Blog

వసుదేవుడు అంతవాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటారు కదా..

thought-of-the-day

వసుదేవుడు అంతవాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటారు కదా..

జై శ్రీరామ్ జై హనుమాన్

“వసుదేవుడు అంతవాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటారు కదా ” అందులో ఉన్న అర్ధం, పరమార్థం లేదా దాగుకొనిఉన్న రహస్యం లేదా తత్త్వం ఏమిటి, అని పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక ధార్మికుడు అడిగిన ఈ ప్రశ్నకి, ఆ పరంధాముడు ఏ విధంగా పలికిస్తారో, ఆ విధంగానే వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్న….

ఇక్కడ, మనం మరచిన విషయం ఏమిటి అంటే, శ్రీకృష్ణ పరమాత్ముని ఆజ్ఞ మేరకు, వసుదేవుడు, ఆ చిన్ని కృష్ణుని ఒక తట్టలో పెట్టుకొని, తాను బందిచబడ్డ, కారాగారం నుంచి బయటకు అడుగు పెట్టారు, ఆ సమయంలో దేవకీ మాత మాంచి నిద్రావస్థలో ఉన్నారు, అదేవిధంగా ఆ కారాగారం బయట కాపలా ఉన్న భటులు కూడా మాంచి నిద్రలో జారుకుని ఉన్నారు, ఆ సందర్భం లో, వసుదేవుడు, అడుగు బయట పెట్టడం జరిగింది, ఇంతవరకు కథ బాగానే జరిగింది, మన ఎవ్వరికి, ఎటువంటి సందేహం కలగలేదు, ఎందుకు అంటే, అక్కడ ఉన్నది శ్రీకృష్ణుడు, తన మాయ చేత, ఆ పరిస్థితులని ఆ విధంగా చేసారని అనుకున్నాం, అంత చేసిన ఆ స్వామికి, ఆ గాడిదని నిద్రావస్థలోనికి ఉంచలేరా? అన్న ప్రశ్న మనకి, కలగాలి, కానీ, కలగలే, ఎందువలనా, లేదా ఆ స్వామి ఎందుకు ఆలా చేయలేదు అంటే, అక్కడే మనఅందరికి, ఒక గొప్ప తత్వాన్ని, అందచేసే ప్రయత్నములోనే ఆ విధంగా జరిగింది, ఐతే ఏమిటి, ఆ తత్త్వం….

దేవకీ (ఆకాశానికి (ఆకాశం నుంచి, వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి మట్టి ఏర్పడుతుంది, (ఏ ఏవం వేద యోపామ్ ఆయతనం వేద…) ప్రతీక, అందుకే శ్రీకృష్ణుని దేవకీ సుతుడు అంటారు (దేవకీ అంటే, ఆకాశం, అంటే, అనంతం అనే అర్ధం, అందుకే, శ్రీకృష్ణుని కి అనంతుడని పేరు కలదు, ఏమంటారు…) , వసుదేవుడు సత్వ గుణాన్ని కి ప్రతీక ), అందుచే కంసుడు, దేవకీ వసుదేవుడుని వేరు చేయలేకపోయాడు, అంతేగానీ, ఎనిమిదో సంతానం వరకు, వేచిఉండేంత అమాయకుడు కాదు కదా ! ఇక్కడ, ఒక ఇంగ్లిష్ సామెత చూద్దాం (ప్రివెన్షన్ ఐస్ బెటర్ than క్యూర్), అవునంటారా ! కాదంటారా !

ఇక అసలు తత్వాన్ని, ఒక ఉదాహరణ లో, మరునాడు చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకు అంటే, ముందు, కొంత సంబంధిత విషయాన్ని అందచేయాలి కాబట్టి, మరి, మరునాటి వరకు, వేచిచూద్దాం ఏమంటారు!

మీరు ఒక కంపెనీ లో, పని చేస్తున్నారని అనుకుందాం, ఆ కంపెనీ యజమాని, మీకు ఒక కార్యం పూర్తి చేయమని అప్పగించారు, ఆ కార్యం చేసే సమయములో, ఒక చిన్న వ్యక్తి మీరు చేపట్టిన లేదా చేస్తున్న కార్యానికి, ఇబ్బంది కలుగ చేస్తున్నాడు, అప్పుడు మీరు ఏమిచేస్తారు, ఏమి ఆలోచన చేస్తారు? ఇబ్బంది కలుగుతుందని, ఆ కార్యని మధ్యలోనే వదిలివేస్తారా? లేదా ఎలాగైనా ఇచ్చిన పనిని, సఫలం చేసి మీ కంపెనీ యజమాని యొక్క, గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తారా? లేదా ఎలాగైనా మీ ముందున్న కార్యం పూర్తి చేయటం మీ గురుతర భాద్యత అని అనుకుంటారా లేదా ? ఇంత సంక్లిష్ట పరిస్థితులో కూడ, అనేకాకనేక ఆలోచనల మధ్య సతమవుతూ ఉంటారు? అవునంటారా ! కాదంటారా ! అదే నిజం కాకపోతే, ఆ కంపెనీ యజమాని అంతమంది లో, మీకే, ఆ కార్య సాధన మీ చేతులో ఎందుకు ఉంచినట్లు? అంటే చెప్పకనే చెప్పారు మీరు సాధకులని ఏమంటారు (ఇక్కడ ఒక్క మాట, రామాయణములో, సుగ్రీవుడు, హనుమంతులవారిని దక్షిణ దిక్కుగా పంపిన, లేదా రామచంద్రుడు, అంతమంది వానర సేనలో, వానరాగ్రేసరుడు అయినా హనుమంతుని చేతికి తన అంగుళీయకం ఇవ్వటం లో దాగి ఉన్న తత్వ రహస్యం, హనుమంతుల వారు, ఎన్ని ఆవాంతరములు ఎదురుఅయిన ఇచ్చిన కార్యం సాధించగలడు అనే సత్యాన్ని చాల నర్మగర్భంగా వాల్మీకి మహర్షి ఆ రెండు సందర్భాలలో చూపించటం జరిగింది, అవునంటారా! కాదంటారా !

ఆ “ఆ కంపెనీ యజమాని అంతమంది లో, మీకే, ఆ కార్య సాధన మీ చేతులో ఎందుకు ఉంచినట్లు?”
అన్న ఆలోచన రాగానే, ఎట్టి పరిస్థితుల్లో కూడ, ఇచ్చిన కార్యని, పూర్తి చేస్తారు (ఆ సమయములో, మీకు అడ్డుగా ఉన్న ఆ చిన్న వాడిని, బుజ్జగించో, నయానో, భయానో (ఇక్కడ మీ కార్యం పూర్తి కావటానికి, ప్రధాన అవరోధముగా ఉన్న ఆ చిన్న వాడిని (బుజ్జగించే ( ఎదో ఒక ఆశ చూపో, లేదా వాడి గెడ్డం పట్టుకొని బ్రతిమాలో, లేదా వసుదేవుడి లాగా…., ఎందుకు అంటే నయానో లేదా భయానో కుదరదు కాబట్టి), ఆ సమయంలో మీరు మీ స్థాయి అన్ని మరచి, చేపట్టిన కార్యని సఫలీకృతం అయ్యేట్టుగా చేసి, మీ కంపెనీ యజమాని యొక్క కృపకు పాత్రులు అగుతారు అవునంటారా ! కాదంటారా !

అంటే, సత్వగుణ సంపన్నులు, తాము చేపట్టిన, కార్య సిద్ధికి, సఫలీకృతం కాకుండా అడ్డుపడుతున్న, రజో లేదా తమో గుణ సంపన్నులను, గౌరవిస్తూ (తానొప్పక , తానొవ్వొక్క తప్పించుకు వాడు…), తనకివ్వబడిన కార్యాన్ని సఫలం చేయుట యందు మనసు లగ్నం చేసి, కార్యసాధకుడుగా గుర్తింపబడతాడు..

మరి, ఒక సామాన్యుడిగ, మనమే,ఒక కార్యం కోసం, ఇంత శ్రమకోరి, ఆ చిన్న వాడిని బుజ్జగించి ఆ కార్యని పూర్తి చేసినప్పుడు, ఆ పరంధాముడు ఆజ్ఞాపించిన రీతిగా, వసుదేవుడు (సత్వగుణ సంపన్నుడు) ఆ దారిలో అడ్డుగా నిలిచిన గాడిద కాళ్ళు పట్టుకొని తనకిచ్చిన కార్యని పూర్తి చేయుటలో ఆశ్చర్యం ఏముంది!

ఇక్కడ మనం చూడవలసిన విషయం, వసుదేవుడు గాడిద కాళ్ళు పెట్టుకున్నాడా లేదా అని కాదు, ఎవరికీ అయినా ఒక గురుతర భాద్యత ఇచ్చిన్నప్పుడు, మనలో ఉన్న రజో, మరియు తమో, గుణాలను, దరిచేరనీయకుండా, సత్వగుణ సంపదతో, ఆ కార్యని ఎలా సఫలం చేయవచ్చునో ఎన్ని ఆటంకములు ఎదురువచ్చిన, ఇచ్చిన కార్యని ఎలా పూర్తి చేయాలి, అని చెప్పటానికే ఈ నానుడి కానీ, ఆ పరంధాముడు అయినా ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి, ఆ గాడిదను, నిద్రావస్థలోనికి పంపటం చేతగాక కాదు కదా !

ఇటువంటి సందర్భం, భార్య భర్త మధ్య కావొచ్చు, బాస్ మరియు క్రింద టీం లో ఉన్న ఎంప్లాయ్ కావొచ్చు, లేదా అన్న తమ్ములు, అక్క చెల్లలు, లేదా సమాజము లో, ఎక్కడైనా జరగవచ్చు కదా, ఆయా చోట్ల, సమోయోచితముగా, ఆలోచన చేసి లేదా నడుచుకొని, జయుడవై, విజయుడవై తిరిగి రావాలి అనే అర్ధం లో పైన ఉంచిన “వసుదేవుడు అంతవాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటారు కదా” , అనే నానుడిని అర్ధం చేసుకొనే, మన జీవన ప్రయాణములో, ఆయా సందర్భంలో అన్వయించుకొని, నడుచుకోవాలి….

శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్ !

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *