సత్యం వధ, ధర్మం చెర…ధర్మో రక్షిత రక్షితః
సత్యం వధ, ధర్మం చెర…ధర్మో రక్షిత రక్షితః
మనకున్న విజ్ఞాన పరిధి లో ధర్మాన్ని, మూడు రకాలుగా విభజించవచ్చు, ఒకటి, యుగ ధర్మం, రెండు, కాల ధర్మం, మూడవది, యుగానికి కాలానికి అతీతమైంది. ఇప్పుడు ఒకదాని తరువాత ఒకటి చూద్దాం….
యుగ ధర్మం: మనకున్న కృత, త్రేతా, ద్వాపర, మరియు కలియుగ లుగా చెప్పబడ్డాయి. అవునా ! కాదా ! ఎప్పుడైనా ఏ యుగములో ఐన, మనిషి మాత్రమే ధర్మ ఆచరణ చేయవలసింది…
కాల ధర్మం: ఇక్కడ మనం, ప్రకృతీ పరంగా చూడాలి…ఉదాహరణ: ప్రకృతి లో ఉన్న రుతువులు, వాటి ధర్మాన్ని అనుసరించి, మనప్రేమేయం లేక తాను రూపాన్ని కాలానుసారంగా మార్పుచెందుతుంటాయి…
యుగానికి మరియు కాలానికి అతీతమైనది: సృష్టి ధర్మంగా చెప్పబడుతుంది….
ధర్మం: ధర్మం అనేది, దేశ, కాలమాన, చట్ట నియమాలకు అతీతముగా ఉంటుంది. ఇది, ఎప్పటికి మారదు, కానీ ధర్మాచరణ మనిషి మీద ఆధారపడివుంటుంది. సరదాగా, ఒక మాట, “యధా రాజా తధా ప్రజా”, భగ్వద్గీత ను అనుసరించి “యద్యదాచరతి శ్రేష్ఠహ…..అనువర్తతే ”
ఉదాహరణ: మనిషి ని మనిషి గౌరవించటం. మనిషి తన ఎదురుగ ఉన్న మనిషి తో ఎలా ప్రవర్తించాలి లేదా నడుచుకోవాలి, మరి, ఈ విషయాలు.. సూత్రములకు, నియమాలకు, విలువలకు, చట్టాల పరిధి లో రావు.. ధర్మం పూర్తిగా మనిషి యొక్క వృత్తి మరియు ప్రవృత్తి మీదే ఆధారబడి ఉంటుంది… ఈ ధర్మాచరణ మానవునిగా, మనం ఆచరణ లో విఫలం అగుటచే, ఇన్ని, అకృత్యాలు జరుగుతున్నాయి….
సూత్రాలు (ప్రిన్సిపుల్స్): సైన్స్ అండ్ టెక్నాలజీ కి, చాల దగ్గరగా ఉన్న, లేదా అనుసంధానమైనది, ఇవి, నిరంతరం మార్పు చెందుతుంటాయి, ఒకరు చెప్పినా సూత్రాన్ని మరొకరు విభేదించవచ్చు, తగిన సాక్ష్యాధారాలతో, కాబట్టి, మనిషి యొక్క మేధస్సు కు సంబందించినది, అయితే అప్పుడు అందుబాటులో ఉన్న శాస్త్రీయ విషయ లేదా పరిజ్ఞాన లేదా ఆ పరికరాలను బట్టి, నిజ నీఱుపున చేయబడటానికి అవకాశం ఉంటుంది…
నియమాలు (రూల్స్) : ఇది కూడా, చట్టాలకు అంతర్గతంగా గుర్తించబడతాయి, అంటే, ఈ నియమాలు పాటించకపోతే, ఆ వ్యక్తిని, చట్ట పరంగా నియమాల ఆచరణ విధానాన్ని చూసి, తగిన తీర్పును ఇవ్వడం జరుగుతూ ఉంటుంది (లభ్యమైన ఆధారములని బట్టి ఉంటుంది…)
విలువలు (వాల్యూస్) : దేశ, కాలమాన, పరిస్తుతులన్ని అనుసరించి, ఇవి మారుతుంటాయి… ఈ విలువలు, మారుతూఉంటాయి. ఎలా అంటే, ఇండియా మరియు కెనడా తీసుకొంటే, శీతాకాలములో మన వస్త్రధారణ లో వ్యతాస్యం చూడవచ్చు….
చట్టాలు (Laws) : ఒక వ్యవస్థ లో ఉన్న చట్టాలు ప్రకారం, నియమాలు తయారుచేయబడుతాయి, అవి ఆచరించనప్పుడు, ఆ చట్టాలను అనుసరించి, లభ్యమైన ఆధారాలన్నీ పరిగణలోనికి తీసుకోని తగిన న్యాయాన్ని, ఆ న్యాయాధికారి అందచేస్తారు.. ఇది.. కాలానికి అనుగుణంగా మార్పుచెందుతాయి లేదా తయారుచేయబడతాయి…
ఏ యుగంలో అయినా , ఒకటి ధర్మ ఆచరణ , రెండవది “ధర్మ రక్షణ లేదా ధర్మ సంరక్షణ”, ఈ పరిక్రమములో, మన గ్రంధాలలో లేదా పురాణాలలో చెప్పిన విధముగా, కలియుగాంతం, ధర్మం పూర్తిగా కనుమరుగై,అధర్మమే రాజ్యమే ఏలుతున్నప్పుడు, ధర్మ రక్షణార్థం జరిగే ప్రక్రియే కలియుగాంతం… అది ఏ రూపం లేదా ఎవరివల్లన అని చెప్పలేం కానీ, ప్రకృతి తన ధర్మాన్ని చిట్టచివరగా ఆచరణలోకి తీసికొనివచ్చి, తిరిగి, ప్రకృతి పునర్నిర్మాణం జరుగుతుంది ( అదే కాల ధర్మం), ఆ కాల స్వరూపుడను నేనే అనే శ్రీకృష్ణ పరమాత్ముడు ముందుగానే (తృణావర్తుని విషయములో) చెప్పి ఉన్నారు, ఆ స్వరూపాన్ని, కల్కి ( కాలమునకు చెందినవాడని అనే అర్ధం లో చూడాలి)….
“శుభం భూయాత్ , సర్వే జన సుఖినో భవంతు”
జై శ్రీమన్నారాయణ