మనో క్షయో మోక్షయేవ…
మనో క్షయో మోక్షయేవ…
జై శ్రీరామ్ జై హనుమాన్
“మనో క్షయో మోక్షయేవ” మోక్షమునకు వ్యుత్పత్తి, మనసును నిర్మలం చేసుకో కలిగితే, మోక్షం సాధ్యం అనే అర్ధములో చెప్పబడింది. అందుకనే మనకు, చతుర్విధ పురుషార్దలు అంటుంది శాస్త్రం, అందులో, మనం మొదటి మూడు, గ్రహించకలగాలి, మళ్ళి అందులో, మొదటిది, ఆలంబన చేసుకొని, రెండు మరియు మూడు గ్రహించాలి, అంటే, ధర్మ, అర్ధ, కామ, మరియు మోక్ష… ధర్మాన్ని ఆలంబన చేసుకొని, అర్ధాన్ని (సంపద అనే అర్ధం తీసుకొందాం) , అలాగే కామాన్ని (భౌతికమైన కోరిక అనే అర్ధం లో తీసుకుందాం), ఎప్పుడు అయితే మానవుడు, ఈ విధంగా, ధర్మబద్ధమైన అర్దాన్ని, కామాన్ని, పొందుతాడో, మోక్షం తనంత తానె దరిచేరును… ఎలాగా అంటే, తనకు ధర్మబద్ధమైన అర్ధముతో, తనకు, కావాల్సిన కోరికలను ధర్మబద్ధముగా తీర్చుకుంటాడో, అప్పుడు, మనసు యందు కోరికలు నిర్మలమై, ఆ మానవుడను అధర్మపరాయణుడుగా చేయబడడు… అంటే “మనో క్షయో మోక్షయేవ” అంటే మోక్ష ప్రాప్తికి అర్హుడుగా పరిగణించబడుతాడు…ఔనంటారా ! కాదంటారా !
అందుకే, మన హైన్దవ వివాహ మంత్రాలలో , ధర్మేచా, ఆర్డేచ, కామేచ, నాతి చరామి అని పెద్దలు లేదా పురోహితులు చెపుతారు, చూసారా, మోక్షేచ అనే చెప్పరు, ఎందుకు అంటే, ధర్మంతో కూడిన అర్ధం, కామం కలిసుంటే, మోక్షం అదే కలుగుతుంది అనే భావనలో చెప్పటం జరిగింది, అంటే భర్త ని ధర్మ మార్గములో ఉంచే లేదా నడిపించే భాద్యత ఆ ధర్మపత్నీది అని, అదేవిధంగా, ఆ ధర్మపత్ని ని కూడ, ధర్మ మార్గములో ఉంచే లేదా నడిపించే భాద్యత ఆ భర్తది అనే చెప్పుటయే అందులోని అంతరార్ధం… అంటే భార్య భర్త (లు) సమానులు అనే భావన, ఎక్కువ లేదా తక్కువ అనే తారతమ్యాలు లేనేలేవు, మన హైన్దవ వివాహ సంప్రదాయములో….అని గ్రహించాలి, ఈ విషయాన్ని “అర్థనారీశ్వర” తత్త్వం తెలుపుతుంది…
శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు!
జై శ్రీమన్నారాయణ