలు గాని లేదా వాటి ప్రభావం, మనపైన కశ్చితముగా పనిచేయదు… దీనినే సంస్కృతములో, యద్భావం తత్ భవతి (వేదాహమేతం పురుషం మహన్తం ఆదిత్య వర్ణం తమశస్తు పార్య… ఈ విధంగా కూడా చెప్పబడింది)
మనం ఎక్కువగా, ఏ విషయం మీద ఆలోచన చేస్తామో, అదే విషయం మనం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది…చివరగా, మంచి మరియు చెడు, రెండు కూడా ఈ విశ్వములో, నిక్షిప్తం అయి ఉంటాయి…
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు”
జై శ్రీమన్నారాయణ