పత్రం ,పుష్పం, ఫలం, తోయం
పత్రం ,పుష్పం, ఫలం, తోయం
మనఅందరికి తెలిసిన ఒక విషయం గురించి ఇక్కడ ఒక్కసారి పరిశీలన చేద్దాం, అది ఏమిటిఅంటే
“పత్రం ,పుష్పం, ఫలం, తోయం” -శ్రీకృష్ణ పరమాత్ముడు సూచనప్రాయముగా అందచేసిన అతి సుళువుగా ఆచరించదగిన విలువైన మార్గం తనని చేరుటకు లేదా పొందుటకు….
శ్రీకృష్ణ పరమాత్ముడు, ఈ విధముగా “పత్రం ,పుష్పం, ఫలం, తోయం” ఏదోఒక మార్గం ద్వారా తనను చేరవచ్చు లేదా పొందవచ్చు, అని చెప్పడం జరిగినది…ఐతే ఇందులో చెప్పినా ఆ పత్రం, పుష్పం, ఫలం మరియు తోయం గురించి ఒక్కఓక్కటిగా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం…
పత్రం అంటే ఆకులూ, అంటే చెట్లుకు లేదా మొక్కలకు ఆకులే ఆహారాన్ని తయారుచేయడానికి ఉపోయోగపడతాయి అనే విషయం మనఅందరికి తెలుసు, మరి ఈ పత్రాలు ఏ విధముగా మానవునికి ఆ భగవద్చింతనకి ఎలా ఉపోయోగపడతాయో తెలుసుకుందాం…
మానవుని యొక్క ఉచ్వాసా మరియు నిశ్వాసములే , ఆ పత్రాలు, అంటే, అయ్యవారి యొక్క కారణస్వరూపమే.. ఈ ఉచ్వాసా మరియు నిశ్వాసములు, వీటినే సాకారం లేదా హాకారం గ చెప్పబడుతున్నాయి.. అంటే, మనం ప్రతి రోజు చేసే ప్రాణాయామం , లో సోహం లో ఓంకారమే ఆ పరంధాముని యొక్క స్వరూపం, ఈ విధముగాకూడా, మానవుడు, ఆ పరమాత్ముడని చేరవచ్చనే విషయాన్ని, పత్రం ద్వారం కూడా, నన్ను చేరవచ్చు లేదా పొందవచ్చు అనే విషయాన్నీ సూచనప్రాయముగా చెప్పడం జరిగింది..
ఇదే విషయాన్నీ, అన్నమయ్య వారు, తన కీర్తనలో, “అలల చంచలమైన ఆత్మనందుని అలవాటు చేసెనే ఉయ్యాల్లా” …. అని కూడా చాల నర్మగర్భముగా చెప్పడం జరిగింది..
రెండవది ఐనా “పుష్పం” గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
పుష్పం సమర్పయామి అని పంచసంక్యోపచారాలలో ఒక ఉపచారముగ చేయడం మనం గ్రహించేవుంటాం. పుష్పం, షట్పదం (ఆరు పాదములు, ఇందలి అర్ధం ఒక్కసారి పరిశీలిద్దాం, పంచేఇంద్రియాలు మరియు మనస్సుకు (ఎవరైతే పంచేఇంద్రియాలకు మరియు మనస్సు యొక్క మాయ లేదా ప్రలోభాలకు లొంగకుండా ఉంటారో, వారు ఆ పరంధామునిని చేరుతారు లేదా పొందుతారని, ఆ శ్రీలలితాసహస్ర నామాలలో కూడా అగస్త్య మరియు హయగ్రీవ రహస్య సంవాదములో చెప్పబడింది) ప్రతీకగా లేదా సూచికగా అర్ధం చేసుకోవాలి) యొక్క ఆహారనేపథ్యం లో చూడాలి, అంటే, షట్పదం పుష్పాలలో ఉన్న మకరందాన్ని గ్రోలి తన ఆకలిని పారద్రోలుతాయని మనఅందరికి తెలుసు.
అయితే పుష్పానికి , షట్పదికి ఉన్న సంబంధం ఒక్కసారి చూద్దాం, షట్పదం శబ్దం చేస్తూ పుష్పం (లు) కనిపించేంతవరకు కలియతిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు అయితే పుష్పం కనిపిస్తుందో, తిరగడం ఆపి, పుష్పం మీద వాలి, మకరందాన్ని గ్రోలి వెడలిపోతుంది..అంటే, పుష్పం నాకు శబ్దమునకు మధ్య అవినాభావ సంబంధం ఉంది, అదేవిధముగా, మానవుని యొక్క శ్రవణములకు శబ్దమునకు (గ్రాహ్యమునకు) సూచికలు అంటే, ఆ పరంధాముని యొక్క గుణ విశేషములను, ఈ శ్రవణముల ద్వారా విని, తెలుసుకొనే, ఆ దిశగా ఆ పరంధామునిని చేరుటకు చేసే ప్రయత్నం ద్వారా కూడా, నన్ను చేరవచ్చు లేదా పొందవచ్చు, అనే ధర్మసూక్ష్మాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ విధంగా వచించుట జరిగింది, అందుకే మానవులకి శ్రవణాలను అందచేసి, బుద్ధిని కూడా అందచేసినారు..
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్”
జై శ్రీమన్నారాయణ