శ్రీరమసహిత సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉన్న ఐదు కధలలో (క్లుప్తముగా ఈ క్రింద ఉంచే ప్రయత్నం చేస్తాను) ఉన్న తత్వ రహస్యాన్ని…
శ్రీరమసహిత సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉన్న ఐదు కధలలో (క్లుప్తముగా ఈ క్రింద ఉంచే ప్రయత్నం చేస్తాను) ఉన్న తత్వ రహస్యాన్ని…
మనం శ్రీరమసహిత సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉన్న ఐదు కధలలో (క్లుప్తముగా ఈ క్రింద ఉంచే ప్రయత్నం చేస్తాను) ఉన్న తత్వ రహస్యాన్ని, ఈ రోజు, పరిశీలనాత్మక దృష్టితో చూసే ప్రయత్నం చేద్దాం…
మొదటి కధలో: శ్రీమహావిష్ణువు, నారద మహర్షికి వివరించిన వ్రత మహాత్మ్యం
రెండవ మరియు మూడవ కధలో: శ్రీమహావిష్ణువు, ఒక వృద్ధ బ్రహ్మణరూపాన్ని దాల్చి, ఒక పేద బ్రాహ్మణుడికి వ్రత మహాత్మ్యం చెప్పుట, ఇందులో అతర్భాగముగా ఒక కట్టెలు కొట్టుకునే వ్యక్తికీ ఈ వ్రతమాహత్యం తెలుసుకొనుట
నాలుగవ కధలో: ఒక వైస్యుడు, రాజా భటుని ద్వారా వ్రత మహాత్మ్యమును తెలుసుకొనుట
ఐదవ కధలో: ఒక రాజ్యములో, అరణ్యములో, గోపబాలురు, రాజు గారికి, స్వామి యొక్క ప్రసాదాన్ని ఇవ్వజూసిన, ఆ రాజు, తాను రాజునని, అహంకరించి, ప్రసాదాన్ని, తిరస్కరించుట…
శ్రీరమసహిత సత్యనారాయణ స్వామి వ్రత విధానములో ఐదు కధలు వెనక నుంచి ముందుకు చదవాలి, అంటే నా ఉద్దేశ్యం, ఐదు, నాలుగు, మూడు, రెండు మరియు ఒకటి … ఈ విధముగా చదవకలిగితే మనకి, అందులో ఉన్న తత్వరహస్యం అందుతుంది.. మరి ఇప్పుడు చూద్దాం….
ఈ ఐదు కధలు, లలితాసహస్ర నామాలలో, పంచకోశ అంతరస్థితః (అంటే ఐదు కోశములు దాటినా తరువాత, కనిపించే ఆ తల్లే, లలిత గ చెప్పబడుతుంది) పద ప్రయోగానికి చాల చాల దగ్గరగా ఉంటుంది…
ఐదవ కధలో: ఒక రాజ్యములో, అరణ్యములో, గోపబాలురు, రాజు గారికి, స్వామి యొక్క ప్రసాదాన్ని ( ఆ, ఈ , ప్రసాదాన్ని స్వామి యొక్క అనుగ్రహ భావనలో చూడాలి, పిల్లలు కూడా ఆ పరంధాముని అనుగ్రహబలం తోనే, పిల్లలు కలగాలి…) ఇవ్వజూసిన…….. (ఒక బిడ్డ, అమ్మ గర్భములోనుంచి బయటకు, ఈ మాయ ప్రపంచములోకి, వచ్చిన తరువాత, తిరిగి భూగర్భం లోకి ఈ పాంచభౌతిక శరీరం పడిపోయేదాకా, ఆ బిడ్డ చేసే యుద్ధం అంతా ఆహారం కోసమే కదా, దానినే అన్నమయ్యకోశముగా చెప్పబడుతుంది…) ఆ కోశాన్ని మనమందరం దాటే ప్రయత్నం చేస్తున్నే ఉన్నాం ఔనంటారా ! కాదంటారా !
నాలుగవ కధలో: ఒక వైస్యుడు, రాజా భటుని ద్వారా వ్రత మహాత్మ్యమును తెలుసుకొనుట, అంతర్బాగముగా (మూడవ కథగ కూడా చెపుతారు) కారాగారమునుంచి ఆ వైస్యుడు మరియు అల్లుడు, విడుదలచేయబడి, రాజు చేత సత్కరించబడుట..)
ఆ వైస్యుడు వ్యాపార నిమిత్తం ఇతర రాజ్యములకు వెళ్లి వ్యాపారం చేయుట, ఆ క్రమములో, వ్రతమహాత్మ్యం వినుట, తిరిగి వచ్చి, తన ధర్మపత్నికి, ఆ మహత్యం చెప్పి, వారికి బిడ్డలు లేని కొరత లేదా బెంగ తొలగటం కోసం ఈ శ్రీరామసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, ఆచరించాలని నిర్ణయించుకొనుట,ఆ దంపతి (దంపతులు అని అనరాదు) కోరికను ఆ పరంధాముడు, సంతసించి, వారికి, ఒక చక్కని ఆడ బిడ్డని ప్రసాదించుట…
ఆ కధలోని తత్త్వం, ఆ వైస్యుడు, వ్యాపారం చేయుట, అనేది, విజ్ఞానమయకోశముగా చెప్పబడుతుంది…ఐదో కధలో చెప్పిన “ఆ బిడ్డ” విద్యార్థి దశ నుంచి ఉద్యోగిగ మారెస్థితి ని, విజ్ఞానమయకోశము. ఒక్కసారి, ఆ బిడ్డ జీవితములో స్థిరబడినతరువాత, ఆ బిడ్డ యొక్క తల్లితండ్రులు, ఒక చక్కని అమ్మాయిని చూసి, వివాహాది శుభకార్యమును జరిపిస్తారు, వివాహం యొక్క ముఖ్య ఉద్దేశ్యం “పిల్లలు” ఔనంటారా ! కాదంటారా !
ఆ దంపతి యొక్క కోరిక మేరకు, ఆ పరంధాముడు, వారికి, బిడ్డను ప్రసాదించుట, ఈ కోశన్నీ “ప్రాణమయ కోశమంటారు”
ఈ విధముగా, మనమందరం పైన చెప్పుకున్న, అన్నమయ్య కోశము, విజ్ఞానమయ కోశము, మరియు ప్రాణమయ కోశము, విజయవంతముగా పూర్తిచేసి, మిగిలిఉన్న రెండు కోశములు దాటడానికి చేస్తున్న ప్రయత్నమే… ఈ చిన్న ప్రయత్నం…
రెండవ కధలో: శ్రీమహావిష్ణువు, ఒక వృద్ధ బ్రహ్మణరూపాన్ని దాల్చి, ఒక పేద బ్రాహ్మణుడికి వ్రత మహాత్మ్యం చెప్పుట, ఇందులో అతర్భాగముగా ఒక కట్టెలు కొట్టుకునే వ్యక్తికీ ఈ వ్రతమాహత్యం తెలుసుకొనుట…
ఈ కధలో ఉన్న తత్త్వం, జ్ఞానమయ కోశము, ఎలాగా అంటే, మనం రోజు వారి జీవితములో, మనం వినే రామాయణ , భారత , భాగవత మరియు భగ్వద్గీత మొదలైన గ్రంథ పఠనం, వచనం, శ్రవణం, మరియు దేవాలయ సందర్శనాలు, మాస వ్రతాలూ, మరియు పూజాది కార్యాక్రమాలు, అన్ని కూడా, ఈ జ్ఞానమయ కోశము లోకే వస్తాయి, ఎలాగా అంటే, ఈ చేస్తున్న క్రమములో, మనం ఎవరు, ఈ జీవుడు, ఎవరు, ఆ జీవి (ఆత్మ) యొక్క లక్షణాలు, ప్రాధమిక లక్ష్యం, అవి అన్ని తెలుసుకొనే సుమార్గాలు… ఇలా చేయగా చేయగా, మనకి, ఆ ఆత్మకి జ్ఞానం అందుతుంది… ఈ కోశము లో ఉన్న తత్వాన్ని గ్రహించి, అందు, రమించుటకు, మనం అందరం ఉద్యక్తులవుదాం…
మొదటి కధలో: శ్రీమహావిష్ణువు, నారద మహర్షికి వివరించిన వ్రత మహాత్మ్యం… పైన చెప్పుకున్న, జ్ఞాన సముపార్జన తరువాత, మన ఈ మర్త్య లోకానికి రావాల్సిన అవసరం లేకుండా, ఆ పరంధాముని చెంతనే ఉండేఅవకాశం ఉంటుంది.. ఈ విషయాన్నీ, మనకి శ్రీవిష్ణుసహస్రనామాలలో చెప్పబడింది..”పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః”… ఆ పరంధాముని సన్నిధానంలో, నిత్యసూరులు మరియు ముక్తగణములుగ ఈ ఆత్మ తత్వాన్ని గ్రహించినవారు, ఆ స్వామి సన్నిధిలో సదా ఉంటారు, ఆ స్థితికి చేరే ప్రయత్నముకే, ఈ మొదట శ్రీమహావిష్ణువు ఆ నారద మహర్షికి వచించిన ఈ వ్రత మహత్యం…
ఇప్పుడు, ఈ తత్వరహస్యాన్ని తెలుసుకున్నాం కనుక, మనం ఆ దిశగా మన నడకను మార్చుకుని, ఆ జ్ఞాన మరియు ఆనంద కోశము లోకి ప్రవేశ ప్రయత్నం చేద్దాం…
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు”
జై శ్రీమన్నారాయణ