శ్రీరమసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, అందులో ఉన్న దాగుకొనిఉన్న తత్వాన్ని, తెలుసుకొనే ప్రయత్నం .
శ్రీరమసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, అందులో ఉన్న దాగుకొనిఉన్న తత్వాన్ని, తెలుసుకొనే ప్రయత్నం .
జై శ్రీరామ్ జై హనుమాన్
మన హైన్దవ సంప్రదాయంలో, గృహప్రవేశమైన, వివాహాది శుభకార్యములైన, ప్రతి హైన్దవుడు, కశ్చితముగా ఆ శ్రీరమసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, ఆచరించటం చూస్తూ ఉంటాము, అయితే అందులో ఉన్న దాగుకొనిఉన్న తత్వాన్ని, తెలుసుకొనే ప్రయత్నం చేయటం చాల అవశ్యం అనే నా భావన, అందుచే, ఇక్కడ ఆ స్వామి వ్రతవిధానములో వరుసగా విచ్చేసే ఆయా దేవత స్వరూపాల తత్వరహస్యాన్ని, కొంచెం స్పృశించే ప్రయత్నం చేయ దలచితిని… మరి నాతో కలిసి చదువుదాం కదిలి రండి…
శ్రీరమసహిత సత్యనారాయణ స్వామి వ్రత కథ విధానములో, మొదట మనం గణపతి పూజచేసి, తరువాత గౌరీ పూజ చేసి, ఆ తరువాత నవగ్రహ పూజ చేసి, ఆపైన శ్రీరమసహిత సత్యనారాయణ స్వామిని ఆహ్వానిస్తాము కదా, అలాకాక పూజ విధానములో, స్వామి వారి వ్రత విధానాన్ని మొదటగా చేయ్యివచ్చుగా, ఎందుకు, గణపతి, గౌరీ, మరియు నవగ్రహ పూజ చేసినతరువాతే స్వామిని పూజ చేస్తాము…
ఎందుకు అంటే, మనం ఏ రోజైన సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి, ఆ తూర్పు దిక్కుకు చూస్తే, మనకు మొదట ఏమి కనిపిస్తుంది….
ఒక అద్భుతమైన కాంతి కనిపిస్తుంది, కానీ అందులో ఉన్న శక్తీ కనిపించదు, అలాగే తరువాత, నెమ్మదిగా కిరణాలూ కనిపిస్తాయి, ఆ పైన, సూర్యనారాయణుడు దర్శనమిస్తారు అవునంటారా ! కాదంటారా !
అంటే, మనం మొదట చేసే ఆ గణపతి, గౌరీ, నవగ్రహ, మొదలైనవన్నీ, ఆ సూర్యోదయ సమయములో కనిపించే, ఆ కాంతే , ఆ గణపతి , ఆ కాంతి లో దాగుకొనిఉన్న శక్తే , ఆ గౌరీ తల్లి, ఆ సూర్యకిరణాలే, ఆ నవగ్రహాలు, ఆ పైన దర్శనమిచ్చే ఆ సూర్యనారాయణుడే, మనం కొలిచే ఆ శ్రీరమసహిత సత్యనారాయణ స్వామి…
ఎవరైతే ప్రతిరోజూ, సూర్యోదయానికి ముందే నిద్రలేచి, ఆ ఉదయిస్తున్న, ఆ సూర్యభగవానుని యొక్క ఆ కాంతిని మరియు అందులో దాగుకొనివున్న శక్తీ , ఆ లే లేత సూర్యకిరణాలు, ఆ పైన ఉదయిస్తున్న సూర్యభగవానుని చూస్తారో, వారు ప్రతిరోజూ ఆ శ్రీరమసహిత సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆచరించిన ఫలితం సిద్ధిస్తుంది…
మొదటి కధలో: శ్రీమహావిష్ణువు, నారద మహర్షికి వివరించిన వ్రత మహాత్మ్యం
రెండవ మరియు మూడవ కధలో: శ్రీమహావిష్ణువు, ఒక వృద్ధ బ్రహ్మణరూపాన్ని దాల్చి, ఒక పేద బ్రాహ్మణుడికి వ్రత మహాత్మ్యం చెప్పుట, ఇందులో అతర్భాగముగా ఒక కట్టెలు కొట్టుకునే వ్యక్తికీ ఈ వ్రతమాహత్యం తెలుసుకొనుట
నాలుగవ కధలో: ఒక వైస్యుడు, రాజా భటుని ద్వారా వ్రత మహాత్మ్యమును తెలుసుకొనుట
ఐదవ కధలో: ఒక రాజ్యములో, అరణ్యములో, గోపబాలురు, రాజు గారికి, స్వామి యొక్క ప్రసాదాన్ని ఇవ్వజూసిన, ఆ రాజు, తాను రాజునని, అహంకరించి, ప్రసాదాన్ని, తిరస్కరించుట…
ఈ గ్రూప్ మెంబెర్స్ గ ఉన్న వారు, చాలామంది, ఈ శ్రీరమసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, ఆచరించి, పైన చెప్పుకున్న, ఐదు కధలు కూడా ఆ వచ్చిన బ్రాహ్మణుడు వివరించగా, వ్రత అంతర్బాగముగా విని తరించి ఉండేవుంటారు, అవునా ! కదా! అయితే ఎప్పుడైనా, ఈ కధలలో మనకి అందచేస్తున్న, తత్వాన్ని, అవగతం చేసుకునే ప్రయత్నం చేసే అవకాశం కలిగిందా? మీరంతా ఒక్కసారి, ఆలోచనాపరికించి చూడండి…నేను, నిద్రకు ఉపక్రమించే సమయం ఆసన్నమయింది.. ఈ పైన చెప్పుకున్న, ఐదు కధలలో ఉన్న తత్వరహస్యాన్ని, మరునాడు చూద్దాం… మరి అంతవరకూ సెలవా ..
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు”