Blog

స్వయంవరం అనే స్వేచ్ఛ ఇచ్చిన ఆడపిల్లకు, లేదా ఆడపిల్లకు ఇచ్చినప్పుడు , ప్రేమను వ్యక్తపరచడం అసలు తప్పే కాదు…..

thought-of-the-day

స్వయంవరం అనే స్వేచ్ఛ ఇచ్చిన ఆడపిల్లకు, లేదా ఆడపిల్లకు ఇచ్చినప్పుడు , ప్రేమను వ్యక్తపరచడం అసలు తప్పే కాదు…..

“స్వయంవరం అనే స్వేచ్ఛ ఇచ్చిన ఆడపిల్లకు, లేదా ఆడపిల్లకు ఇచ్చినప్పుడు , ప్రేమను వ్యక్తపరచడం అసలు తప్పే కాదు….. దానికి ప్రతిఫలం రావణుడు కక్ష తీర్చుకోవడం”

ఇక్కడ, నేను కొంచెం పద ప్రయోగం చేశాను, చూసి, మీరు ఆ తేడాను, చెప్పే ప్రయత్నం చేయండి…అదియేమిటి అంటే,

స్వేచ్ఛ, ఇచ్చిన ఆడపిల్ల (కు)
స్వేచ్ఛ, ఆడపిల్ల (కు) ఇచ్చినప్పుడు…

సరే, పైన రెండు వాక్యాలకు అర్దాని వెతికే పనిలో ఉండండి, ఈ లోపు, ఆ సందేహ నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను ఏమంటారు…

స్వయం (వర) “వరం ” అంటే, తనకు తానుగా, వస్తువు లేదా వరుడిని, ఎన్నుకొనే ఒక ప్రక్రియను ఇవ్వటం లేదా అనుమతించటం , అయితే ఎన్నుకొనుట అంటే, ఒక సముదాయం లో నుంచి, నచ్చిన వస్తువు లేదా మనిషిని, గుర్తించి, తీసుకొనుట, అవునా ! కాదా !

పూర్వకాలములో అయితే తల్లి తండ్రుల సమక్షంలో, మరియు, అక్కడకి విచ్చేసిన రాజ, యువరాజ సమూహంలో, ఆ వరించే, ఆ ఆడపిల్ల, స్వయంగ ఎన్నుకొనుట (కొన్ని బల, తెలివి, విద్యా పరీక్షలు నిర్వహించి, అందులో ఉతీర్ణుడు అయిన వ్యక్తిని పూలమాలతో సత్కరించటం …. మొదలైన కార్యక్రమాలు జరుపుట…)

అంటే అక్కడ, ఏమిచెపుతున్నారు అంటే, ఒకేసారి, ఆ ఆడపిల్ల తాను ఎన్నుకోబోయే వ్యక్తి (వర) యొక్క అందచందములను, తండ్రి, ఆ వ్యక్తి (వర) యొక్క వీరత్వాన్ని, ఆ ఇద్దరు, ఒకేసారి చూడటం జరిగేది… అందరి సమక్షంలో… ఏ ఆడపిల్లైనా తనకు కాబోయే భర్త యొక్క అందచందములకు చాల ప్రాముఖ్యత ఇస్తుంది (అందం అశాశ్వతం కదా, మరి ఎందుకు చూడటం, అంటే, ఆ అందం ఎవరికైనా అశాశ్వతమే, కానీ, కొంత కాలం, ఆ జంట చూడముచ్చటగా ఉంటుంది కదా అందుకు), మరి చందం అంటే ( అది మీరే చెప్పాలి…), మరి ఏ ఆడ పిల్ల తండ్రైన, తనకు కాబోయే అల్లుడు, తన బిడ్డను, రక్షణ కల్పించేవాడుగా ఉండాలని ఆశిస్తాడు, అందుకే, అంతమందిని ఆహ్వానించి, ఈ స్వయంవరాన్ని ఏర్పాటు చేసెవారు…
ఈ స్వయంవర (వరం) లో అన్ని ఉండవలిసిన లేదా కావలసిన అర్హతలు కలిగి, ఆ యొక్క స్వయం (గ) వర (వరుడు) వచ్చి, తన ప్రావీణ్యతను చాటి, ఆ ఆడపిల్ల యొక్క మనసును గెలుస్తాడు… అప్పుడు కధ సుఖాన్తమ్!

ఇప్పుడు చెప్పండి, స్వయంవరం, ఆడపిల్లకు, ఇచ్చిన స్వేచ్ఛా లేదా స్వేచ్ఛ ఇచ్చినదా?

కానీ, ప్రేమ వ్యక్తపరచడం, అనేది, పూర్వాపరాలు తెలియకుండా, వ్యక్తపరిచే ఒక ప్రక్రియ, అందులో, మంచి లేదా చెడు, ను భేరీజు వేసుకునే అవకాశమే లేదు… ఒప్పుకొనుట లేదా లేకపోవుట లేదా స్వీకరించుట లేదా తృణీకరించుట, జరగవచ్చు… అందు, ఎవరి అభిరుచులు బట్టి ఆ సమస్యకు పరిష్కారం లభ్యమవుతుంది…ఇక్కడ కధ సుఖంతమా లేదా …..

ఇచ్చిన స్వేచ్ఛ విలువైనదా లేదా గొప్పదా లేక తీసుకున్న స్వేచ్ఛ విలువైనదా లేదా గొప్పదా…ఇచ్చిన స్వేచ్ఛలో, అందం ఉంటుంది, ఆనందం ఉంటుంది… తీసుకున్న స్వేచ్ఛలో, ఏముంటుందో చివరకు మనకే అనుభవంలోకి వస్తుంది…

శ్రీమద్రామాయణములో, జనక మహారాజు, తన బిడ్డ అయిన జానకి స్వయంవరం ఏర్పాటుచేస్తే, గురువు ఆజ్ఞ మేరకు, రామచంద్రుడు, అక్కడ న్యాసంగా ఉంచబడిన, శివధనస్సు భంజనం చేసి, తన వీరత్వాన్ని, ప్రదర్శించారు, అంతలో, ఆ జానకి ఆ వీరుడు ఐనా రామచంద్రుణ్ని, తన చేత ఉన్న, పూలమాలతో, అలంకరించుటకు ఉద్యుక్తురాలైనప్పుడు, రామచంద్రుడు, చాల మృదువుగా (మిత భాషి), తన కల్యాణ నిర్ణయం తన తండ్రియైన దశరధ మహారాజుదని, పలుకుతారు…ఆ తరువాత జరిగిన కధ మీ అందరకి, అవగతమే…

అంటే, అటు బిడ్డ ఐన లేదా పుత్రుడు ఐన, వారి వారి, కల్యాణ విషయములో, భాద్యత ఆ తండ్రిదేనన్న విషయాన్ని, శ్రీసీతారాముల కల్యాణ ఘట్టంలో, చాల అందముగా, నర్మగర్భంగా, ఆదికవి, వాల్మీకి మహర్షి, సీతారాములని, అడ్డుగా పెట్టి, మనకి, ఈ తండ్రి యొక్క భాద్యతను, ఆ బిడ్డలకు, ఇవ్వవలసిన (ఇచ్చిన)
స్వేచ్ఛను, అంత అద్భుతంగా, చూపించారు….

చివరగా, రావణాసురుడు కక్ష… శ్రీమద్రామాయణం లో సర్ఫణఖను (కామరూపిణి) గ, పిలువబడుతుంది, కామరూపిణి అంటే, తన కోరికకు తగ్గటుగ్గ తన రూపాన్ని లేదా స్వభావాన్ని లేదా మాటని మార్చుకొనే స్వభావం కలది, అనే అర్ధం లో చూడాలి..

తాను సహజం గ, చూడ భయంకరమైన రూపం కలిగినదియే, ఐనా ఆ సుందర స్వరూపమైన ఆ శ్రీరామచంద్రుని చూడగానే, తన రూపాన్ని అంటే సుందరం గ మార్చుకొని, శ్రీరామ మరియు లక్ష్మణ స్వామి తో, తన యొక్క ప్రేమను లేదా కోరికను వ్యక్తపరచింది…ఆ తరువాత కధ మీకు బాగుగ తెలిసినదే…

అంతటితో, ఆ కధ, ఆగలేదు, ఆమెను, ముందుగానే, వాల్మీకి కామరూపిణి గానే, పరిచయం చేసారు కదా, ఇప్పుడు, తన ముక్కు, చెవులు, కోసిన తరువాత, తన అన్నగారైన రావణాసురుని ముందు, ప్రత్యక్షమై,అన్నగారి మనసు యెరిగినది కావున, తాను చేసిన తప్పిదం (అంత తప్పిదం అనే అనలేము, అసురులు కదా), కంటే, ఆ పర్ణశాల యందు ఉన్న, అత్యంత సుందరీమణి, ఐనా సీతమ్మ యొక్క అందమును చాల గొప్పగా చెప్పటం జరిగింది… అంటే ఎంతవరకు చెప్పాలి… తనకు సీతమ్మ చేసిన లేదా కలుగచేసిన ఇబ్బంది ఏమి లేదు, కానీ తనకు దక్కనిది, ఎవరికీ దక్కరాదు, అనే సంకుచిత స్వభావంతో, ఆ సీతమ్మ యొక్క అందాన్ని పొగిడి, రావణాసురుడి, మనసుకు, హత్తుకునే లాగా మాట్లాడింది, ఆ అసుర చెల్లి అయిన సూర్పనఖ… అంటే ఈ సారి రూపం కాదు మార్చింది, తన ప్రవృత్తిని..

మనం చూడకలిగితే, ఈ సమాజంలో , మనచుట్టూ, ఎన్ని, కామరూపిణులు తిరుగాడుతుంటారో కదూ.. రావణాసురుడు కక్ష తీర్చుకోలేదు, తన అన్నగారిలో ఉన్న ఒక అరిషడ్వార్గని మేల్కొల్పి…సూర్పనఖ తన కక్ష తీర్చుకుంది,ఆ అసుర చెల్లి చేసిన కామరూప విద్యకి, ఆ అన్నగారైన రావణాసురుడు, ఆ అరిషడ్వార్గానికి (కామ) వశుడై, బానిసుడై, తన మృత్యువును తానె ఆహ్వానించుకున్నాడు తరువాత కాలములో…

“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు”

జై శ్రీమన్నారాయణ

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *