శ్రీకృష్ణుని చేతిలో ఉన్న ఆయుధాలు యొక్క తత్త్వం కూడ, తెలుసుకుందాం
శ్రీకృష్ణుని చేతిలో ఉన్న ఆయుధాలు యొక్క తత్త్వం కూడ, తెలుసుకుందాం
జై శ్రీరామ్ జై హనుమాన్
శ్రీకృష్ణుని చేతిలో ఉన్న ఆయుధాలు యొక్క తత్త్వం కూడ, తెలుసుకుందాం, ఏమంటారు.
సుదర్శన చక్రం – అగ్ని తత్త్వం- జ్ఞాన ప్రదాయని (అజ్ఞాని తీసివేసి జ్ఞానం అందచేసింది అని అర్ధం, ఎలాగా అంటే, శిశుపాలుని యొక్క మొండెం నుంచి శిరస్సు వేరు చేయటం,సుదర్శన చక్రం తో, అంటే, తానే గొప్పవాడిని అనే అహంకారాన్ని తీసివేసి, తనకన్నా గొప్ప శక్తీ ఉందని చెప్పే ప్రయత్నం! ఆ సందర్బములో, ఆ శ్రీకృష్ణపరమాత్ముని ఋషులు లేదా యోగులు “అచ్యుత” అని గుర్తించారు, అచ్యుత అంటే, జీవుడిని క్రిందకు జారీ చాతుర్వర్ణములలోకి పడకుండా, కాపాడేవాడు అని అర్ధం.
పాంచజన్యం(శంఖం) – వాయు మరియు ఆకాశం (శబ్దం)- కురుక్షేత్ర సంగ్రహంలో శ్రీకృష్ణ పరమాత్ముడు, మొదట, పాంచజన్యాన్ని పూరిస్తారు, అంటే పంచభూతములతో నిర్మితమైన జనులని, ఒక్కసారిగా మేల్కొల్పుట అనే అర్ధం లో చూడాలి,
కౌముదికి- భూ తత్త్వం- మీరు ప్రయత్నించండి!!!!!
విష్ణు చాపం (ధనుస్సు)- జల తత్త్వం- మార్గశిరమాసములో ఆండాళ్ తల్లి, ఆ స్వామి ని వర్ణిస్తూ, ధనుస్సు నుంచి వెలువడుతున్న బాణములు, ను, వర్షాన్ని కి ప్రతీకగా చెపుతారు,
అందుకే, శ్రీసీతారాముల కల్యాణాన్ని ” లోక కల్యాణ హేతునా” అని పెద్దలు చెపుతారు, ఎలాగా అంటే, సీతమ్మ, భూఝ (భూదేవి యొక్క పుత్రిక గ చెప్పబడింది) , స్వామి వారు, నీలమేఘశ్యాముడు (అంటే నల్లని మేఘ చ్ఛాయ కలవాడు) నల్లని మేఘం , తన నిండుగా నీటిని నింపుకొని, మనకి వర్ష రూపం లో, భూమిని చేరి, భూమిని, సస్యామలం చేసే, పంటలు బాగా పండేటు చేస్తూ, మనఅందరికి, మిగతా జీవరాశులకు, ఆహారాన్ని అందిస్తున్నాయి కదా, అందుకనే మనకు, శ్రీసీతారాముల కళ్యాణం రోజు, వర్షం కురియుట మనమందరకి, అనుభవైక నైవేద్యం, అవునా ! కాదా !
ఈ విధంగా, ఆ స్వామి చేతిలోని ఆయుధాల్ని, ఆ పంచభూతాలని ప్రతీకగా కనిపిస్తున్నాయి, అవునా ! కాదా!
జై శ్రీమన్నారాయణ