ధర్మం నమ్ముకుంటే, ధనవంతుడు అవగలమా?
ధర్మం నమ్ముకుంటే, ధనవంతుడు అవగలమా?
ధనము అవసరం ఎంతైనా ఉంది, బ్రతకటానికి, కుటుంబ విధులు మరియు బాధ్యతలు నిర్వహించడానికి….”, నాకు అర్థమైంది ఇది మాత్రమే, అయన రాసిన ఇంగ్లీష్ మాద్యమములో ఉంచిన సందేహములో…
“ధనమేర అన్నిటికి మూలం…
..
శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం
…
మానవుడే ధనమన్నది సృజియించెనురా ,
కానీ తెలియక తానె దానికి దాసుడాయరా….”
అని పూర్వం ఒక సామాజిక స్పృహ ఉన్న రచయిత రాసిన అద్భుతమైన గీతం… “లక్ష్మీ నివాసం” అనే సినిమాలోది
ఈ ప్రశ్న లో ఉన్న మూడు అంశాలు, ధర్మం, విధులు, బాధ్యత, మరియు సంపాదన లేదా సంపదలు.. మరియు ముఖ్యముగా ఆత్మకి మరియు శరీరానికి ముడిపడి ఉన్నది ఈ “ధర్మ” సందేహం..
ఎలాగూ, ధర్మం వలన ధనవంతుడు అగుట సాధ్యమా అనే సందేహం వచ్చింది కనుక, ఈ పదాన్ని యొక్క విశిష్టిత చివరాఖరికి చూద్దాం…
సంపదలు అనేవే, మూడు రకాలుగా గుర్తించబడతాయి , అవి ఒకటి. ప్రధమ, మధ్యమ, మరియు అధమ
ప్రధమ సంపాదన అనగా, తనకు తానుగా సంపాదించినది అని అర్ధం లో చూడాలి..
మధ్యమ సంపాదనని, తాను కాకుండా, తన తండ్రిని నుంచి లభించినది గ భావించాలి
అధమ సంపాదన, తాను కాదు, తన తండ్రిది కాదు, ముందు తరలవారినుంచి వంశ పారంపరగా వస్తున్నదని గుర్తించాలి…
ఇక్కడ నేను, తండ్రి నుంచి సంక్రమించింది కానీ ముందు తరాలనుంచి వంశపారంపరగా, ,మరియు ధారాపాతంగా వచ్చి చేరినది, తప్పా లేదా ఒప్పా, అని చెప్పే ప్రయత్నం చేయుటలేదు, ఈ విషయాన్ని గ్రహించగలరని ఆశిస్తున్నా…
ధర్మ సంపాదన, మనిషికి, తృప్తిని మరియు సంతృప్తిని ఇస్తుంది, కానీ, సమాజం లో తగినంత విలువ తీసుకొనిరాదు, ఆస్తి మరియు అంతస్తు రూపములో.. అయితే ఆత్మకి తుష్టిని కలుగచేస్తుంది, తనని, తన పైన ఆధారపడ్డ వాళ్ళని, మంచి మార్గంలో నడిపించి, సమాజమునకు ఉపయుక్తంగా చేయబడతారు.. అధర్మ సంపాదన ఎంతగా శరీరానికి పుష్టిని ఇచ్చిన, అది చివరకి ఎక్కడకి చేరాలో అక్కడికే చేరుతుంది.. కాబట్టి, శరీర పుష్టి కంటే తుష్టి మంచిది అని నా వ్యక్తిగత అభిప్రాయం… (మరొక్కసారి, భగవద్గీత లో ఉన్న అద్భుత శ్లోకాన్ని, మనమందరం పదే పదే గుర్తుకుతెచ్చుకోవాలి (“యద్యదా చరతి శ్రేష్ఠహ…లోకాస్త అనువర్తతే”), ఇది అర్ధం చేసుకొని, మన జీవితవిధానానికి అలవరుచుకొంటే, సమాజం మొత్తం, ధర్మార్జనే గానే మరి వేరే ఆర్జనకు స్థానముండదు… అప్పుడు “రామరాజ్యం” చూస్తామని నా ప్రఘాడ విశ్వాసం..
అధర్మ సంపాదన, మనిషికి తృప్తిని లేదా సంతృప్తిని ఇస్తుందా లేదా అనే ధర్మ సందేహాన్ని ప్రక్కన్న పెడితే, కనీసం, కంటి నిండా నిద్రకూడా అందదు మరియు ప్రశాంత చిత్తముతో, బ్రతుకాజాలడు… పైగా మీకు తెలిసిన కుటుంబాలు (అధర్మ సంపాదనపరులు) ఎన్ని లేదా ఎంతమంది జీవితాలు (ఒక వ్యక్తి కాదు, అయన పైన ఆధారపడ్డవాళ్లు పరిస్థితి.. ఒక్కాసారి గమనించండి…) ఏ విధముగా రూపాంతరం చెంది ఉండటాన్ని మనమందరం సాక్షి భూతముములుగా చూస్తూనే ఉన్నాము…
అందుకే, మన సమాజం లో, మరణాంతరం, ఆ పార్థివశరీరాని చూడటానికి వచ్చిన జనులు, ఒక మాట అంటూవుంటారు, మనం కూడా వింటూవుంటాం, ధర్మాత్ముడు బ్రతికినంతకాలం ధర్మన్గా జీవించారు అని, అవునా కాదా ! మరికొందరిని, ఏమంటారో మీకు తెలుసు…కాబట్టి, సమాజం లో, ధర్మపరాయుణిడికి, బ్రతికినంతకాలం “కీర్తి” రాదు కానీ మరణించిన తరువాత “కీర్తి శేషులగా” మిగిలివుంటారు..
చివరగా, ధనాన్ని బట్టి, ఒక కుటుంబ పెద్ద యొక్క, విధులు గాని, భాద్యతలు, ఆధారపడి ఉండవు, తన స్థాయి ని (ఉన్న సంపాదన లేదా ధనాన్ని) బట్టి, విధివిధానాలు నిర్ణయించుకుని, బాధ్యతను అందరికి అమోగయోగ్యంగా, స్వీకరంచి, ఆచరణ చేసి, చూపించాకలిగితే, ఆ కుటుంబ సభ్యులు, ఆ శ్రేష్ఠుడు … (ఆ ఇంటి పెద్ద చూపించిన మార్గాన్నే అనుసరిస్తారుఅన్నది అక్షర సత్యం…
ధర్మార్జన పరుడు అత్యదిక ధనవంతుడు కాజాలడు అని చెప్పలేం కానీ, అదృష్టం ఉంటె, సాధ్యపడుతుంది, అయితే, ఇప్పుడు చెప్పేదే కరెక్ట్ మాత్రం అని చెప్పను (మన్నించాలి), ఒకవేళ, ఆ ఉన్న ధనాన్ని షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే, అదృష్టం ఉంటె, జరగ వచ్చు (అయితే, ధర్మాన్ని నమ్ముకున్నవాడు (రు), ఈ మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నుకోరు, ఎందుకు అంటే, ధర్మాచరణ లో ఉన్నవారు, ఆత్మ సంతృప్తికి పెద్దపీట వేస్తారు, కానీ మరిదేనికి కాదు)
చివరగా, ధర్మం గురించి, చెప్పాలంటే మాటలు చాలవు, అనుభవైక నైవేద్యం , చిన్న చిన్న మాటలలో చెప్పాలంటే, ఒక వ్యక్తి తాను ఏ విధంగా ఎదుటి మనిషి చేత గౌరవించబడాలని అనుకుంటాడో, అదేవిధంగా తాను ఎదుట వ్యక్తి తో, నడుచుకోవాలి.. అప్పుడే, ధర్మాచరణలో ఉన్నట్టు…
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు”
జై శ్రీమన్నారాయణ