సుందరకాండ లో, రాత్రి వేళ హనుమంతుల వారు, సీతమ్మను చూసారు కదా, చీకటిలో చూడటం వెనుక ఏమైనా తత్త్వం దాగివుందా?
సుందరకాండ లో, రాత్రి వేళ హనుమంతుల వారు, సీతమ్మను చూసారు కదా, చీకటిలో చూడటం వెనుక ఏమైనా తత్త్వం దాగివుందా?
మనం శ్రీమద్రామాయణాన్ని ఎప్పుడు కూడ, లిటరరీ మీనింగ్ కోసం, వెతకరాదు, అందుకే, ఆదికవి, వాల్మీకి మహర్షి, మానవ జాతి, ఉన్నంతకాలం , శ్రీమద్రామాయణం విరాజిల్లుతుంది అని ముందుగానే ఉహించి చెప్పారు, ఎందుకు అంటే, అందులో ఉన్న తత్వాన్ని, తీసుకోని, మానవ జీవితాన్ని మలుచుకొంటే, రామరాజ్యం, త్రేతాయుగం లో ఉన్న రామరాజ్యం ఎలాగో మనం ఎవ్వరు చూడలేదు, కానీ, మనం ఆ చెప్పబడిన తత్వాన్ని, అలవర్చుకొనే జీవిస్తే, కశ్చితముగా, మనమందరం రామరాజ్యాన్ని చూస్తాం, ఆ ఊహ తోనే దాగొనిఉన్న తత్వాన్ని, చి. శాస్త్రి సందేహం ద్వారా ,మీ ముందుకు, తీసుకోని రాబడే అవకాశం ఆ పరంధాముడు, చి. శాస్త్రి సందేహ నివృత్తి ద్వారా తెలియబడుతుంది…
హనుమంతులవారు (వానరాగ్రేసుడు లేదా వానరశ్రేష్ఠుడా ) వారిని ఎక్కడ వానర అని వాల్మీకి ఎక్కడ సంబోదించలేదు, ఆయన సాక్షాత్తు, ఆ పరమేశ్వర స్వరూపం గానే, చూడాలి, అందులో ఎటువంటి సందేహం లేదు, మరి సాక్షాత్ పరమేశ్వరుడు, అయినప్పుడు, సముద్ర లంఘిస్తినే, చీకటిలో, అన్ని భవనాలలో వెతికితే కానీ, అమ్మ, సీతమ్మ జాడ తెలియదా, రామచంద్రుడుని, మానవ మాత్రుడుగానే పరిగణించపడ్డారు (సాక్షాతు, రామచంద్రుడే, జటాయువు, దహన సంస్కారం జరిపించిన తరువాత, నీకు స్వర్గ ప్రాప్తి కలిగిసున్న అని, భాసించినప్పుడు, వేదమే (దేవతలే) ప్రశ్నించింది , రామ నువ్వు మానవుడిని చెప్పుకున్నావు గ (ఆత్మానం మానుష్యేణ …) , మరి నీకు, స్వర్గ ప్రాప్తి, అని ఏ విధంగా, ఆ విధంగా, భాసించినావు అని ప్రశ్నించినప్పుడు, తిరిగి, వేదమే (దేవతలే) , దానికి, సమాధానం చెప్పటం జరిగింది, ఏమిటి అంటే, ఎవరైతే సత్యాన్ని ఆలంబన చేసుకొని, ధర్మబద్ధమైన జీవితాన్ని, అనుగమిస్తున్నారో, అటువంటి వారికి, ఆ పరమేశ్వరునికి ఉన్న శక్తి ఉంటుంది, అని వేదమే ప్రతిపాదించింది… నిజానికి, ఆలోచిస్తే, ఆ విధంగా జీవితాన్ని అనుగమించుట, అంత సులభమా, కశ్చితముగా ఐతే కాదు, అందులో, ఇసుమంత సందేహం లేదు….
రామాయణం లో, రామచంద్రుడు మరియు హనుమంతుల వారు, శ్రీకృష్ణపరమాత్ముడు, భగ్వద్గీత లో, చెప్పిన విధంగానే అన్వయించుకునే ఆచరణ సాధ్యమని చేసి చూపించారు… ఈ సందర్భంగా, పైన ఉంచిన, సందేహానికి, సంబంధిత భగ్వద్గీత లో, ఒక శ్లోకం చుద్దాం…
“దుమేనా వ్రియేతే వహ్నిహి
యదా దర్స్లో మలేనాచ
యాదోల్బెనావృతో గర్భహ,తదా తేనేదామావృతామ్” ..
చాల సులువుగా చెప్పాలంటే, అజ్ఞానంలో ఉన్నప్పుడు మానవునికి , జ్ఞానమనే దీపం కనిపించుట దుర్లభం… కాదా ! అవునా !
“అజ్ఞానాన్ని” మన శృతి, స్మృతి, పురాణం, మరియు ఇతిహాసాలు, “చీకటికి”, పర్యాపదముగా వాడబడటం జరిగింది..
హనుమంతుల వారిని, అడ్డుపెట్టుకొని, వాల్మీకి మహర్షి, మనకి, చెపుతున్నారు, జ్ఞాన సముపార్జన కావాలంటే, ముందు మనో లో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తీసివేయాలని…
అందుకే, అక్కడ, మనకి, వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందచేశారు, అది ఏమిటి అంటే, “నమోస్తు రామాయ సలక్ష్మణాయ…. మరుద్గణేభ్యహ”. దీనికి సంబంధిత అర్ధని మరియు తత్వాన్ని తరువాత చుద్దాం..
చీకటి తొలిగిన తరువాతే అమ్మవారి దర్శనమ్ హనుమంతులవారికి జరిగింది, అంటే, మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేస్తే మనలో ఉన్న ఆ పరంధాముని (జ్ఞానం(ధర్మం)) యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది, అనే అర్ధం లో చూడాలి…
ఒక ఉదాహరణ: ఒక వ్యక్తిని, ఒక చీకటి గదిలో బందించి, ఆ గది లో ఉన్న వస్తువులగురించి చెప్పమంటే, అదే సాధ్యమేనా? సాధ్యమే ఐతే ఎప్పుడు, మీరు, ఆ చీకటి గది లో, వెలుగుతున్న దీపాన్ని ఉంచినప్పుడు, అక్కడ ఉన్న వ్యక్తి, అందులో ఉన్న ప్రతివస్తువుగురించి, చాల బాగా చెప్పగలుగుతాడు, అన్ని విశేషణాలతో కాదా ! అవునా ! కానీ ఒక్కటి మాత్రం చెప్పడు, అదే ఏ దీపం వెలుగు సహాయముతో, చూడకలిగి, చెప్పటం జరిగిందో, ఆ దీపం గురించి మాత్రం చెప్పడు కాదా ! అవునా!
అలాగే మనం కూడ, ఆ అజ్ఞానం మన నుండి, తీసివేసేవరకు, ఇది, నేను, నేను, అనే భావనతోనే ఉంటాము , ఒక్కసారి, ఆ అజ్ఞానాన్ని దూరంచేస్తే మననుండి, తాను ఎవరు, పరుడు ఎవరు, ఎవరి వల్ల ఎవరికి గుర్తింపు అనే విషయం చాల సుస్పష్టం….. అది గ్రహణం చేయుటయే జ్ఞానం అది అజ్ఞానం (చీకటి) ఉన్నంతవరకు అర్ధంకాదు…
ఇక్కడ, మనం ఒక విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకోవాలి, వాల్మీకి మహర్షి, హనుమంతులవారిని అడ్డుగపెట్టుకుని మనకి, ఈ విషయాన్ని, సూక్ష్మంగా అందచేసినారు… అంతేగాని, పరమేశ్వర స్వరూపమైన ఆ స్వామి అమ్మ, సీతమ్మ, జాడ తెలియదని కాదు.
అయితే, ఈ విషయం లో, హనుమంతులవారు, సీతమ్మ కు, రామచంద్రుని గురించి, చెప్పుటలో లేదా ఆ స్వామి జాడ తెలుపుటలో, వేరొక తత్త్వం దాగిఉంది… సమయం, సందర్భం, వచిన్నపుడు ఆ తత్త్వం గురుంచి కూడ తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం, మరి అంతవరకూ సెలవా మరి…
శుభం భూయాత్! సర్వే జన సుఖినో భవంతు!