Blog

రామో ద్విర్ణాభి భాషతే

thought-of-the-day

రామో ద్విర్ణాభి భాషతే

“రామో ద్విర్ణాభి భాషతే”- ఇది కదా మన “శ్రీమద్రామాయణం” నుంచి గ్రహించవలిసిన అద్భుతమైన విషయాలు- ప్రపంచం లో రెండు తలమానికం గ ఉన్న రెండు గ్రంధాలు, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటంగా చూపించనవి, ఒకటి “శ్రీమద్రామాయణం”, రెండవది “భగ్వద్గీత”! ఎంత ఆశ్చర్యం, ఈ అసలు సంపదలను మనం కాపాడుకోలేకపోతున్నాం! అదృష్టం, ఇక్కడ ఉన్న ఈ సత్వగుణ సంపన్నుల ద్వారా ఈ రెండిటిని, అందరికి చేరువలోకి తీసుకుని వెళ్లి ప్రయత్నం చేద్దాం !

శ్రీరామచంద్రుడు “సౌశీల్యుడు” గ ఎలా గుర్తించబడినాడు, ఈ గుణాన్ని మనమందరం ఏ విధంగా అలవరచుకోవచ్చునో చుద్దాం

“శ్రీరామచంద్రుడు “సౌశీల్యుడు” గ ఎలా గుర్తించబడినాడు, ఈ గుణాన్ని మనమందరం ఏ విధంగా అలవరచుకోవచ్చునో చుద్దాం

శ్రీమద్రామాయణం లో , ఆదికవి వాల్మీకి మహర్షి, మానవ జాతి కి అందచేసిన, ఒక గొప్ప సంపద, ఎలాగా అంటే, శ్రీరాముని అడ్డుగపెట్టుకొని, అనేకానేక విషయాలు ఈ గ్రంధం యందు, స్పృశించారు, ఇప్పుడు చుద్దాం, “సౌశీల్యవంతుడు” గ ఎలా గుర్తించపడ్డారు, అని,

జాతి, కులం, రంగు, విద్య, సంఘం లో ఉన్న ఆర్థిక అసమానతలు, ఏమి కూడ, తన పరిగణలోకి తీసుకోకుండా, అందరితో కలిసి తన, పర బేధ విబేధా లు లేకుండా, ఎలా మసలుకున్నారో చుద్దాం,

మొదట శృంగిభేర పురములో ఆటవిక రాజు గ ఉన్న, గుహునితో, ఆత్మసఖుడా అని శ్రీరాముడు తన హృదయానికి హత్తుకున్నాడు (జాతి, కులం,రంగు, విద్య, మరియు ఆర్థికం గ ఏ విధంగా కూడ, సమానత లేని వాడు, అవునా ! కాదా !

కొంచెం కథ ముందు జరిగితే, రామచంద్రుడు , సుగ్రీవుడును (సు”గ్రీవం” అంటే మంచి ఖంఠం లేదా స్వరం కలిగినవాడు అనే అర్ధం), రామచంద్రుడు , సుగ్రీవునితో అగ్ని సాక్షి గ స్నేహ హస్తన్ని అందించారు, ఇక్కడ కూడ, పైన చెప్పిన గుణాలతో పాటు, అన్నగారు, తరిమేస్తే ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నారు, ఐనప్పటికీ, ఎటువంటి అరమరికలు లేకుండా స్నేహాన్ని స్వాగతించారు, అవునా ! కాదా !

అలా కథ ముందుకు సాగుతూ ఉంటె, లంక రాజ్యానికి చేరటానికి, సిద్ధంగా ఉన్న, ఆ రామ పరివారానికి, ఆకాశ మార్గాన, తన చెంతకు చేరి, శరణు అన్న విభీషుణ్ణి చూసి, నువ్వు నా తమ్మునితో సమానమని హృదయానికి హత్తుకున్నాడు , చూసారుగా ఇక్కడ కూడ, పైన చెప్పిన గుణములతో పాటు, అన్నగారు దేశబహిష్కరణ గురైనవాడు,

ఈ విధంగా, పైన ఉదహరించిన సందర్భాలలో, (శ్రీ) రాముడు, ఎటువంటి బేధ భావం లేకుండా, అందరితో కలిసి, మెలిసి నడచినాడు, అటువంటి గుణాన్ని “సౌశీల్యం” అంటుంది శాస్త్రం, అందుకే, మనం ఆడ పిల్లలకి, సుశీల అనే నామధేయని అందచేస్తూ ఉంటారు మనం పెద్దలు!

ఆ శ్రీరామచంద్రుని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నా, మనమందరంకూడ , ఆ స్వామి లో ఉన్న ఈ అద్భుతమైన “సౌశీల్యం” అనే గుణాన్ని, ప్రయత్న పూర్వకంగా అలవరచుకొనే దిశగా నడుచుకుందామని ఆశిస్తూ, మీ అందరివద్ద సెలవా తీసుకొంటున్నా.

శుభం భూయాత్! సర్వే జన సుఖినో భవంతు!

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *