రావణాసురుడిని రావణాబ్రహ్మ గ పిలవబడ్డాడు, ఎందుకంటే?
రావణాసురుడిని రావణాబ్రహ్మ గ పిలవబడ్డాడు, ఎందుకంటే?
పులస్త్యబ్రహ్మ, విశ్రవసు యొక్క తండ్రి, విశ్రవసు యొక్క సంతానం వరుసగా కుబేరుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, సూర్పనఖ మరియు విభీషణుడు. అందుకే రావణాసురుడిని రావణాబ్రహ్మ గ పిలవబడ్డాడు, ఎందుకంటే, “తాత”గ ఉన్నది పులస్త్య బ్రహ్మ కనుక,….
పులస్త్యబ్రహ్మ ఇప్పుడు రావణుడుగా పిలువబడుతున్న అసురుడుకి, దశగ్రీవః (దశ కంఠ) అని నామధేయాన్ని ఇవ్వడం జరిగింది, అయితే ఆ అసురుడు మాత్రం “రావణ”గానే గుర్తించబడుటకు ఆనందించేవాడు, రావణ, ఆంటే బాధ భరించలేక ఏడ్చినవాడు , పదునాలుగు భువనభాండాలు ఆ అసురుడి ఏడుపుకు భయపడి మహా శివుణ్ణి ప్రార్థిస్తే, ఆ పరమేశ్వరుడు, తన ఎడమ కాలు బొటనవేలు కొంచెం పైకి తీస్తారు, ఈ విషయానికి ముందు, ఆ అసురుడు, పార్వతి సమేతుడైన ఈశ్వరుడు, ఉన్న, కైలాసపర్వతాన్ని, తన భుజబలముతో, అహంకరించి, గర్వితుడై, ఆ కైలాస్ పర్వతాన్ని, ఎత్తబోతే, ఆ అసురుని, గర్వభంగం చేయుటకు, మహాశివుడు చేసిన చిన్న లయ కి, ఆ అసురుడి ఏడుపు భరించలేకపోతే, మహాశివుణ్ణి చేత రావాణా, అనే నామధేయాన్ని పొందేడు…
అంటే, ఆసురుడు నాలుగు దిక్కులకు, నాలు మూలలకు, అధ మరియు ఊర్ధ్వ లోకానికి కూడా, వెళ్లగలిగినవాడుగా చెప్పబడుతాడు. లేదా గ్రీవః లేదా కంఠ ఈ నాలుగు దిక్కులకు, నాలు మూలలకు, అధ మరియు ఊర్ధ్వ లోకానికి చేరగలదు అనే అర్ధములో చూడాలి.
తొమ్మిది (నవ) రంధ్రములతో కలిగిన మానవ శరీరాన్నే, లంకగ చెప్పబడుతుంది, అయితే బావుంది, మరి అందులో ఉన్న రావణ, కుంభకర్ణ, విభీషణుడు ఎక్కడ, అనే ప్రశ్న ఉద్భవిస్తుంది? అవునా ! కదా ! అందుకే సుందరకాండ లో, ఆదికవి, వాల్మీకి మహర్షి, ఒకచూట కాంచనలంక గ సంబోధిస్తారు, దానిఅర్థం, మనం ఎప్పుడైనా, మనల్ని మనం అద్దం లో చూసుకొన్నప్పుడు, ఎవరివారు ఎంత అందంగా కనిపిస్తారో, దానినే మహర్షి కాంచనలంకగా వర్ణించారు…
మన మనసే – రావణ, తనకు నచ్చిన పనే, చేస్తుంది,
మనలో ఉన్న బద్దకమే- కుంభకర్ణ
మనలో దాగొనికున్న బుద్ధే – విభీషణుడు
లేదా, దీనినే మరోరకంగా చెప్పాలంటే…
మనలో ఉన్న సత్వ గుణమే- విభీషణుడు
మనలో ఉన్న రజో గుణమే- రావణ
మనలో ఉన్న తమో గుణమే-కుంభకర్ణుడుగా చెప్పబడుతున్నాయి
తానూ ధర్మ బద్ధుడై ధన సంపాదనచేస్తే – అతనే- రామునితో కలసి ఉన్న లక్ష్మణ స్వామి- శ్రీరాముడు గ కొనియాడబడతాడు-విభీషణుడుగా చూడవచ్చు..
తానూ సంపాందించిక, తరతరాలుగా వస్తున్నా సంపదలను- ఎటువంటి స్వయం శక్తీ మేరకు, సంపాదన చేయకోపోతే-అతనినే కుంభకర్ణుడిగా చూడవచ్చు..
తానూ ఆదర్మబద్దుడై , తన భుజ, అధికార బలముతో, సంపాదిస్తూ, తృప్తిపడక, అందరిసంపదలు తానె అనుభవిచాలని ఆలోచన కలిగినవానిని- రావణగా చూడవచ్చు…
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు”
శ్రీమన్నారాయణ