Blog

మనిషి, ఎప్పుడుఅయితే కర్త, కర్మ మరియు క్రియ…

thought-of-the-day

మనిషి, ఎప్పుడుఅయితే కర్త, కర్మ మరియు క్రియ…

మనిషి, ఎప్పుడుఅయితే కర్త, కర్మ మరియు క్రియ, అన్ని నరుడులో ఉన్న పరుడు చేస్తున్నాడు అనే భావన తో, మనసా వాచా కర్మణా, త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తాడో, అప్పుడు, వాడు కర్మఫల త్యాగి గ ఎఱింగి, ఆ ఫలితం గ, తిరిగి మర్త్యలోకానికి చేరడు, అంతేకాదు ఏ చాతుర్వర్ణనలోనికి (దేవత, మనుష్య, జంగమ మరియు స్థావరాలు ) విసిరివేయబడడు లేదా జారిపోడు ఎందుచేతన అంటే, ఆ జీవునికి, ఏ కర్మ వాసనలు అంటలేదు ఇంకా చేప్పాలంటే , నేను అనే స్పృహ లేదు కాబట్టి!

*అయితే, మానవులం కదా, మంచి జరిగితే లేదా ప్రతిభను గుర్తిస్తే నేను అనే భావన, లేదు, అనుకున్నది జరగకపోతే , పరుడి ఆట అనే భావనలో జీవిస్తాం అవునా ! కాదా !

అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు, కర్మణ్యే వాదికారస్తే… అని చాల అర్ధవంతం గ అర్జునుడిని అడ్డుగా పెట్టుకొని మనకి భగవద్గిత రూపం లో, జీవుని యొక్క తత్వాన్ని భోధనచేసినారు!

ముందు జన్మల పాప పుణ్య కర్మలను గురించి నేను ఇప్పుడు, మాట్లాడాను, కానీ, ఒక ఉదాహరణ చెపుతాను, జాగర్తగా విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం సరేనా !

ఒక కుటుంబం లో, భార్య భర్త మరియు ఒక బిడ్డ ఉన్నారు అని అనుకుందాం, ఆ భర్త కి మసాలా వంటకాలు తీసుకుంటే కడుపులో లేదా పొట్టలో బర్నింగ్ సెన్సేషన్ అవుతుంది, కానీ, ఆ రోజు, అయన ధర్మపత్ని, శనివారమని, వీకెండ్ అని, మంచిగా మసాల దట్టించిన, సువాసనతో ఘుమ ఘుమ అనిపించే బిర్యానీ, అయ్యో సారీ, వెజ్ బిర్యానీ చేస్తే, ఆ భర్త కి తెలుసు, మసాలా వంటకాలు తన శరీరానికి అంత మంచిది కాదు అని, కానీ, ఇంద్రియ నిగ్రహం లేక, ఇంద్రియ మొహం లో, తలమునకలై , ఆబగా గ, ఆ వెజ్ బిర్యానీ సుష్టుగా తిని, బ్రేవ్ అని త్రెంచి, ఆనందం గ, ఓ మాంచి తెలుగు పాత సినిమా చూసి, విశ్రాంతి తీసుకొనే క్రమం లో, పడుకునే ప్రయత్నం చేసారు.

అయితే పాపం, లోపలికి వెళ్లిన ఆ ఆహారం, ఏది, మసాలా తో కూడిన వెజ్ బిరియాని, తన పని కానించేస్తుంది, అంటే అయ్యగారికి, బర్నింగ్ సెన్సేషన్ మొదలయింది , పాపం నిద్ర కరువయింది అయ్యగారికి, ఎందుచేతన అంటారు? ఇంద్రియ మొహం లో చిక్కిన దాని ఫలితంగా !

కర్మ అంటే, చేసిన పని యొక్క ఫలితం అవునా ! కాదా !, అది ముందు లేదా వెనుక, అన్నది అప్రస్తుతం, కానీ నిజ అదే కదా! వెజ్ బిర్యానీ తనకు మంచిది కాదు అని తెలిసిన కూడా ఆహారం గ తీసుకున్నారు, ఆ ఫలితానికి, పర్యవ్యసనంగా నిద్రకి దూరమయ్యారు,

చూసారుగ, తెలిసి చేసిన తెలియక చేసిన, ఆ చేసిన పని యొక్క ఫలితం అయితే తిరిగి తిరిగి మనదగ్గరకే వస్తుంది, అది ఇప్పుడు చేసినదా లేదా ఎప్పటిదోన అనే కాలం తో సంబంధం లేకుండా వేటాడి వెంటాడి మనకి ఆ యొక్క ఫలితాన్ని పూర్తిగా తిరిగి ఇచ్చి వెళుతుంది,!

ఈ ప్రశ్నలో, ఈ కర్మలని ఎవరు మైంటైన్ చేస్తారు, అని కూడ సందేహాన్ని వెలిబుచ్చారు, ఆ సందేహానికి రేపు అనగా ఆదివారం విశ్లేషణ అందచేయగలను అని భావిస్తూ, మీ అందరి దగ్గర సెలవు తీసుకొంటున్నా, మరి సెలవా!

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *