రామునికి వాహనం ఎందుకు లేదు?
రామునికి వాహనం ఎందుకు లేదు?
రామునికి వాహనం ఉండదు తల్లి, ఎందుకు అంటే, రాముడు (పరుడైనవాడు, నరుడుగా ఈ భూమి మీద నడియాడుటకు అవతరించిన వాడు (అవతరణ అంటే, పైన ఉన్నవాడు క్రిందకు రావడం అనే సందర్భం లో తీసుకోవాలి …)
మానవుడు గ ఉన్న రామచాన్ద్రుడు (వానరులను (వానర అంటే అర్ధం, కోతి అనే అర్ధం కాదు, “వా” అంటే నోరు కలది , నర (నరుడు అనే కదా అర్ధం…, అంటే సూక్ష్మంగా చెప్పాలంటే, నోరు ఉన్నది కదా అనే నోటికి వచ్చినట్లు (ధర్మ, అధర్మాలు, మధ్య లేదా నడుమ తేడా లేకుండా మాట్లాడుట (అందుకే ఎవరన్నా అర్ధం లేకుండా మాట్లాడుతూ ఉంటె, పెద్దలు ఏమిటి ఈ కిచ కిచ ధ్వని, అనే పద ప్రయోగాన్ని చేసెవారు, పూర్వాశ్రములో) మాటలాడుట తగదు , అటువంటి వారిని ధర్మం వైపు నడిపించిన నరుడు కాబ్బటి, రాముడు మనఅందరికి ఆరాధ్య మానవుడుగా , మర్యాద పురుషుడుగా, సౌశీల్యవంతుడుగా, ఇంకా అనేక విధములుగా కొనియాడబడుతున్నాడు, కొన్ని వేళ సంవత్సరములుగ అవునా ! కాదా !
నరుడు గా నరులకి కనిపించేవాడు, కనుక, ఎటువంటి, వస్తువులు లేదా మరి ఇతర వాటిచే, తన గుణములని, వ్యక్తపరచడం జరగదు. నరుని యొక్క గుణములన్ని తన నడవడిక చేత దర్శింపచేయాలి తోటి మానవులకి (మనుష్య లేదా మానవ జాతికి) , అవునా ! కాదా ! అందుచే, ఆ రామచంద్రునికి కి వాహనంగ ఏది చూపుట జరుగలేదు, కానీ, రాముని చేతిలో ఉన్న ధనుస్సు (కోదండపాణి ( రాముని చేతి యందు ఉన్న, ఆ కోదండమే, ధర్మం అనే తత్వాన్ని ప్రబోధిస్తోంది అవునా ! కాదా !, చెప్పకనే చెప్పారు పెద్దలు, పలుకే బంగారమైనా (ఆ పలుకే, చిలుక (ముందు చెప్పిన విధం గ, ఏది మాట్లాడాలో అదే మాట్లాడతారు ఆ రామచంద్రుడు, మరి అయన స్వరూపం యొక్క నిత్యన్నపాయని (ఆ మహాలక్ష్మి ఏ కదా, సత్య వాచ…. , అందుకే, మనం ఎవరితో సాంగత్యం లేదా కలిసి జీవిస్తున్నామో, ఆయా గుణములు వర్తిస్తాయి ( భార్య భర్త , లు ఎలా ఉండాలో కూడ నర్మగర్భం గ చెప్పక్కణ్ణే చెప్పారు పెద్దలు) అర్ధం లో కూడ చూడవచ్చు అనే చెప్పే ప్రయాతనమే కానీ, ఆ రామచంద్రుని, మనం అందరం మానవుడిగానే చూసే, ఆయన వ్యక్తపరచిన లేదా ఆచరించిన ధర్మాలను, మనం కూడ, తెలుసుకొని, ఆచరణ చేసే ప్రయత్నం చేద్దామా !
శుభం భూయాత్! సర్వే జన సుఖినో భవంతు!
జై శ్రీమన్నారాయణ