Blog

వారిద్దరూ స్నేహితులు, ఒకేలా ఉంటారు , కలిసే తిరుగుతారు…

thought-of-the-day

వారిద్దరూ స్నేహితులు, ఒకేలా ఉంటారు , కలిసే తిరుగుతారు…

జై శ్రీరామ్ జై హనుమాన్

“వారిద్దరూ స్నేహితులు,
ఒకేలా ఉంటారు , కలిసే తిరుగుతారు ,
ఒకేలా ఇంట్లో ఉంటారు, కానీ, ఒక్కలా ప్రవర్తించరు,
ఒకరు వండుకొని తింటూ ఉంటె, ఇంకొక్కరు ఊరికే చూస్తూ ఉంటాడు

అయితే, ఏమిటా ఇల్లు, వండుకు తినేది ఏమిటి, ఎవరు వారిద్దరూ?

మనం చేసుకునే లేదా చేసిన కర్మలు, మూడు విధములుగా విభాగించబడుతాయి, ఒకటి, సంచిత, రెండు ప్రారబ్ద, మూడు, ఆగామి,గ చెప్పబడుతాయి,

సంచితం అంటే, కూడబెట్టుకున్నవి, ఇది ఒక రకమైన సంపద, మనకి కూడబెట్టడం అలవాటు అయిపోయి ఇవి కూడ కూడబెట్టేస్తున్నాం అవునా ! కాదా !

ఈ సంచితం లోనుంచి, కొంత తీసి, ఈ జన్మలో ఆ జీవునితో పాటు, జత చేసి పంపటం జరుగుతుంది ( అందుకే, బిడ్డ వచ్చినా రోజే లేదా కొన్ని రోజుల తరువాత, ఆ కర్మ యొక్క ఫలితాలు అనుభవం లోనికి రావడం మొదలు అవుతుంది… ఇక అక్కడుంచి ఆ ఫలితాలు వరుసగా అందుతూవుంటాయి… అవి మనమందరకి అనుభవం లో ఉన్నాయ్, ఈ కర్మ లనే, “ప్రారబ్దం” అని అంటూవుంటాం, అవునా ! కాదా !

వీటికి తోడు, మనతో, మోసుకొని వస్తున్నా (కొంత సంచిత కర్మలు) వీటితో పాటు, మరి కొన్ని, తాజా తాజా కర్మలు కూడ , ఉన్నవాటికి కలుపుకొని- జీవితాన్ని కొనసాగిస్తూ , ఏడుస్తూ, నవ్వలేక ఏడుస్తూ, అప్పుడప్పుడు నవ్వుతు, జీవననౌక ప్రయాణం కొనసాగిస్తున్నాము , అవునా ! కాదా !

ఆలా కొత్తగా వచ్చి చేరుతున్న , కర్మలని, ఆగామి కర్మలు అంటారు, కొన్ని ఆగామి కర్మలు, కొన్ని వెంటనే ఫలితాలు అందచేస్తాయి, మరి కొన్ని కొంత సమయం తీసుకోని, ఫలితాలు అందచేస్తాయి, మరి కొన్ని , ఈ జీవిత కాలం లో తిరిగి రాకుండా, వెళ్లి సంచిత కర్మలుగా రూపాంతరం చెంది, మరు జన్మకి తయారీ పరిశ్రమలో, సిద్ధం గ ఉంటాయి, అవునా ! కాదా !

ఉదాహరణ: మనకి ఆకలి వేసినప్పుడు, కొంత తినదగిన ఆహారాన్ని స్వీకరిస్తే, ఆ ఆకలి, తీరుతుంది, ఒక బిడ్డ అమ్మ గర్భం లోంచి, భూమి మీదకు రావటానికి, తొమ్మిది (౯) (9) నెలల కాలం పడుతుంది, అలాగే ఒక విద్యార్థికి డిగ్రీ రావాలంటే కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరములు సమయం తీసుకుంటుంది, అదృష్టం వెంట ఉంటె, లేకపోతే. ఫలితం కాలమే నిర్ణయించాలి.., ఈ విధం గ, కొన్ని కాల పరిధి లోనికి, మరి కొన్ని కాలానికి అతీతంగ , కర్మలు మనం తయారుచేసుకొని, మరు జన్మకి సిద్ధం, అవునా ! కాదా !

వీటిని మన దరిచేరకుండా, ఉండాలి అంటే, కర్మఫల (కర్మణ్యే వాదికారస్తే… ) త్యాగం చేయటం అలవాటుచేసుకోవాలిసిందే, ఆ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత లో, అర్జునుడుని అడ్డుగా పెట్టి మనకు అంటే మన జాతి కి అందచేసినారు….

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *