Blog

సూర్పనఖను ఒక మాములు “స్త్రీ” గ చూడండి……. మీ లక్ష్మణ స్వామి ముక్కు చెవులు కోసేయడం…”

thought-of-the-day

సూర్పనఖను ఒక మాములు “స్త్రీ” గ చూడండి……. మీ లక్ష్మణ స్వామి ముక్కు చెవులు కోసేయడం…”

ఒక మాములు “స్త్రీ”గ చూడమని అడిగావు, అప్పుడు, తన మనసులో ఉన్న మాట పర పురుషుడు కి చెప్పే ముందు, ఆ స్త్రీ తానూ అడుగుతున్న లేదా చెపుతున్న మాట, ఎవరితో ( అంటే నా భావం, తనకు పరిచయం ఉన్న పురుషుడా (పూర్వాపరాలు తెలుసునా లేదా, అనే విచక్షణ కలిగి ఉండాలి, ఒకవేళ , ఆ పురుషుడు వివాహితుడని తెలిసి తన యొక్క ప్రేమను వ్యక్తపరచినప్పుడు, ఆ వివాహితుడు ధర్మా ,అధర్మాలు తెలిసినవాడైతే, నాలుగు మంచి మాటలు చెప్పి పంపించే ప్రయత్నం చేస్తారు, అయినాసరే ఆ మాటలు పెడచెవినపెడితే, ఆ స్త్రీ కి దూరంగా వెళ్ళిపోవాలి లేదా ధర్మా అధర్మాలు మరచి, ఆమె యొక్క ప్రేమను స్వీకరించి, ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తాడు… సాగినంతకాలం, లేకపోతే, ఆ ప్రేమ ఆమెది లేదా అతని వ్యామోహం తీరినతరువాత, ఆ స్త్రీ కి కలిగే పరిస్థితి… ఇక్కడఉన్న అందరకి అవగతమే…

ఇందులో, తెలివైన ఆ స్త్రీ ఏ విషయాని తీసుకోని, తన జీవితాన్ని చక్కదిదుకొంటుంది అన్నది, ఆమెయొక్క ప్రారబ్దం బట్టి ఉంటుంది ..

ఇక్కడ, రెండు విషయాలు మనం గ్రహించాలి…. అందులో…

ఒకటి: తాను మనసుపడ్డవాడు, వివాహితుడని తెలిసినప్పుడు, ఆ స్త్రీ తన దారిన తాను వెళ్ళిపోవాలి, ఆశ
పడింది లేదా మోహించింది తప్పులేదు, ఎందుకు అంటే, కానీ విష తెలిసిన తరువాత, ఆ స్త్రీ ప్రేమమూర్తి కాబట్టి, మనువాడిన తరువాత, తన భర్తనే ప్రేమిస్తూ, సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తూవుండే అవకాశం ఐతే కచ్చితంగా ఉంటుంది..అప్పుడు, ఆ స్త్రీ యొక్క బుద్ధి సక్రముముగానే పనిచేసిన్నట్టే కదా! బుద్ధి ఎప్పుడు సక్రమముగా పనిచేస్తుందో తెలియాలంటే, ఆ స్త్రీ ఇప్పుడు కానీ లేదా ముందు జన్మలో కానీ, తనకి పరమాత్మునిచేత ఇవ్వబడిన “శ్రవణేంద్రియాలను” ధర్మ సంబంధిత విషయం సంగ్రహణం లేదా గ్రహణం కి ఉపోయోగించినప్పుడు…అవునంటారా! కాదంటారా !

రెండు: ఆ పురుషపుంగవుడు, వివాహితుడని తెలిసినా, ఆ పురుషుడే, కావాలనే పట్టుబడితే, రాబోయే కాలములో, వచ్చే సుఖ దుఃఖాలను అనుభవించుటకు సిద్దంకావాలి… దీనినే ప్రారబ్ద కర్మ యొక్క ఫలితం గ తీసుకోబడుతుంది లేదా చెప్పబడుతుంది .. ఈ ప్రారబ్ద కర్మలన్నీ, ఆ స్త్రీ మూర్తి యొక్క పూర్వ జన్మ వాసన బలముల బట్టి ఉంటుంది… ఆ పరాత్పరుడు, మనుషులకి కలుగచేసిన లేదా ఇవ్వబడిన జ్ఞేనేంద్రియాలలో, కన్ను, ముక్కు, చెవి, నాలుక, మరియు చర్మం గ చెప్పబడతాయి కదా, వీటిని ఉపయోగించి లేదా వినియోగించి, చేసిన పనులనే, కర్మలు అంటాము, ఈ జ్ఞానేంద్రియాలు కర్మలు చేయటానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి, వాటినే కర్మేంద్రియాలుగా పిలువబడతాయి…

ఇప్పుడు, చూద్దాము, “శ్రవణాలు” లేదా మన వాడుక భాష లో “చెవులు”, అవి ధర్మ, అధర్మాలు వినటానికి ఉపయోగించాలి, ఉపయోగించి, గ్రహణం చేసిన విషయాలలో ధర్మాన్ని ఆచరించటానికి సమాయత్తులు కావాలి, ఆలా లేనప్పుడు, ఆ శ్రవణాలు ఉన్న లేకపోయినా పెద్ద ఇబ్బంది లేదు…”నాసికం” లేదా మన వాడుక భాష లో “ముక్కు”, సాధారణముగా మనమందరం, ఈ ఇంద్రియాన్ని, మంచి వాసనాలని గ్రహించటానికి ఉపయోగిస్తాం. ఆవిధంగా మంచి వాసన బలాలు అందచేయనప్పుడు, ఆ నాసికం లేదా ముక్క ఉన్న లేకపోయినా పెద్దగా ప్రయోజనమైతే ఉండదు, ఔనంటారా ! కాదంటారా !

“లక్ష్మణ” స్వామి అంటే, సామాన్య అర్ధం ఒక మనిషి యొక్క నామధేయం, కానీ, సంస్కృతములో మాత్రం, లక్ష్మి అనే పదం నుంచి ఉద్బవించింది “లక్ష్మణ” స్వామి గ…, లక్ష్మి అనే పదమునకు అర్ధం, ఇంద్రియాలు అనే అర్ధం, అంటే జ్ఞానేంద్రియమని అంతేగాని కర్మేంద్రియమని కాదు, ఎందుకు కర్మేంద్రియం కాదు అని అన్నాను అంటే, అది ఆ వ్యక్తి ఉపయోగించుకొనే విధానం బట్టి ఉంటుంది కనుక…

అందుకే, పెద్దలు, పూర్వాశ్రమములో, లక్ష్మీని, “జిహ్వాగ్రే వసతి లక్ష్మీ”, నాలుక చివరన ఉంటున్నది అన్న అర్ధములో చెప్పబడింది, అంటే అర్ధం, మనం మాటాడే మాటే లక్ష్మీ… అందుకే లక్ష్మీ సహస్ర నామాలలో “సత్య వాచ” అనే పద ప్రయోగం చేయబడింది, అంటే సత్యమైన మాటే లక్ష్మీ అని అర్ధం…అవునా ! కాదా !

ఒక ఉదాహరణ: ఒక దంపతులకి ఒక చిన్నారి ఉన్నాడు (ఐదు సంవత్సరముల ప్రాయుడు), తండ్రికి, ఒకరోజు ఆ చిన్నవాడి కోసం ఒక ఖరీదయిన ఒక బొమ్మ కారు కొని ఇంటికి తెచ్చి , ఆ చిన్నవాడికి ఇచ్చి, స్నానం చేయటానికి వెళ్లి, తిరిగి బయటకు వచ్చే లోపు, ఆ ఖరీదయిన కారు బొమ్మను, ఆ చిన్న వాడు, పాడుచేసిపెట్టాడనుకోండి, అప్పుడు ఆ తండ్రి, వీడికి, ఇచ్చిన వస్తువును, వాడటం చేతకాదు అని, తరువాత ఆ చిన్నారి ఎంత అల్లరి చేసిన అంత ఖరీదయిన వస్తువు మాత్రం ఇవ్వరు అవునా ! కాదా ! తనకు పుట్టిన బిడ్డ, పోతే పోయింది, ఆ చిన్నవాడి ఆనందంకంటేనా అని అనుకున్నాడా ఆ తండ్రి, లేదు, కానీ భవిషత్తులో ఇవ్వచ్చు, ఆ చిన్నారి పెద్దవాడు అయినాక ఖరీదయిన వస్తువ విలువ తెలిసిన తరువాత…. అంతేనంటారా లేదా మరేదయినా పరిష్కారం ఉంటుందా..

రెండవ ఉదాహరణ: ఒక వ్యక్తికీ , ఒకరు పని చేయమని పనికల్పిచారని అనుకుందాం కాసేపు, కొన్ని కారణాలు చేత లేదా కొన్ని తప్పుల చేత, ఆ పనికల్పించిన వ్యక్తే, ఆ వ్యక్తి ని పని నుంచి తీసివేశారు అనుకుందాం, అప్పుడు, ఆ వ్యక్తి, పనికి వినియోగించిన వ్యక్తిని, ప్రశ్నించే అధికారం ఉంటుందా ( ఇది యూనియన్ ఫ్రీ వర్క్ ఎన్విరాన్మెంట్ అనుకుందాం కాసేపు..), అంటే ఇచిన్నవాడికే తీసివేసే అధికారం ఉంటుంది… మీరు అవునన్నా, కాదన్నా !

ఇప్పుడు, మీరే, పైన ఉంచిన విషయ విశ్లేషణ చదివి, సందేహానికి, అన్వయించుకొంటే, అందులో ఉన్న తత్వ రహస్యం మనకు అందుతుందని, నా అభిప్రాయం…

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు”

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *